అది.. ఇది అని తేడా లేకుండా కరోనా ప్రభావం అన్ని రంగాలపైన పడింది. ఇప్పుడిప్పుడే మహమ్మారి పంజా నుంచి ఆర్థికంగా అన్ని రంగాలు కోలుకుంటున్నాయి. వేడుకలు, ఉత్సవాలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయని సంబురపడ్డ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు నూతన ఏడాది వేడుకలు నిషేధించడంతో ఒక్కసారిగా కూలబడ్డాయి.
సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ నూతన సంవత్సర వేడుకలకు అనుమతిలేదని ప్రకటించడం వల్ల ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల నిర్వాహకులు నిరాశ చెందారు. గతంలో న్యూ ఇయర్ వేడుకలకు ఒక ఈవెంట్కు రూ.10 నుంచి రూ.15 కోట్ల దాకా టర్నోవర్ ఉండేదని, ఈ ఏడాది నష్టాలు తప్పేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయని, ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలకు అనుమతించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.
- ఇదీ చూడండి : నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదు: సజ్జనార్