1. సరికొత్తగా పార్లమెంటు సమావేశాలు
కరోనా నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సరికొత్త వాతావరణంలో జరుగుతున్నాయి. ఎంపీలందరూ మాస్కులు ధరించి హాజరయ్యారు. సభ్యులు భౌతిక దూరం పాటించేలా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సభ్యుల హాజరు కోసం రిజిస్టర్ బదులుగా తొలిసారి యాప్‌ను ఉపయోగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తి
రైతులు, ప్రజలకు లంచాలు ఇచ్చే బాధ తప్పాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సీఎం కేసీఆర్ తెలిపారు. పకడ్బందీ వ్యూహంతో పేద రైతుల హక్కులు కాపాడుతామన్నారు. శాసనమండలిలో కొత్త రెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా చట్టాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వైద్య సీట్లు కోల్పోయే పరిస్థితి ఉండకూడదు
అధ్యాపకులు లేక రాష్ట్రం... వైద్య సీట్లు కోల్పోయే పరిస్థితి ఉండకూడదని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. వైద్య సీట్లు కోల్పోతే రాష్ట్రానికి, విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. వైద్య విద్యార్థులపై ప్రభావం లేకుండా బోధనా సిబ్బంది వయో పరిమితి మాత్రమే పెంచుతున్నామని స్పష్టం చేశారు. వైద్య కళాశాలల్లో అధ్యాపకుల వయోపరిమితిని పెంచుతూ శాసనసభలో బిల్లు పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. వ్యవసాయ ఆర్డినెన్సులు రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక మూడు ఆర్డినెన్సులు రద్దు చేయాలని అఖిలపక్ష రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పంటల కొనుగోళ్లకు స్వేచ్ఛా వాణిజ్యం, కంపెనీలకు కార్పొరేట్ వ్యవసాయం, వ్యవసాయోత్పత్తుల నిల్వలపై పరిమితి విధించాలని కోరారు. వ్యవసాయదారులు, గృహ వినియోగదారులపై ఛార్జీల భారం పెంచే విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. పార్లమెంటుకు సోనియా, రాహుల్ గైర్హాజరు
అసాధారణ పరిస్థితుల్లో నిర్వహిస్తోన్న పార్లమెంటు సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గైర్హాజరు అయ్యారు. సాధారణ వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లిన సోనియా.. కరోనా కాలంలో కీలకమైన సమావేశాల్లో పాల్గొనకపోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఆ 5 రాష్ట్రాల నుంచే
ప్రపంచ దేశాలతో పోలిస్తే.. భారత్‌లో కరోనా ప్రభావం సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ లోక్‌సభలో తెలిపారు. దేశంలో 60 శాతం కొవిడ్ కేసులు కేవలం 5 రాష్ట్రాల నుంచే నమోదవుతున్నట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. జపాన్ ప్రధానిగా 'యోషిహిడే సుగా'
షింజో అబే వారసుడిగా, జపాన్ తదుపరి ప్రధానిగా యోషిహిడే సుగాను ఎన్నుకుంది అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ. సుగాకే భారీ సంఖ్యలో మద్దతు పలికారు పార్టీ నేతలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. కరోనా సోకిన కణాల తీరు ఎలా ఉంటుందంటే?
కరోనా గురించి రోజుకో విషయాన్ని కనుగొంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా శ్వాసకోశ వ్యవస్థలో కరోనాతో కలిగే ఇన్‌ఫెక్షన్ తీరును సచిత్రంగా అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. శ్వాస నాళాల్లో వైరస్ ఇన్‌ఫెక్షన్ తీవ్రతను ఈ చిత్రాలు కళ్లకు కడుతున్నాయి. వైరల్ లోడు అధికంగా ఉండటం వల్ల ఆ సూక్ష్మక్రిములు ఇతర అవయవాలకు, వ్యక్తులకు సంక్రమిస్తున్నాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఆర్సీబీ పూర్తిగా డిఫరెంట్
కరోనా విశ్రాంతి తర్వాత జట్టును గాడిలో పెట్టగల సత్తా కెప్టెన్ కోహ్లీకి ఉందన్నాడు డివిలియర్స్. ఈసారి ఆర్సీబీలో కొత్త ఉత్తేజం కనిపిస్తుందని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. రజినీ సీఎం అభ్యర్థి అయితేనే...
కోలీవుడ్ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టతనిచ్చారు. తాను గురువుగా భావించే సూపర్‌స్టార్ రజినీకాంత్ సీఎం అభ్యర్థిగా ఎన్నికల్లో పాల్గొంటే తానూ రాజకీయాల్లోకి వస్తానని ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.