1. రెవెన్యూ చట్టం
రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చట్టింది. కొత్త రెవెన్యూ విధానానికి సంబంధించిన 4 బిల్లులను ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. పూర్తి పారదర్శకత సేవలు అందించే లక్ష్యంతో బిల్లులు తెచ్చినట్లు స్పష్టం చేశారు. వీఆర్వో వ్యవస్థ రద్దవనుండగా రెవెన్యూ కోర్టుల స్థానంలో ట్రైబ్యునళ్లు ఏర్పాటు కానున్నాయి. భూవివాదాలపై ట్రైబ్యునళ్ల తీర్పే తుది నిర్ణయం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. భారత్ బయోటెక్ కృషి అభినందనీయం
భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌పై ఎంఐఎం శాసనసభపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంశలు కురిపించారు. కరోనా వాక్సిన్ కోసం భారత్ బయోటెక్ చేస్తోన్న కృషిని అసెంబ్లీలో కొనియాడారు. తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. వీడని మిస్టరీ
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యువకుడి వేధింపులు.. కుటుంబసభ్యుల మందలింపులు తదితర పరిణామాలపై దృష్టిసారించారు. కాకినాడకు చెందిన దేవరాజురెడ్డిపై గతంలోనే శ్రావణి వేధింపులు, అత్యాచారయత్నం కేసు పెట్టగా.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. తల్లిదండ్రుల మందలింపు అంశాలు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. అక్రమార్కులు అరెస్టు
ఓ రైతు నుంచి భారీగా లంచం డిమాండ్ చేసిన మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ సహా నర్సాపూర్ ఆర్డీవో అరుణ, తహసీల్దార్ సత్తార్, నగేశ్ బినామీ జీవన్‌గౌడ్‌ను అనినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. మెదక్ మండలం మాచవరంలోని అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అనిశా డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఏపీలో కేసులెన్నంటే?
ఏపీలో 24 గంటల వ్యవధిలో 10,418 కరోనా కేసులు నమోదయ్యాయి. 74 మంది మృతిచెందారు. మొత్తం బాధితుల సంఖ్య 5,27,512కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 4,634 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనా నుంచి 4,25,607 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 34 లక్షల కరోనా రికవరీలు
దేశవ్యాప్తంగా దాదాపు 34 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో రికవరీ రేటు 77.77 శాతానికి చేరింది. అలాగే మరణాల రేటు 1.69గా ఉంది. కర్ణాటకలో తాజాగా 9,540 మంది కరోనా బారిన పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. టీకా ప్రయోగాలకు బ్రేక్ పడదు
ఆక్స్ఫర్డ్ టీకా ట్రయల్స్‌కు బ్రిటన్‌లో బ్రేక్ పడినప్పటికీ.. అది భారత్‌లో జరుగుతున్న ప్రయోగాలపై ఎలాంటి ప్రభావం చూపించదని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా స్పష్టం చేశారు. తమ సంస్థ అభివృద్ధి చేస్తున్న టీకా ఉత్పత్తి తాము నిర్ణయించిన ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ప్రపంచంపై కొవిడ్ పంజా
ప్రపంచ దేశాలపై కొవిడ్ విలయతాండవం కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2కోట్ల 77లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 9లక్షల 2వేలకు ఎగబాకింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. రోహిత్ భారీ సిక్సర్
సిక్సర్లకు పెట్టింది పేరైన రోహిత్‌శర్మ.. ప్రస్తుతం ఐపీఎల్ కోసం సన్నాహాల్లో ఉన్నాడు. తాజాగా జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న హిట్‌మ్యాన్ భారీ సిక్సర్ బాదాడు. అది కాస్తా వెళ్లి కదులుతున్న బస్సుపై పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఐసీయూలో సురేఖా సిక్రీ
బుల్లితెర బామ్మ, జాతీయ అవార్డు గ్రహీత సురేఖా సిక్రీ.. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మంగళవారం ఆసుపత్రిలో చేరారు. బుధవారం నాటికి ఆమె పరిస్థితి సాధారణంగానే ఉన్నా... ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సన్నిహితులు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు సహా అభిమానులు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.