1. మాతృభాషను ప్రేమించాలి
ప్రతీ ఒక్కరూ ప్రయోగాత్మకంగా వారంలో ఒక రోజు పూర్తిగా మాతృభాషలోనే మాట్లాడాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం, తెలుగు అకాడమీ సంయుక్తంగా జ్ఞాన సముపార్జన మాధ్యమం-మాతృభాష అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కరోనాను కడిగేస్తోంది!
కరోనా బారిన పడి ఓ వ్యక్తి మానసిక క్షోభ అనుభవించాడు. తనలా ఎవరూ బాధపడకూడదని నిర్ణయించుకున్నాడు. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటే వైరస్ పోతుంది కానీ సరకులపై ఎలా పోతుందని ఆలోచించాడు. అలా ఆలోచించడమే కాదు... సొంత ఖర్చుతో యూవీ శానిటైజర్ పరికరాన్ని తయారుచేశాడు. ఆయనే మందమర్రికి చెందిన గడ్డం ప్రవీణ్‌కుమార్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.భయపడకండి...
కరోనా వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. లక్షణాలు లేకున్నా... పాజిటివ్ వచ్చిందని... ఈ సమయంలో ఆయన తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. హైకోర్టుకు బీఎస్పీ
రాజస్థాన్‌లో బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంపై హైకోర్టును ఆశ్రయించింది ఆ పార్టీ. కాంగ్రెస్ చర్యను సవాలు చేస్తూ రిట్ దాఖలు చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు భగవాన్ సింగ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. తిరుమలలో పవిత్రోత్సవాలు
తిరుమలలో రేపటి నుంచి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలు జరిగే ఈ మూడురోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'సోనూ' మరో సాయం
సోనూసూద్.. కరోనా కష్టకాలంలో సాయానికి మారుపేరుగా నిలుస్తున్న పేరు. ఇప్పటికే ఎంతోమంది వలస కూలీలను స్వగ్రామాలకు చేర్చిన ఈ సినీనటుడు.. మరెంతో మందిని ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. రాష్ట్రాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా మారుతున్న సోనూ.. తాజాగా రష్యాలో చిక్కుకున్న దేశ విద్యార్థులు స్వస్థలాలకు రావడంలో సాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. నేనంటే ఎవరికీ ఇష్టం లేదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు... అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కంటే తనను ఎందుకు తక్కువ ఇష్టపడుతున్నారో అని ప్రశ్నించారు ట్రంప్. తానంటే ఎవరికీ ఇష్టం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతలోనే సర్దుకుని... తన వ్యక్తిత్వమే అటువంటిదని సమర్థించుకొన్నారు. దీంతో ట్రంప్... స్వీయ విమర్శ చేసుకున్నట్లైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. హైడ్రాక్సీ క్లోరోక్విన్ బాగా పనిచేస్తుంది
కొవిడ్ నియంత్రణకు హైడ్రాక్సీక్లోరోక్విన్ బాగా పనిచేస్తుందని తను చేసిన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. చాలా మంది వైద్యులు కూడా తన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్ చికిత్సకు మలేరియా ఔషధం వాడడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నా... ట్రంప్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దు
తైపీ ఓపెన్, కొరియా ఓపెన్ సహా మొత్తం నాలుగు టోర్నీలను రద్దు చేసింది ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. విలన్‌గా సంజయ్
'కేజీఎఫ్ చాప్టర్ 2'లో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రపై ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రోజు అతడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం సంజయ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. అయితే గతంలోనూ సంజయ్ అనేక సార్లు విలన్‌గా నటించాడు. ఆ విశేషాలేంటో చూసేద్దాం రండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.