1. బుకింగ్ లేకుండా రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలో పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. స్లాట్ బుకింగ్‌తో సంబంధం లేకుండా కార్డ్ విధానంలో రిజిస్ట్రేషన్లు జరగుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రద్దీ ఉన్న ప్రాంతాల్లో ముందస్తు టోకెన్లు జారీ చేసి ఇబ్బంది లేకుండా సబ్ రిజిస్ట్రార్‌లు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. యాసంగిపై సమీక్ష
యాసంగి పంట కాలంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... ఉన్నతాధికారులతో సమీక్షించారు. పంటల కొనుగోళ్లు సహా తాజా యాసంగి పంటల సాగు సరళి, ప్రత్యామ్నాయ పంటల సాగు విధానం, రసాయన ఎరువుల వినియోగం, భూసార పరీక్షలు వంటి అంశాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సర్కారు అప్రమత్తం
యూకేలో కొత్త రకం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తం అయింది. గత వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటోంది. ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు కరోనా సర్వేలెన్సు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. సీసీఎస్ దాడులు
హైదరాబాద్ బేగంపేట పిన్ ప్రింట్ టెక్నాలజీ లోన్ యాప్ కాల్‌సెంటర్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. గురుగావ్ కేంద్రంగా కాల్ సెంటర్ కొనసాగుతున్నట్లు గుర్తించారు. బేగంపేట, పంజాగుట్ట, మరో ప్రాంతంలోని పిన్ ప్రింట్ కాల్ సెంటర్లలో సోదాలు కొనసాగిస్తున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మహారాష్ట్రలో మళ్లీ కర్ఫ్యూ
ఐరోపా దేశాలను కలవరపెడుతోన్న కొత్తరకం కరోనా వైరస్ పట్ల మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు 15రోజుల పాటు రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది ఠాక్రే ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. వియత్నాం కీలక భాగస్వామి: మోదీ
వియత్నాం ప్రధాని నుగుయెన్ జువాన్‌తో వర్చువల్‌గా సమావేశమయ్యారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి రెండు దేశాల మధ్య భాగస్వామ్యం చాలా కీలకమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. వినీలాకాశంలో అద్భుతం
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. గురు, శని గ్రహాల కలయిక జరిగింది. భూమి మీద నుంచి చూస్తే.. రెండు అతిపెద్ద గ్రహాలు ఒకే నక్షత్రంలో కనువిందు చేస్తున్నాయి. దాదాపు 4 శతాబ్దాల తర్వాత చోటుచేసుకుంది ఈ అద్భుత ఘట్టం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. బ్రిటన్‌తో కనెక్షన్ కట్
బ్రిటన్‌లో కరోనా కొత్త రకం స్ట్రెయిన్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఇప్పటికే సరిహద్దులు మూసివేయగా.. ఇప్పుడు ఆ జాబితాలో ఫ్రాన్స్ కూడా చేరింది. భారత్ సహా పలు దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాజ్ఞలు విధించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. మార్కెట్లకు బ్రిటన్ దెబ్బ
కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తిపై ఆందోళనలు దేశీయ మార్కెట్లను కుదిపేశాయి. బ్రిటన్‌లో ఆంక్షలు, ఐరోపా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమవటం వల్ల దేశీయ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఒకదశలో ఏకంగా 1,500 పాయింట్లకుపైగా నష్టపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ప్రశ్నించిన షారుక్ కుమార్తె
హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీని ప్రశ్నించింది షారుక్ కుమార్తె సుహానా. సినిమాల్లోని పాత్రల కోసం భారత యువరాణుల్ని ఎందుకు తీసుకోవట్లేదని అడిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.