ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @9PM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 9PM NEWS
టాప్‌టెన్‌ న్యూస్‌ @9PM
author img

By

Published : Nov 22, 2020, 9:00 PM IST

1. రూ.25 వేలిస్తే మేమే చప్పట్లు కొడతాం: కేటీఆర్​

ఆరేళ్లలో కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలని భాజపా నేతలకు కేటీఆర్​ డిమాండ్ చేశారు. ​అసలు భాజపాకు ఎందుకు ఓటువెయ్యాలో ప్రజలు ఈ పార్టీ నేతలను ప్రజలు నిలదీయాలని సూచించారు. ఖైతరాబాద్ లైబ్రరీ సెంటర్​ వద్ద రోడ్​ షోలో కేంద్రం, భాజపా నాయకలపై విమర్శణాస్త్రాలు ఎక్కుపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'రెండునెలల్లో ప్రభుత్వాన్ని పడగొట్టగలం'

ఎంఐఎం తలుచుకుంటే తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టడం పెద్దపని కాదని రెండునెలల సమయం సరిపోతుందని చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. కిలోబియ్యం పథకానికి కేంద్రమే రూ.30 ఇస్తోంది: కిషన్​రెడ్డి

రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేయని వారికి.. గ్రేటర్​ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కులేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. రూపాయికు కిలో బియ్యం పథకానికి కేంద్రం కేజీకి రూ.30 ఇస్తోందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. తెరాస నేతలు దోచుకున్నారు: ఉత్తమ్​

హైదరాబాద్‌ అభివృద్ధి కాంగ్రెస్‌ వల్లే జరిగిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. వరద సాయం కోసం వందల కోట్లు ఖర్చు చేశామంటూ... తెరాస అసత్యాలు చెబుతోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'ఒప్పంద లక్ష్యాలను భారత్​ అధిగమించింది'

వాతావరణ మార్పులపై సమగ్ర విధానంతో పోరాడాలని జీ20 సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న ఆయన 'సేఫ్‌ గార్డింగ్ ది ప్లానెట్' అనే అంశంపై ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. టీకా అత్యవసర అనుమతులపై దృష్టి

కరోనా వ్యాక్సిన్​ అభివృద్ధి తుదిదశకు చేరుకుంటున్న నేపథ్యంలో కేంద్రం వ్యాక్సిన్ అనుమతులపై దృష్టిసారించింది. అత్యవసర అనుమతులు సహా వినియోగానికి అంగీకారం తెలిపే అంశాలను పరిశీలిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'సమష్టి కృషితోనే అరికట్టగలం'

జీ-20 సదస్సులో ఆయా దేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. కరోనా మహమ్మారి అంతం, వ్యాక్సిన్ పంపిణీ​, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలు, వాటికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. రికార్డు స్థాయిలో ఎఫ్‌ఐఐలు

భారత్​లో విదేశీ సంస్థాగత మదుపుదారులు (ఎఫ్​ఐఐలు) ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులు పెడుతున్నారు. నవంబరులో అత్యధిక నెలవారీ ఎఫ్ఐఐ పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నికరంగా ఎఫ్‌ఐఐలు రూ.1.34 లక్షల కోట్ల పెట్టుబడులు మన మార్కెట్లోకి తీసుకువచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'ఏ స్థానంలోనైనా సిద్ధం'

ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు​ సిరీస్​లో తాను ఏ స్థానంలోనైనా ఆడేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపాడు టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​ రోహిత్ శర్మ. ప్రస్తుతం తాను మానసికంగా దృఢంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్​ ఆటడం కష్టంగా ఉంటుందని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'రజనీ ఆరోగ్యం బాగానే ఉంది'

అగ్ర కథానాయకుడు రజనీకాంత్​ ఆరోగ్యంపై వస్తోన్న వదంతుల గురించి స్పందించారు ఆయన ప్రతినిధులు. తలైవా ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.