ETV Bharat / city

టాప్ ​టెన్​ న్యూస్ @7PM - telangana main news today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్ ​టెన్​ న్యూస్ @7PM
author img

By

Published : Dec 27, 2020, 6:58 PM IST

1.నియంత్రిత సాగు ఉండదు

రాష్ట్రంలోని రైతులందరికి రేపటి నుంచి రైతుబంధు పథకం కింద ఆర్థిక సాాయం అందిస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి ప్రగతిభవన్​లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. రక్షకుడుగా భాగ్యనగరం

2020.. ఈ సంవత్సరం పేరు వింటే చాలు యావత్​ ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్​- 19 పేరు గుర్తుకొస్తుంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు హైదరాబాద్​ మహానగరంలో 5 ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్​ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. మలుపుతిప్పిన 2020

రాష్ట్ర రాజకీయం 2020లో మలుపు తిరిగింది. సంవత్సరం పొడవునా.. తెరాస ఆధిపత్యం కొనసాగినా ఏడాది చివర్లో మాత్రం భాజపా అనూహ్యంగా పుంజుకుంది. పురపోరు, సహకార ఎన్నికల్లో కారు పార్టీకి ఎలాంటి సవాల్ ఎదురుకాకపోయినా దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం పార్టీ సంచలన ఫలితాలను సాధించింది. కాంగ్రెస్ మాత్రం చతికిలపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 25 మందికి అస్వస్థత

నాటుసారా తాగి 25 మంది అస్వస్థతకు గురైన ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సిరిమామిడిలో చోటు చేసుకుంది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా..శ్రీకాకుళం జీజీహెచ్​లో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 23 మంది కోలుకోవటంతో ఆసుపత్రి నుంచి ఇళ్లకు పంపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఆ లేఖకు మోదీ స్పందన

తమ గ్రామ సమస్యపై ఏకంగా ప్రధాని మోదీకే లేఖ రాసిందా చిన్నారి. ఇలా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. వెంటనే చిన్నారి లేఖకు ప్రధాని కార్యాలయం స్పందించింది. వివరణ ఇవ్వాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. పాక్​ కుట్ర

నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్​ దాడులకు దిగే అవకాశం ఉందని ఆర్మీ ఉన్నతాధికారి తెలిపారు. కాల్పుల విరమణతో పాటు అక్రమ చొరబాట్లకు తావుందని తేల్చి చెప్పారు. తమ దేశ అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలా చేసే అవకాశముందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. పసిడికి రెక్కలు

కరోనా కారణంగా ఈ ఏడాది పెట్టుబడి సాధనాలన్నీ గతంలో ఎన్నడూ లేనంతగా ఒడుడొదుకులు ఎదుర్కొన్నాయి. సంక్షోభ కాలంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచే పసిడి ఈ సారి కూడా మంచి లాభాలను ఇచ్చింది. వచ్చే ఏడాది కొవిడ్ వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఏడుగురు మృతి

చైనాలో ఓ వ్యక్తి జరిపిన కత్తి దాడిలో ఏడుగురు మృతి చెందారు. లియోనింగ్​ రాష్ట్రంలోని కైయుయాన్​ నగరంలో జరిగిన ఈ ఘటనలో నిందితుణ్ని పట్టుకోబోయిన ఓ పోలీసు అధికారి సహా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఆధిపత్యం ఎవరిదో?

ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ఇండియా బాక్సింగ్ డే టెస్టులో కంగారూ జట్టుతో తలపడుతోంది. ఇప్పటివరకు ఆసీస్​తో జరిగిన బాక్సింగ్ డే టెస్టుల్లో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. మొత్తంగా ఇప్పటివరకు 8 బాక్సింగ్ డే టెస్టులు జరగ్గా ఇందులో ఒక్కసారి మాత్రమే భారత్ గెలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. సంక్రాంతికి అల్లుడు అదుర్స్

యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం 'అల్లుడు అదుర్స్'. మరో యువ నటుడు కిరణ్ అబ్బవరం నటిస్తోన్న చిత్రం 'సెబాస్టియన్'. తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్​డేట్స్ వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.