ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్@7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 7PM NEWS
టాప్​టెన్​ న్యూస్@7PM
author img

By

Published : Nov 1, 2020, 7:00 PM IST

1. ముగిసిన ప్రచార పర్వం

దుబ్బాక ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దుబ్బాకలో తమ జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. గెలిచేందుకు భాజపా కుట్ర: కేటీఆర్

సోమవారం భాగ్యనగరంలో భాజపా భారీ స్థాయిలో కుట్రకు పథకం రచించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ కుట్రలకు తెరలేపినట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. అల్లర్లు సృష్టించాలని చూస్తోంది: తెరాస

భాజపా నాయకులు నగరంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని తెరాస నేతలు ఆరోపించారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి, ఈసీ అదనపు సీఈవో బుద్ధ ప్రకాశ్​ను కలిసి... శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. పరామర్శించిన బండి సంజయ్​

హైదరాబాద్​ నాంపల్లిలోని భాజపా కార్యాలయం వద్ద ఆత్మహత్యకి యత్నించిన శ్రీనివాస్​ అనే యువకుడు సికింద్రాబాద్​ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న తను.. శ్రీనివాస్​ విషయం తెలియగానే హుటాహుటిన హైదరాబాద్​కి తరలి వచ్చినట్లు బండి సంజయ్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. బిహార్​లో ప్రచారానికి తెర

బిహార్​లో రెండో దశ పోలింగ్​ జరిగే ప్రాంతాల్లో ప్రచార పర్వం ముగిసింది. రెండో విడతలో భాగంగా నవంబర్​ 3న.. 94 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'రాజకీయ హత్యలే నిదర్శనం'

రాజకీయ హత్యలు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్క్​ రాజకీయానికి నిదర్శనమని పేర్కొన్నారు కేంద్ర మంత్రి బాబుల్​ సుప్రియో. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోవటంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ప్రాయోజిత రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. వైద్య ఖర్చులకు సాయం అంతంతే!

భారత్​లో వైద్యం కోసం ప్రభుత్వం నుంచి అందే సాయం అంతంత మాత్రమేనని ఆర్​బీఐ తాజా నివేదిక పేర్కొంది. హెల్త్​కేర్​ కోసం సగటు కుటుంబం చేసే ఖర్చుల్లో అధిక మొత్తం సొంత జేబునుంచే పెట్టుకోవాల్సి వస్తుందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. రాష్ట్ర హోదా ప్రకటించిన పాక్​!

గిల్గిత్​ బాల్టిస్థాన్​కు తాత్కాలిక రాష్ట్ర హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించింది పాకిస్థాన్​. ఈ ప్రాంతంలో ఆదివారం పర్యటించిన ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​.. ఈ మేరకు ప్రకటన చేసినట్లు జియో న్యూస్​ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. అంపైర్ అలీమ్ రికార్డు

ప్రపంచ క్రికెట్​ చరిత్రలో అత్యధిక వన్డేలకు అంపైరింగ్​ చేసిన ఘనత సాధించాడు పాకిస్థాన్​కు చెందిన అంపైర్​ అలీమ్​ దార్​. పాకిస్థాన్​-జింబాబ్వే మధ్య నేడు జరుగుతున్న వన్డేతో ఈ రికార్డు నమోదు చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. సెట్​లోకి పవన్​ ఎంట్రీ​

చాలా నెలల తర్వాత 'వకీల్​సాబ్' సెట్​లో పవన్​ తిరిగి అడుగుపెట్టారు. ఆయనపై కీలక సన్నివేశాల్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తీశారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.