1. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: భట్టి
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతూ... ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని ప్రకటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న రెమ్‌డెసివర్ ఇంజిక్షన్‌పై తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకొని... తక్కువ ధరకే కరోనా బాధితులకు అందించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. స్వామికి చక్రస్నానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారాముల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోదావరి నదిలో చేయాల్సిన చక్రస్నానం కార్యక్రమాన్ని... కరోనా కారణంగా ఆలయంలోనే నదీ జాలలు తీసుకొచ్చి నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ముగ్గురు నిందితుల అరెస్ట్
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా మౌలాలీలో ఆక్సిజన్ సిలిండర్ల అక్రమ రవాణాను రాచకొండ పోలీసులు అడ్డుకున్నారు. మాస్ ఫౌండేషన్ ఎన్జీవో పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'పోరాడాల్సింది కరోనాపై.. కాంగ్రెస్‌పై కాదు'
దేశంలో ప్రస్తుతం పోరాడాల్సింది కరోనాపైనేనని, కాంగ్రెస్‌పై కాదని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయాన్ని మోదీ సర్కార్ గుర్తించాలని ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'సంక్షోభాన్ని చూస్తూ ఉండలేం'
కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సుమోటోగా కేసు విచారణ జరిపింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో జాతీయ సంక్షోభంపై స్పందించకుండా ఉండలేమని పేర్కొంది. హైకోర్టుల్లో కరోనా అంశాలపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. అప్పీళ్ల నమోదుపై కాలపరిమితి పొడగింపు
అప్పీళ్ల నమోదుపై ఉన్న కాలపరిమితిని తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు పొడగిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది సుప్రీం. అటార్నీ జనరల్ సమర్పించే నివేదికను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు
స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 558 పాయింట్లు బలపడి.. 48,900 మార్క్ దాటింది. నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 14,650పైకి చేరింది. లోహ, బ్యాంకింగ్, నిర్మాణ రంగాలు లాభాలకు దన్నుగా నిలిచాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి
పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.46,900 పైకి చేరింది. వెండి ధర కిలో రూ.255 ప్రియమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. 'ప్రత్యేక ఏర్పాట్లు చేయండి'
కరోనా రెండో దశ నేపథ్యంలో ఐపీఎల్ సాఫీగా జరిగే అవకాశాలు కనిపించట్లేదు. కొవిడ్ భయంతో లీగ్‌ను వీడుతున్న ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది! ఇప్పటికే భారత్ నుంచి విమానాల రాకపోకలను నిషేధించింది ఆసీస్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'వకీల్‌సాబ్' ఓటీటీ రిలీజ్ డేట్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'వకీల్‌సాబ్' ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. తొలుత థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించినా.. థియేటర్లు మూతపడటం వల్ల నిర్ణయం మార్చుకుంది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.