ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN 5PM NEWS, top headline news
టాప్​ టెన్​ న్యూస్​@5PM
author img

By

Published : Apr 5, 2021, 4:59 PM IST

1. మహారాష్ట్ర హోంమంత్రి​ రాజీనామా

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పంపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది ఉండొద్దు'

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధికారులను ఆదేశించారు. హన్మకొండలో ధాన్యం కొనుగోళ్లు, కరోనా వ్యాప్తి, సమీకృత మార్కెట్లపై అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్​ సహా పలువురు నేతలతో ఆయన సమీక్ష జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'ఆ యాప్​తో వ్యాధుల వ్యాప్తి తెలుసుకోవచ్చు'

కొవిడ్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్​లోని బీఆర్కే భవన్‌ నుంచి మంత్రి ఈటల రాజేందర్​, అధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఐహెచ్‌ఐపీ యాప్ తెచ్చిన కేంద్రానికి ఈటల ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'ఆయన ప్రజల కోసం శ్రమించిన వ్యక్తి'

ప్రజల కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి బాబు జగ్జీవన్​రామ్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా బషీర్‌బాగ్ నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. రాష్ట్రంలో నేడు వర్షాలు

గత కొన్ని రోజులుగా వేసవి తాపంతో అల్లాడిపోయిన రాష్ట్ర వాసులకు ఇవాళ కాస్త ఉపసమనం లభించనుంది. రాష్ట్రంలో నేడు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ శాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. రక్త దానం చేస్తే పెట్రోల్ ఫ్రీ!

రక్తదానం చేసినవారికి ఎక్కడైనా సాధారణంగా పండ్ల రసాలను ఇస్తారు. కానీ కర్ణాటకలో రక్తదాతలకు పెట్రోల్​ను కానుకగా ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఆ కేసులో యడియూరప్పకు ఊరట

అక్రమ భూమి డినోటిఫికేషన్‌కు సంబంధించిన అవినీతి ఆరోపణ కేసులో కర్ణాటక సీఎం బీఎస్​ యడియూరప్పకు ఊరట లభించింది. ఆయనపై విచారణ జరపాలంటూ.. ఆ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో సోమవారం రూ.44,949 వద్దకు చేరింది. వెండి ధర రూ.200 పైగా దిగొచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'కంగా లీగ్​' మెహ్లీ మృతి

మాజీ క్రికెటర్, 'కంగా లీగ్'లో ఎన్నో ఏళ్లపాటు ఆడిన మెహ్లీ ఇరానీ ఇటీవల మృతి చెందారు. ఈయన మృతిపై పలువురు క్రికెటర్లు, అధికారులు సంతాపం తెలుపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. బిగ్​బీ- దీపిక కాంబోలో సినిమా

హాలీవుడ్​ హిట్​ సినిమా 'ది ఇంటర్న్'​ హిందీ రీమేక్​లో అమితాబ్ బచ్చన్​​, దీపికా పదుకొణె కలిసి నటించనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. వీరిద్దరూ కలిసి నటిస్తున్న మూడో సినిమా ఇది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.