ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news, etv bharat top news
టాప్​ టెన్​ న్యూస్​@5PM
author img

By

Published : Mar 27, 2021, 4:58 PM IST

1. 'టీకా తీసుకున్నా కరోనా వచ్చే అవకాశం'

టీకా తీసుకున్న వారికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. రాష్ట్రంలో 0.7 శాతం కరోనా టీకా వృథా అయిందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. యాదాద్రిలో ఆర్జిత సేవలు బంద్​

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో పలువురు ఉద్యోగులకు కొవిడ్​ పాజిటివ్​ నిర్ధరణ కావడం వల్ల స్వామివారి ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపేశారు. ఆదివారం కావడం భక్తుల రద్ధీ పెరిగే అవకాశం ఉన్నందున భక్తులు పాల్గొనే ఆర్జిత సేవలు రేపటి నుంచి మూడు రోజుల పాటు నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. జూ.కళాశాలల ప్రవేశ పరీక్ష వాయిదా

ఏప్రిల్ 4న జరగాల్సిన సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రవేశ పరీక్ష వాయిదా వేశామని గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఆన్​లైన్ వేదికగా నాటకాలు

ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. సురభి నాటకాలను ప్రేక్షకులు ఆన్​లైన్ వేదికగా వీక్షించేందుకు నిర్ణయించింది. ఈ రోజు నుంచి ఏప్రిల్​ 27 వరకు ఈ నాటకాలను ప్రదర్శించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. కుష్బూ దోశలు- స్మృతి స్టెప్పులు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో కలిసి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా నృత్యం వేశారు. మరో భాజపా నేత కుష్బూ.. ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం దోశలు వెేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. బంగాల్​లో 70%, అసోంలో 62%

రెండు రాష్ట్రాల్లో తొలి విడత పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బంగాల్​లో 70.17 శాతం, అసోంలో 62.09 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మోదీ నివాళులు

బంగ్లాదేశ్​ జాతిపిత బంగబంధు సమాధిని ప్రధాని మోదీ శనివారం సందర్శించి నివాళులు అర్పించారు. బంగబంధు జీవితం స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రతిబింబిస్తుందని మోదీ సందర్శకుల పుస్తకంలో రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'సెప్టెంబర్​ నాటికి 'కొవొవాక్స్‌' టీకా'

ఈ ఏడాది సెప్టెంబర్​​ నాటికి తమ సంస్థ నుంచి భారత్​లోకి మరో కరోనా టీకా రానుందని తెలిపారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా. 'కొవొవాక్స్​' టీకా సామర్థ్యం 89 శాతంగా తేలినట్లు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. బాలికల విద్య కోసం అల్ట్రా మారథాన్​!

అణగారిన వర్గాల పిల్లల చదువుల కోసం ఓ వ్యక్తి అత్యంత క్లిష్టమైన మారథాన్​కు సిద్ధమయ్యాడు. నాలుగు ఎడారుల గుండా మారథాన్​ చేయబోతున్నాడు. మొత్తం 250 కి.మీ.ల పాటు సాగే ఈ పరుగులో పాల్గొననున్న తొలి భారతీయునిగా రికార్డు సృష్టించబోతున్నాడు బెంగుళూరుకు చెందిన తాహెర్​ మర్చంట్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. రామ్​ చరణ్​కు స్పెషల్​ విషెస్

శనివారం హీరో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను 'ఆర్​ఆర్​ఆర్' చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో షేర్​ చేసింది. కాగా చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన హీరో ఎన్టీఆర్​.. ఈ ఏడాది తామిద్దరికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.