ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్ @5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​ టెన్ న్యూస్ @5PM
author img

By

Published : Jan 7, 2021, 4:56 PM IST

1. 'శరవేగంగా ఏర్పాట్లు'

వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఈటల రాజేందర్​ పాల్గొన్నారు. రాష్ట్రంలో తీసుకుంటున్న కొవిడ్ నియంత్రణ చర్యలతోపాటు... వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై కేంద్రానికి ఈటల వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కర్రలతో కొట్టి సంతకాలు

సీఎం కేసీఆర్​ బంధువుల అపహరణ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియనే ప్రధాన నిందితురాలని రిమాండ్ నివేదికలో పోలీసులు తెలిపారు. హఫీజ్​పేట భూముల వివాదంలో డబ్బుల కోసం తన భర్త భార్గవ్​రామ్​, ఏవీ సుబ్బారెడ్డితో కలిసి కిడ్నాప్​నకు పాల్పడినట్లు విచారణలో అఖిలప్రియ అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. రాష్ట్రానికి అనుమతి

రూ.2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసినందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. రాగల 48 గంటలు వర్షాలు

రాష్ట్రంలో రాగల 48 గంటలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న పేర్కొన్నారు. తమిళనాడు తీర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా దీని ప్రభావం కొనసాగుతుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'విమర్శించే స్థాయి సుమన్​కు లేదు'

తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్​కు బండి సంజయ్​ను విమర్శించే స్థాయి లేదని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి పేర్కొన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎస్సీలకు బాల్కసుమన్​ చేసింది శూన్యమని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. లైంగిక దాడి- తల్లి అరెస్ట్

ఓ తల్లి.. కన్న బిడ్డపై లైంగిక వేధింపులకు పాల్పడిన అమానుష ఘటన కేరళలో వెలుగుచూసింది. మైనర్​ బాలుడిపై నాలుగేళ్లుగా తల్లే లైంగిక దాడి చేస్తున్నట్లు శిశు సంక్షేమ కమిటీ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. నిందితుడి కోసం టాస్క్​ఫోర్స్​

ఉత్తరప్రదేశ్​ బదాయూలో సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటనపై సీఎం యోగి అదిత్యనాథ్​ స్పందించారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్​ చేసేందుకు ఎస్​టీఎఫ్​ను ఏర్పాటు చేశారు. మరో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'దాడి ఓ అందమైన దృశ్యం'

డొనాల్డ్ ట్రంప్ అనుచరులు వాషింగ్టన్​లోని క్యాపిటల్ భవనం వద్ద విధ్వంసం చేపట్టడాన్ని అందమైన దృశ్యంగా అభివర్ణించింది చైనా. హాంకాంగ్ అల్లర్లను సమర్థించి, వాషింగ్టన్ ఘటనను ఖండించడం ద్వారా ఐరోపా దేశాల నాయకులు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఆపడం కష్టం

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని తెలిపాడు ఆసీస్ మాజీ పేసర్ మెక్​గ్రాత్. పక్కా ప్రణాళికతో స్మిత్​ను కట్టడి చేశారని కొనియాడాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. విలన్​గా నాని!

తమిళ హీరో విజయ్​ నటించిన 'మాస్టర్'​ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్​ సేతుపతి కనిపించనున్నారు. అయితే ఈ పవర్​ఫుల్​ పాత్రలో తొలుత హీరో నాని, నటుడు మాధవన్​.. వీరిలో ఒకరిని తీసుకోవాలని చిత్రబృందం భావించిందట. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.