1. దేశంలో రికార్డ్ కేసులు
ఆంక్షల సడలింపుల తరువాత దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 24 వేల 850 కొవిడ్ కేసులు, 613 మరణాలు సంభవించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. నక్సల్స్ హతం
ఒడిశా కందమాల్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అన్‌లాక్ 2.0పై సమీక్ష
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్‌లాక్ 2.0 అమలు తీరుపై సమీక్షించింది కేంద్రం. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నత అధికారులతో మాట్లాడారు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పోస్టుకార్డు ఉద్యమం
భూరికార్డుల ప్రక్షాళన జరిగినా లక్షలాది రైతులకు పాస్ పుస్తకాలు రాలేదని ఆరోపించారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. ఇవాళ్టి నుంచి కిసాన్ కాంగ్రెస్ పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభం అవుతుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పైసల ప్రాజెక్టులు
రాష్ట్ర వనరులను తెరాస నేతలంతా దోచుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించింది. పెద్ద ఎత్తున కమీషన్లు దండుకొని.. కనీస నాణ్యత లేకుండా ప్రాజెక్టులు నిర్మించారని ధ్వజమెత్తింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ప్లీజ్ నమ్మండి!
సర్కారు దవాఖానాల్లో కరోనా వైరస్ చికిత్సపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను పటాపంచలు చేసే పనిలో నిమగ్నమైంది రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఉగ్రదాడి
కశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ఓ జవానుకు గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఎంబసీపై రాకెట్ దాడి
ఇరాక్ వైమానిక రక్షణ దళం.. బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన రాకెట్ దాడిని అడ్డుకుంది. అయితే గుర్తు తెలియని శత్రువులు ప్రయోగించిన ఆ రాకెట్ బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్ పరిధిలో కుప్పకూలిందని అల్ అరేబియా వార్తాసంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఒక్క నోబాల్ వేయలే!
మైదానంలో క్రికెట్ ఆడేటప్పుడు బౌలర్లు నోబాల్ వేయడం సహజం. బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయాలనో, పరుగులు నియంత్రించాలనో విభిన్న బంతులు వేసే క్రమంలో అడుగు తడబడుతుంది. ఫలితంగా నోబాల్ గీతను దాటేస్తుంటారు. అయితే ఓ ఐదుగురు అంతర్జాతీయ క్రికెటర్లు మాత్రం కెరీర్లో ఒక్కసారి నోబాల్ వేయలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. పర్వత సంగీతం
చైనా షాంగ్జీలోని మౌంట్ హువాషాన్ పర్వతాల్లో 120 మంది సంగీత కళాకారులు చేసిన ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. సముద్ర మట్టానికి 2,086 మీటర్ల ఎత్తులో ప్రకృతి సోయగాల మధ్య కళాకారులు చేసిన ప్రదర్శన చూపరుల మనసును హత్తుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'ఆ కథకు గ్రీన్ సిగ్నల్'
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి రష్మిక. ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. అయితే ఓ కథను ఎంపిక చేసుకోవాడనికి తనను ఆకర్షించే విషయాలేంటనే దానిపై తాజాగా స్పందించిందీ ముద్దుగుమ్మ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.