ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

ETV BHARAT TOP NEWS
ETV BHARAT TOP NEWS
author img

By

Published : Dec 11, 2021, 6:06 AM IST

Updated : Dec 11, 2021, 10:22 PM IST

21:34 December 11

టాప్​ న్యూస్​ @10PM

  • 'సాంకేతికత పురోగతితో సంప్రదాయ నేరాల దర్యాప్తు వేగవంతం'

dgp mahender reddy speech: హైదరాబాద్‌లో అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్స్- ఏసీఎఫ్‌ఈ చాప్టర్ ఆధ్వర్యంలో 3వ వార్షిక సమావేశంలో డీజీపీ మహేందర్​రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. "అన్‌ఫోల్డింగ్ ఫ్రాడ్ డిటరెన్స్" అనే థీమ్‌లో భాగంగా జరిగిన సదస్సులో సైబర్ మోసాలు– ట్రాన్స్‌ఫార్మేటివ్ ట్రెండ్స్, సైబర్ చట్టం, మిటిగేషన్ మెథడ్స్‌, బ్యాకింగ్, ఆర్థిక మోసాలు, బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం, వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు- 2019 వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

  • మహిళ స్నానం చేస్తుంటే.. ఓనర్​ అబ్బాయి వీడియో రికార్డు..!

Video record while women bathing: మహిళలకు ఇంట్లోనూ భద్రత లేకుండా పోతోంది. సందు దొరికితే చాలు.. కెమెరా కళ్లు కామంతో తెరుచుకుని.. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించేందుకు చూస్తున్నాయి. ఇంట్లో అద్దెకున్న మహిళ స్నానం చేస్తుంటే.. యజమాని కొడుకు చేసిన వికృతచేష్టలు వెలుగులోకి వచ్చాయి.

  • గోడలపై గుట్కా మరకలు.. నలుగురు పోలీసులపై వేటు

Police Spit On Walls: పోలీస్ స్టేషన్ గోడలపై గుట్కాతిని ఉమ్మినందుకు నలుగురు పోలీసులను విధులనుంచి తొలగించారు ఉన్నతాధికారులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

  • అనుకోకుండా క్రికెట్ వైపు..

Ex Cricketer vvs Lakshman: ఏపీ గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రి... హైదరాబాద్ సౌత్ ఏషియన్ లివర్ ఇనిస్టిట్యూట్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో మాజీ క్రికెటర్​ వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు.

  • మతం మార్చుకున్న డైరెక్టర్.. ఆ విషయమే కారణం?

ఓ విషయమై తెగ బాధపడిన మలయాళ డైరెక్టర్ అలీ అక్బర్.. ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి హిందువుగా మారారు. ఇంతకీ ఏం జరిగిదంటే?

20:40 December 11

టాప్​ న్యూస్​ @9PM

  • ఆ కుటుంబంలో మూడు తరాల సైనికులు..

IMA Passing Out Parade 2021: వారి నరనరాల్లో దేశభక్తి నిండిపోయింది. ఆ కుటుంబమంతా దేశసేవకే అంకితమయ్యారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఆ కుటుంబం నుంచి మరో దేశభక్తుడు భరతమాతకు సేవ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఐఎంఏలో శిక్షణ తీసుకుని పదునైన ఆయుధంగా మారాడు. అకుంటిత దీక్ష, కఠోర శిక్షణ ముగించుకొని లెఫ్టినెంట్​ హోదాలో సైనికాధికారి అయ్యాడు.

  • ఉల్లిరైతు కడుపు మండి ఏం చేశాడంటే..

onion farmer Protest: ఉల్లిపాయలను కోసేటప్పుడు మాత్రమే కళ్లు మండటం కాదు.. అమ్మేటప్పుడు రైతు కడుపు కూడా మండుతోంది. మార్కెట్​లో ధర రాక ఉల్లి రైతు కడుపు మండిపోతోంది. ఇలాంటి ఘటన ఏపీలోని కర్నూల్​లో జరిగింది. కడుపు మండిన ఉల్లి రైతు ఏం చేశాడంటే..?

  • ఆ నలుగురి మృతి వెనక కొత్త ట్విస్ట్​

కర్ణాటకలో ఇటీవల ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మతమార్పిడికి బలవంతం చేయడమే ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు వెల్లడించారు.

  • రెచ్చిపోయిన రౌడీ గ్యాంగ్​

పాతకక్షల కారణంగా ఓ యువకుడిని కిరాతకంగా నరికిచంపింది ఓ రౌడీగ్యాంగ్. 12 మంది గూండాలు ఇంట్లోకి చొచ్చుకొచ్చి మరీ యువకుడిని హత్యచేశారు. ఆ తర్వాత యువకుడి కాలును రోడ్డుపై పడేశారు. ఈ ఘటన కేరళలో జరిగింది.

  • 'వామిక రాకతో మా జీవితం పరిపూర్ణమైంది'

Virat Kohli Wedding Anniversary: వివాహబంధంలోకి అడుగు పెట్టి నాలుగేళ్లు అయిన సందర్భంగా తన సతీమణి అనుష్క శర్మకు శుభాకాంక్షలు తెలిపాడు టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. అనుష్క, వామికతో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేశాడు.

19:43 December 11

టాప్​ న్యూస్​ @8PM

  • రసాయన పరిశ్రమలో విషవాయువు లీక్​

తమిళనాడులోని ఈరోడ్‌లో గల రసాయన పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. క్లోరిన్ వాయువు లీకై ఒకరు మృతి చెందారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది.

  • ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌లో విషాదం వెలుగుచూసింది. కుటుంబ కలహాలతో.. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఐదేళ్ల కుమారుడు , మూడేళ్ల కుమార్తెకు ఉరివేసి.. తానూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

  • 'ఆ ఎమ్మెల్యేలు బియ్యం దందాలో ఉన్నారు'

రాష్ట్రంలో ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతోందని.. సరైన ప్రణాళిక లేకపోవడమే ఇందుకు కారణమని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ విమర్శించారు. తరుగు తీస్తుంటే తెరాస ఎమ్మెల్యేలు ఎందుకు రైస్ మిల్లర్ల వద్దకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. రీసైక్లింగ్ బియ్యం దందాలో భాగం అయ్యారు కాబట్టే వెళ్లడం లేదని ఎంపీ ఆరోపించారు.

  • 'పుష్ప' సాంగ్​లో డేవిడ్ వార్నర్

David Warner Pushpa: ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ మరో కొత్త వీడియోతో ముందుకొచ్చాడు. 'పుష్ప' సినిమాలోని 'ఏయ్​ బిడ్డా.. ఇది నా అడ్డా' సాంగ్​కు మార్ఫ్​డ్ వీడియో చేశాడు. దీనిపై టీమ్​ఇండియా టెస్టు సారథి కోహ్లీ స్పందించడం విశేషం.

  • సినిమా సంగతులు..

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ప్రభాస్ ప్రాజెక్టు K, విజయ్ బీస్ట్, అల్లు అర్జున్ పుష్ప, ఎటర్నల్స్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

18:47 December 11

టాప్​ న్యూస్​ @7PM

  • సాయితేజ భౌతికకాయానికి వాయుసేన అధికారుల నివాళి

IAF Tributes Sai Teja: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయానికి నివాళులు అర్పించారు బెంగళూరులోని ఐఏఎఫ్ అధికారులు. సాయి పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

  • 'దేశంలోనే నెంబర్​ 1 గా హైదరాబాద్​ ఐటీ'

MLC Kavitha at Saligram & Techsmart: ఐటీ రంగంలో హైదరాబాద్​ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలో అన్ని వైపులా ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఉద్దేంతో రాష్ట్ర ప్రభుత్వం లుక్​ ఈస్ట్​ పాలసీ విధానం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఉప్పల్​ ఐటీ కారిడార్​లో నూతనంగా ఏర్పాటు చేసిన సాలిగ్రామ్​ & టెక్​ స్మార్ట్​ కంపెనీని కవిత ప్రారంభించారు.

  • ఆ కంపెనీ మూసివేతతో.. దేశంలో సూదుల సంక్షోభం!

రోజూ 1.5 కోట్ల సూదులు, 80 లక్షలకుపైగా సిరంజీలు ఉత్పత్తి చేసే హిందూస్థాన్​ సిరంజీస్​ అండ్​ మెడికల్​ డివైజెస్​ సంస్థ మూతపడింది. దిల్లీలో కాలుష్యం కారణంగా హరియాణాలోని తమ కంపెనీని మూసివేసినట్టు పేర్కొంది. అయితే.. ప్రస్తుత కొవిడ్​ కాలంలో చికిత్సా కార్యక్రమాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపించే అవకాశముంది.

  • 'కెప్టెన్సీ నిర్ణయంలో పారదర్శకత లేదు'

Virat ODI Captaincy: టీమ్​ఇండియా వన్డే జట్టు కెప్టెన్​గా విరాట్​ను తప్పించడంపై కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్​కుమార్ శర్మ స్పందించాడు. బీసీసీఐ నిర్ణయంలో పారదర్శకతలేదని అన్నాడు. మరోవైపు కోహ్లీ కెప్టెన్సీ మార్పుపై సెలెక్షన్‌ కమిటీ తీరును పాకిస్థాన్ మాజీ స్పిన్నర్‌ డానిష్ కనేరియా తప్పుబట్టాడు.

  • బిజినెస్​లో 'పుష్ప' రికార్డులు

Allu arjun pushpa: 'పుష్ప' దుమ్మురేపుతోంది. బిజినెస్​లో రికార్డులు సృష్టిస్తోంది! డిసెంబరు 17న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్​లో రిలీజ్​కు సిద్ధమవుతోంది.

17:43 December 11

టాప్​ న్యూస్​ @6PM

  • 'ముమ్మాటికి ప్రభుత్వ హత్యే'

మెదక్‌ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు రవికుమార్‌ కుటుంబాన్ని వివిధ పార్టీల నేతలు పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. మరోవైపు రవికుమార్​ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. బొగుడ భూపతిపూర్‌లో రవి కుటుంబసభ్యులను పరామర్శించిన షర్మిల... ఇంటి వద్ద దీక్ష చేపట్టారు. రైతు కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

  • రావత్​ హెలికాప్టర్​ ప్రమాదంపై చైనా అవహేళన

China On Rawat Death: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంపై చైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. భారత సైన్యానికి క్రమశిక్షణ లేదని, పోరాట సన్నద్ధత కరవని అవహేళన చేసింది.

  • టోర్నడో బీభత్సం

అమెరికా ఈశాన్య రాష్ట్రం కెంటకీలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడో ధాటికి సుమారు 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర గవర్నర్​ ఆండీ బెషీర్​ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 200మైళ్ల మేర పలు జిల్లాలను బలమైన టోర్నడో చుట్టేసినట్లు చెప్పారు.

  • రుతురాజ్​ గైక్వాడ్ విధ్వంసం

Ruturaj Gaikwad Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ 2021లో మహారాష్ట్ర జట్టు సారథి, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలతో అదరగొడుతున్నాడు. మంచి ఫామ్​ కనబరుస్తున్న గైక్వాడ్ వరుసగా మూడు సెంచరీలు చేశాడు.

  • హీరోయిన్​ నయనతార కొత్త బిజినెస్

Nayanthara bussiness: స్టార్ హీరోయిన్ నయన్ కొత్త వ్యాపారం ప్రారంభించింది. బ్యూటీ కేర్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది.

16:45 December 11

టాప్​ న్యూస్​ @5PM

  • అసాంఘీక కార్యకలాపాలకు అడ్డా

Police raid on tollywood club: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన పబ్​పై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు చేశారు. మహిళలతో.. అశ్లీల నృత్యాలతో పాటు.. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ పబ్​పై గతంలోనూ దాడులు నిర్వహించగా.. పేరు మార్చి మళ్లీ అదే పంథా కొనసాగించగా.. పోలీసులు దాడి చేశారు. 33 మంది పురుషులు, 9 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

  • 'సచివాలయం మీదున్న శ్రద్ధ.. అమరవీరుల స్తూపంపై లేదు'

Revanth visits martyrs stupa: సీఎం కేసీఆర్​కు సచివాలయం మీదున్న శ్రద్ధ.. అమరవీరుల స్థూపంపై లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి విమర్శించారు. స్తూపం నిర్మాణ పనులపై సమీక్షించే తీరిక కేసీఆర్​కు లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లో అమరవీరుల స్మారకం నిర్మాణ పనులను పరిశీలించిన రేవంత్​.. గుత్తేదారుడిని పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  • సెలవుల కోసం విద్యార్థి దుస్సాహసం

Odisha Student Pesticide News: కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తితో లాక్​డౌన్​ వస్తుందని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. దీనితో పాఠశాలకు సెలవులు వస్తాయని భావించాడో విద్యార్థి. అయితే ఈ వార్తలన్నీ ఫేక్​ అని ప్రిన్సిపల్ ప్రకటించాడు. దీనితో పాఠశాలకు ఎలాగైనా సెలవులు కావాలనుకున్న ఆ విద్యార్థి తీసుకున్న ఓ నిర్ణయం.. 20మందిని ఆసుపత్రిపాలు చేసింది. ఇంతకీ ఆ విద్యార్థి ఏం చేశాడంటే..?

  • 'ఆ జిల్లాల్లో కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించండి!'

Covid-19 Containment Measures: దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువ నమోదైన జిల్లాల్లో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.

  • ఇంగ్లాండ్​ జట్టుపై జరిమానా

Ashes 2021-22: యాషెస్​ సిరీస్​ తొలి టెస్టులో ఇంగ్లాండ్​ జట్టు ఐసీసీ నియమాలను ఉల్లంఘించింది. స్లో ఓవర్​ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో కోతకు గురైంది. మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్​పై కూడా జరిమానా పడింది.

15:52 December 11

టాప్​ న్యూస్​ @4PM

  • 'రావత్ చూస్తూనే ఉంటారు'

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ లేకపోవడం.. దేశానికి తీరని లోటు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ సైన్యం స్వయం సమృద్ధి సాధించే దిశగా జనరల్ రావత్ నిరంతరం కృషి చేశారని తెలిపారు. భారత్​ను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

  • 'ఎమ్మెల్సీ పదవుల ఆశ చూపుతున్నారు'

Bandi Sanjay comments on KCR: కలెక్టర్లకు కేసీఆర్ ఎమ్మెల్సీ పదవుల ఆశ చూపుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. వరి కుప్పలపై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. పట్టించుకునే స్థితిలో ముఖ్యమంత్రి లేరని ఆరోపించారు. వానాకాలం పంటను ఎందుకు కొనరని రైతులు ప్రశ్నిస్తున్నారని అన్నారు.

  • 25 వేల పెట్టుబడితో.. 20 కోట్ల టర్నోవర్​ స్థాయికి..

successful entrepreneur in hyderabad: ఆ యువకుడి కుటుంబంలో ఎవరికీ వ్యాపార నేపథ్యం లేదు. ఐనా... చిన్నప్పటి నుంచి వ్యాపారవేత్త కావాలనేదే అతడి లక్ష్యం. మధ్య తరగతి కుటుంబ కష్టాలున్నా, ప్రభుత్వ ఉద్యోగం అంది వచ్చినా లెక్కచేయలేదు. వ్యాపారంలోకి అడుగుపెట్టాలనే సంకల్పంతోనే శ్రమించాడు. చిన్నచిన్న అవకాశాల్ని సమర్థంగా వినియోగించుకున్నాడు. 25 వేల పెట్టుబడితో మొదలై.. 20 కోట్ల టర్నోవర్‌ స్థాయికి ఎదిగాడు. అతడే హైదరాబాద్‌కు చెందిన అభిలాష్‌.

  • మదుపర్లకు మంచి లాభాలు

Multibagger stocks: స్టాక్​ మార్కెట్లో కొన్ని కంపెనీలు మదుపర్లకు మంచి లాభాల్ని తెచ్చి పెట్టాయి. గత ఆరు నెలల్లోనే అనేక రెట్టు రాబడినిచ్చే స్టాక్స్​గా మారాయి. ఓ సంస్థలో ఆరు నెలల్లోనే రూ. లక్ష పెట్టుబడి రూ. 30 లక్షలైంది. ఆ సంస్థ ఏదంటే?

  • టాలీవుడ్​లో కొత్త భామలు

ప్రతిసారిలా 2021లో చాలామంది కొత్త భామలు తెలుగు సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో చాలామంది ఇప్పటికే బిజీ కూడా అయిపోయారు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మలెవరు? వారి సంగతేంటి? చూసేద్దామా..

14:36 December 11

టాప్​ న్యూస్​ @3PM

  • 'డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేదు'

Jagdish reddy on electric vehicles : విద్యుత్ వాహనాల పట్ల అపోహలు వీడాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనుగోలుకు ముందుకురావాలని కోరారు. రాష్ట్రంలో 136 ఈవీ స్టేషన్లను ఏర్పాటయ్యాయని... మరో 600కిపైగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

  • ప్రయోగం విజయవంతం

Pinaka rocket system: పినాక రాకెట్​ లాంచర్​ విస్తరణ శ్రేణి వ్యవస్థ వివిధ దశ ప్రయోగాలు విజయవంతమైనట్లు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్​డీఓ పేర్కొంది. గత మూడు రోజులుగా రాజస్థాన్​లో పోఖ్రాన్​లో ఈ ప్రయోగాలు చేపట్టినట్లు తెలిపింది.

  • మసీదులో దాచిన ఆయుధాలు పేలి 12 మంది మృతి

మసీదులో దాచి ఉంచిన ఆయుధాలు పేలి 12 మంది మరణించారు. లెబనాన్​లోని టైర్ నగరంలో ఈ దుర్ఘటన జరిగింది. పాలస్తీనా హమాస్ వర్గాల కోసం ఈ ఆయుధాలను నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • దక్షిణాఫ్రికా పర్యటనే ఇషాంత్​కు చివరిదా?

Ishant Sharma last Assignment: దక్షిణాఫ్రికా పర్యటన కోసం ప్రకటించిన తుదిజట్టులో సీనియర్ పేసర్ ఇషాంత్​ శర్మతో పాటు రహానే, పుజారాలకు చోటు దక్కింది. అయితే వీరు కొంతకాలంగా సరైన ఫామ్​ కనబర్చడం లేదు. దీంతో వీరికి ఇదే చివరి సిరీస్ కావొచ్చని అందరూ భావిస్తున్నారు. కాగా, ఇదే విషయంపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. పరోక్షంగా వారిని హెచ్చరించాడు.

  • 'విజయ్​దేవరకొండ చాలా హాట్​'

Sara ali khan Vijay devarakonda: రౌడీహీరో విజయ్​దేవరకొండ తన ఫేవరెట్​ స్టార్​ అని చెప్పింది బాలీవుడ్​ బ్యూటీ సారా అలీఖాన్​. ఆయనతో సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాట చెప్పింది. దీంతో పాటే విజయ్​ చాలా హాట్​గా ఉంటారని పేర్కొంది.

13:53 December 11

టాప్​న్యూస్ @ 2PM

  • 'క్రాస్ బ్రీడ్​లు వస్తుంటాయ్ పోతుంటాయ్'

Minster Puvvada Latest Press Meet: తెరాస అంటేనే ఒరిజినల్ బ్రీడ్ అని.. ఎన్ని క్రాసింగ్​లు జరిగినా.. క్రాస్ బ్రీడ్​లు వచ్చినా.. మా విజయంతోనే సమాధానమిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణపై ఎఫ్‌సీఐ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు.

  • 20 ఏళ్ల క్రితం ఫోటోను షేర్​ చేసిన కేటీఆర్

20 years ago KTR Photo : లండన్​లో తన 20 ఏళ్ల క్రితం ఫోటోను ట్వీట్టర్​లో మంత్రి కేటీఆర్​ షేర్​ చేశారు. దీనిపై నెటిజన్లు బాగుందంటూ... హీరోలా ఉన్నారంటూ కామెంట్​ పెడుతున్నారు.

  • గంగమ్మ ఒడికి రావత్​ దంపతుల అస్థికలు

Bipin Rawat funeral: భారత త్రిదళాధిపతి బిపిన్​ రావత్​ దంపతుల అస్థికలను ఉత్తరాఖండ్ హరిద్వార్​లోని గంగానదిలో కలిపారు వారి కుమార్తెలు. దిల్లీలోని బ్రార్​ స్క్వేర్​ నుంచి చితాభస్మాల్ని సేకరించి.. నేరుగా హరిద్వార్​ చేరుకుని నదిలో కలిపారు.

  • పది నెలల నిరీక్షణ ఫలించింది

Nathan Lyon Test Wickets: యాషెస్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. అయితే ఈ మ్యాచ్​ ద్వారా ఓ రికార్డును నెలకొల్పాడు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్.

  • మాజీ ప్రధాని ఇంటికి ఊర్వశి రౌతేలా

Urvashi Rautela Israel: ఇజ్రాయెల్​లో జరగబోయే మిస్​ యూనివర్స్​ 2021పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది బాలీవుడ్​ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఇందులో భాగంగా అక్కడికి వెళ్లిన ఈ ముద్దుగుమ్మను ఆ దేశ మాజీ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు తన ఇంటికి ఆహ్వానించారు.

12:47 December 11

టాప్​న్యూస్ @ 1PM

  • 'గాంధీలో మెరుగైన సేవలు'

Harish rao in Gandhi hospital: కరోనా సమయంలో గాంధీ ఆస్పత్రి వైద్యుల సేవలు మరువలేనివని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. గాంధీ ఆస్పత్రి అభివృద్ధికి రూ.175 కోట్లు మంజూరు చేశామన్న మంత్రి... ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన పనులు పూర్తి చేశామని చెప్పారు.

  • భర్తను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న భార్య

Wife Catches Husband Redhandedly: ధర్మార్థ కామములోన ఏనాడు నీతోడు ఎన్నడు నే విడిచి పోనూ.. అని పెళ్లి చేసుకున్న భర్త. ఓ బిడ్డ జన్మించాక భార్యను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు.

  • 'ఆన్​లైన్​ గేమ్స్​లో అసలు పేర్లు వాడకూడదు'

ఆన్​లైన్​ గేమ్స్​, వాటిలో చేసే కొనుగోళ్లు పిల్లలు, తల్లిదండ్రులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కేంద్రం అప్రమత్తమైంది. ఆన్‌లైన్‌ గేముల్లో కొనుగోళ్లు చేపట్టేందుకు తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేసింది.

  • ఇంగ్లాండ్​పై ఆసీస్ విజయం..

WTC 2021-23 Points Table: యాషెస్ సిరీస్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్ ఆరో స్థానానికి పడిపోయింది.

  • ఎన్టీఆర్‌ సాయం తీసుకుంటారా?

RRR movie: హైదరాబాద్​లో 'ఆర్​ఆర్​ఆర్' చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. రాజమౌళి, తారక్​, రామ్​చరణ్,​ ఆలియా భట్, నిర్మాత దానయ్య​ పలు విషయాలను తెలిపారు. ఇందులో భాగంగా ఏపీలో సినిమా టికెట్ల విషయంపై​ నిర్మాత దానయ్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఏం చెప్పారంటే..

12:00 December 11

టాప్​న్యూస్ @ 12PM

  • ఎక్కడకు మళ్లించారు?

shilpa chowdary custody news : శిల్పా చౌదరిని న్యాయస్థానం అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు... ప్రశ్నిస్తున్నారు. అధిక వడ్డీల పేరిట ఆశ చూపి దండుకున్న కోట్ల రూపాయలను ఎక్కడకు మళ్లించిందనే అంశంపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.

  • 'ఒమిక్రాన్​'తో ఆంక్షల్లోకి దేశాలు!

Covid-19 surge update: కరోనా మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఇప్పటికే పంజా విసురుతోన్న డెల్టాకు.. కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ తోడవుతోంది. అమెరికాతో పాటు చాలా దేశాల్లో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రయాణ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఒమిక్రాన్​పై బూస్టర్​ సమర్థంగా పనిచేస్తున్నట్లు పలు అధ్యయనం సూచిస్తున్న​ క్రమంలో డిమాండ్​ పెరుగుతోంది.

  • చైనా బలప్రయోగం

China planes in Taiwan airspace: తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధవిమానాలు మరోసారి చొరబడ్డాయి. మొత్తం 13 విమానాలు తమ ఎయిర్ డిఫెన్స్ జోన్​లోకి ప్రవేశించినట్లు తైవాన్ రక్షణ శాఖ తెలిపింది.

  • అందుకే మాది నిజమైన స్నేహం

RRR Press Meet: 'ఆర్‌ఆర్‌ఆర్‌' స్పెషల్‌ చిట్‌చాట్‌ హైదరాబాద్​లో నిర్వహించారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు తారక్‌, చరణ్, రాజమౌళి, నిర్మాత దానయ్య ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

10:58 December 11

టాప్​న్యూస్ @ 11AM

  • పన్ను రాబడిలో గణనీయ పెరుగుదల

Telangana Tax Revenue 2020-2021: రాష్ట్రంలో పన్నుల రాబడులు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది రూ.532 కోట్ల డిమాండ్‌ ఉండగా.. ఈ ఏడాది రూ.627 కోట్లకు చేరుకుంది. కొత్తగా పన్ను పరిధిలోకి 70 వేలకు పైగా ఆస్తులు రానున్న నేపథ్యంలో.. 2021-22 పన్ను రాబడి లక్ష్యం రూ.856 కోట్లుగా పురపాలక శాఖ నిర్దేశించింది.

  • సాయితేజ మృతదేహం గుర్తింపు..

Jawan Sai Tej : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సాయితేజ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. నేడు స్వగ్రామం ఎగువరేగడికి సాయితేజ భౌతికకాయం చేరనుంది. భౌతికకాయం రావడం ఆలస్యమైతే రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

  • 'మహా'లో ఒమిక్రాన్‌ కలవరం

Omicron cases in Maharashtra: దేశంలో మహారాష్ట్రంలోనే అత్యధికంగా 17 ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులు వెలుగు చూశాయి. ముంబయిలోని ధారావిలో తొలి కేసు నమోదైంది. ఈ క్రమంలో రెండు రోజుల పాటు 144 సెక్షన్​ విధించారు అధికారులు. ర్యాలీలు, మోర్చాలపై నిషేధం విధించారు.

  • 'బార్డర్ బాబు' కథ సుఖాంతం..

Border Boy pakistan: అట్టారీ- వాఘా సరిహద్దులో జన్మించిన 'బార్డర్ బాయ్' ఇంటికి చేరుకున్నాడు. వీసాలు, ధ్రువీకరణ పత్రాలు లభించిన నేపథ్యంలో బాలుడి తల్లిదండ్రులు సరిహద్దు గుండా పాకిస్థాన్​కు తిరుగుపయనమయ్యారు.

  • 'ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రతి ప్రేక్షకుడ్ని అలరిస్తుంది'

RRR Press Meet: 'ఆర్‌ఆర్‌ఆర్‌' స్పెషల్‌ చిట్‌చాట్‌ హైదరాబాద్​లో నిర్వహించారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు తారక్‌, చరణ్, రాజమౌళి ఆసక్తికర సమాధానాలు చెబుతున్నారు.

10:06 December 11

టాప్​న్యూస్ @ 10AM

  • మూడో రోజు సమ్మె

Singareni Trade unions strike : సింగరేణిలోని ఆరు కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె మూడోరోజూ కొనసాగుతోంది. తమ డిమాండ్ల కోసం నిరసన తెలుపుతూ శనివారం స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. రాష్ట్రం కోసం కొట్లాడిన తాము.. హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు.

  • కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

India Covid Cases: దేశంలో కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 7,992 కేసులు వెలుగులోకి వచ్చాయి. 393 మరణాలు సంభవించాయి. శుక్రవారం 76,36,569 మందికి టీకాలు అందించారు.

Ashes 2021: ఇంగ్లాండ్​తో జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది ఆస్ట్రేలియా. 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్​లో 1-0తో ఆధిక్యం సంపాదించింది.

  • బిగ్​బాస్​ హౌస్​మేట్స్​పై ప్రేక్షకుల ప్రశ్నల వర్షం

Nagarjuna Bigg Boss 5: ఓ టాస్క్​లో భాగంగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు బిగ్​బాస్​ హౌస్​మేట్స్​ సమాధానాలు చెప్పారు. తోటి కంటెస్టెంట్​లతో తమకున్న అభిప్రాయాలను తెలిపారు. ఇంకా పలు విషయాలను చెప్పారు. ఎవరెవరు ఏమి చెప్పారో తెలుసుకుందాం..

08:53 December 11

టాప్​న్యూస్ @ 9AM

  • పార్లమెంటులో కంటోన్మెంట్‌ సమస్య

cantonment issue in parliament : సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ రహదారుల మూసివేత అంశంపై పార్లమెంట్​లో మరోసారి చర్చ జరిగింది. తరుచూ స్థానిక మిలటరీ అధికారులు ఆయా మార్గాలు మూసివేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు.

  • కుక్క తెచ్చిన తంటా.. ముగ్గురికి జీవిత ఖైదు

Life Imprisonment: గోటితో పోయే దానిని గొడ్డలివరకు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో..! ఓ కుక్క కారణంగా తలెత్తిన వివాదం నాలుగు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. కుక్క పొరుగింట్లోకి వెళ్లిందనే కారణంతో తలెత్తిన గొడవ హత్యకు దారితీసింది.

  • కొవిడ్​ను పసిగట్టే 'పాస్​పోర్ట్​'

మనిషి లాలాజలాన్ని పరీక్షించి కరోనా వైరస్​ ఆనవాళ్లను పట్టేసే విధంగా వినూత్నమైన యాంటిజెన్​ రాపిడ్​ టెస్ట్​ని సింగపూర్​ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కొవిడ్​-19ను అత్యంత కచ్చితత్వంతో శరవేగంగా గుర్తిస్తుందని అంటున్నారు. దీనికి 'ప్యార్లల్‌ యాంప్లిఫైడ్‌ సెలైవా, ర్యాపిడ్‌ పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ టెస్ట్‌' (పాస్‌పోర్ట్‌) అని పేరు పెట్టారు.

  • ఆ ఒలింపిక్స్​లో క్రికెట్‌కు చోటు లేదు

Olympics 2028 Cricket: 2028 లాస్ ఏంజెలిస్​ ఒలింపిక్స్​లో క్రికెట్​ను చూడొచ్చని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. క్రికెట్‌ సహా బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, ఆధునిక పెంటాథ్లాన్‌ ఒలింపిక్స్‌కు ఎంపిక చేసిన 28 క్రీడల ప్రాథమిక జాబితాలో చోటు కోల్పోయాయి.

  • 'అది ఓ గొప్ప అనుభవం'

Alluarjun Pushpa Movie: సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కిన 'పుష్ప' సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఈ చిత్ర నిర్మాతలు. ప్రపంచవ్యాప్తంగా 3 వేలకిపైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

07:53 December 11

టాప్​న్యూస్ @ 8AM

  • పేదల పెన్నిధిగా ఎయిమ్స్..

AIIMS Bibinagar Medical services : బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రి పేదల పాలిట పెన్నిధిగా మారుతోంది. ప్రైవేటుతో పోలిస్తే ఇక్కడ చౌకధరలకే అన్ని రకాల పరీక్షలు చేస్తుండటంతో పేదరోగుల తాకిడి పెరుగుతోంది. రోజూ 300 నుంచి 400 మంది ఈ సేవలు వినియోగించుకుంటున్నారు.

  • పోలింగ్‌ శాతం ఇలా..!

local body mlc elections polling : ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. వివిధ జిల్లాల్లో నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.

  • 'నాకు నచ్చినప్పుడు రాజ్యసభకు వెళ్తా'

Ranjan Gogoi on Rajya Sabha: పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకపోవడంపై సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి స్పందించారు. కరోనా వ్యాప్తి సహా వైద్యుల సూచన మేరకు సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. తనను ఏ పార్టీ ఆదేశించలేదని.. నచ్చినప్పుడు పార్లమెంట్​కు వస్తానని అన్నారు.

  • కార్ల్‌సన్‌దే కిరీటం..

ఎనిమిదేళ్ల కిందట.. అప్పటికే ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్‌ ఆనంద్‌ను 22 ఏళ్ల కుర్రాడు ఓడించినపుడు చెస్‌ ప్రపంచం పెద్దగా ఆశ్చర్యపోలేదు. అప్పటికే అతడి ప్రతిభ ఏంటో అర్థమై భవిష్యత్‌ అతడిదే అని తీర్మానించేశారు. అంచనాలకు తగ్గట్లే అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న ఆ చెస్‌ కెరటం..

  • కొత్త దర్శకుల హవా..

మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా వైవిధ్యమైన కథలతో సినీప్రియుల్ని అలరిస్తున్నారు కొత్త దర్శకులు. వారిలో కొంతమంది తొలి ప్రయత్నంలోనే సూపర్​హిట్​ను అందుకున్నారు.. మరి ఈ ఏడాది తమ సినిమాలతో తొలి ప్రయత్నంలోనే విజయం అందుకున్న ఆ కొత్త కెప్టెన్లు ఎవరో తెలుసుకుందాం.

06:52 December 11

టాప్​న్యూస్ @ 7AM

  • 'నాలుగు దశాబ్దాలలో కానిది నాలుగేళ్లలో పూర్తి'

Saryu Nahar Pariyojana Project: నాలుగు దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న 'సరయూ నహర్​ జాతీయ ప్రాజెక్టు'ను కేవలం నాలుగేళ్లలో పూర్తిచేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఉత్తర్​ప్రదేశ్​లోని బలరామ్​​పుర్​కు శనివారం వెళ్లనున్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్​ చేశారు.

  • చిన్నారులకు మెరుగైన భవిష్యత్తు

UNICEF News: చిన్నారుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి బాలల నిధి(యునిసెఫ్‌) సంస్థ కృషి విస్మరించలేనిది. ప్రపంచంలో ప్రతి చిన్నారికీ ఆత్మీయ హస్తం అందించాలన్న ఆశయంతో 75 ఏళ్లుగా యునిసెఫ్‌ నిర్విరామ పయనం సాగిస్తోంది. ప్రస్తుతం 190కి పైగా దేశాల్లో సేవలు అందిస్తోంది.

  • ఒక్కరోజే 7 ఒమిక్రాన్​ కేసులు

Omicron cases in India: మహారాష్ట్రలో ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఏడుగురికి ఒమిక్రాన్​ నిర్ధరణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 32కు చేరింది.

  • 'రోహిత్‌ శర్మపై భారీ ఆశలుంటాయి‌'

Azharuddin on Rohit Sharma: టీమ్​ఇండియా వన్డే జట్టు సారథిగా ఎంపికయ్యాడు రోహిత్ శర్మ. ఈ నియామకంపై భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు.

  • విక్కీ-కత్రినాల రిసెప్షన్ ఎప్పుడంటే..?

Vicky Katrina Reception: బాలీవుడ్ స్టార్ కపుల్​ విక్కీ కౌశల్-కత్రినాల రిసెప్షన్ వచ్చేవారం ముంబయిలో జరగనుంది. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు సమాచారం. గురువారం రాజస్థాన్​లోని సెవెన్​సెన్స్​ ఫోర్ట్​లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది.

05:35 December 11

టాప్​న్యూస్ @ 6AM

  • 'వీరుడా వందనం'..

Bipin Rawat funeral: దిల్లీలోని బార్​ స్క్వేర్​ శ్మశానవాటికలో.. సీడీఎస్​ బిపిన్​ రావత్​, ఆయన సతీమణి మధులికా రావత్​ అంత్యక్రియలు సైనిక లాంఛనాలు, బంధుమిత్రల అశ్రునయనాల మధ్య జరిగాయి. కుటుంబసభ్యులు, ప్రజలు రావత్​ దంపతులకు కన్నీటి వీడ్కోలు పలికారు.

  • విషమంగానే కెప్టెన్​ వరుణ్​ సింగ్​ ఆరోగ్యం

Pilot Varun Singh News: కూనూర్​ హెలికాప్టర్​ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కెప్టెన్​ వరుణ్​ సింగ్​కు.. బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్‌ కమాండ్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

  • ప్రపంచ దృష్టిని హైదరాబాద్‌ వైపు..

IAMC CEO Sitesh Mukherjee: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ నెల 18న ప్రారంభం కానున్న ఐఏఎంసీ... ప్రపంచ దృష్టిని హైదరాబాద్‌ వైపు మరల్చనుందని ఆ కేంద్రం సీఈవో సితేష్‌ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. బహుళజాతి సంస్థలు మొదలు సామాన్యుల వరకు అందరి వివాదాలను అతి తక్కువ సమయంలో పరిష్కరించడమే తమ లక్ష్యమని తెలిపారు.

  • కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం!

Palamuru Rangareddy Project: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం అభ్యర్థిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... మరోసారి ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయనున్నారని తెలుస్తోంది.

  • వ్యాక్సినేషన్​ పట్ల తగ్గుతున్న ఆదరణ...

corona vaccination: రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి కేసులు మరోమారు క్రమంగా పెరుగుతుండగా.. మరోవైపు వ్యాక్సినేషన్ పట్ల ప్రజల ఆదరణ క్రమంగా తగ్గుతోంది. మరీ ముఖ్యంగా రెండో డోస్ వ్యాక్సినేషన్ అత్యంత మందకొడిగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 94 శాతం మందికి తొలి డోస్ ఇచ్చినా... ఇప్పటికీ కనీసం 50 శాతం మంది రెండో డోస్ తీసుకోలేదు.

  • వెంటిలేటర్‌ ఉపకరణాలకు తీవ్ర లోటు...

Ventilator Accessories Scarcity:రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతానికి వెంటిలేటర్ల కొరత లేనప్పటికీ...వాటిలో వినియోగించే ఉపకరణాలకు తీవ్ర లోటు ఏర్పడుతోందని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. వెంటిలేటర్‌ నిర్వహణపైనా 50 శాతం కంటే తక్కువగా మానవ వనరులకు సరైన శిక్షణ లేదని పేర్కొంది. ప్రా

  • అమ్మా నేను భారమా..

Orphan boy: ఆరు నెలల వయసులోనే కన్నవారి ప్రేమకి దూరమయ్యాడు ఆ చిన్నారి. హైదరాబాద్‌లో అనుమానస్పద స్థితిలో పోలీసులకు చిక్కిన వ్యక్తిని ప్రశ్నిస్తే నిజామాబాద్ బస్టాండ్‌లో బిక్షాటన చేసే మహిళ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. బాబును పోలీసులు శిశుగృహకు తరలించారు. అప్పటి నుంచి కనిపించిన వారినే తనవారిగా భావిస్తున్న అనాథ బాలుడు కార్తీక్‌ను చూస్తే ముచ్చటేస్తున్నా సొంతవారి దరికి ఎప్పుడు చేరతాడో మరి...

  • కార్మికుల నివాసాల్లోకి దూసుకెళ్లిన కారు...

Alladurgam car accident: కారు అదుపు తప్పి కార్మికుల నివాసాల్లోకి దూసుకెళ్లిన ఘటన మెదక్​ జిల్లా అల్లాదుర్గం మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

  • ఎన్టీఆర్ మాటలకు షాక్​లో బాలీవుడ్ స్టార్...

NTR On Ajay Devgan: 'ఆర్​ఆర్​ఆర్' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం సందర్భంగా బాలీవుడ్ స్టార్​హీరో అజయ్​ దేవగణ్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ వ్యాఖ్యలకు అజయ్ దేవ్​గణ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ ఎన్టీఆర్.. అజయ్​ దేవ్​గణ్​ను ఏమన్నారు?

Last Updated : Dec 11, 2021, 10:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.