ETV Bharat / city

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు - ఈటీవీ భారత్ న్యూస్

etv bharat top news
etv bharat top news
author img

By

Published : Oct 3, 2021, 5:57 AM IST

Updated : Oct 3, 2021, 9:56 PM IST

21:48 October 03

టాప్​ న్యూస్​ @10PM

  • నిరసనలో హింస.. ఆరుగురు మృతి

ఉత్తర్​ప్రదేశ్​లోని లఖీంపుర్ ఖేరీలో జరుగుతున్న రైతుల నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఆందోళనలో ఇద్దరు రైతులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 

  • నలుగురు జలసమాధి

కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చెందిన నలుగురు​ యువకులు జలసమాధి అయ్యారు. వీరంతా హైదరాబాద్​ బోరబండలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా గోడవాడి గ్రామంలోని ఓ దర్గాను దర్శించుకునేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది.

  • ఆ రాష్ట్రాల్లో భూకంపం

ఝార్ఖండ్, అసోంలో ఆదివారం భూకంపం (Earthquake news) సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై వరుసగా 4.1, 3.8 తీవ్రత నమోదైంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

  • భవనంలోకి దూసుకెళ్లిన విమానం

విమాన ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అదుపు తప్పిన విమానం ఓ భవనంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఇటలీలో జరిగింది.

మళ్లీ పేరు మార్చుకున్న సామ్​!

నాగచైతన్యతో(Nagachaitanya Sam divorce) విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత మరోసారి తన సోషల్​మీడియా ఖాతా పేరును మార్చారు హీరోయిన్​ సమంత(samantha instagram name changed). ప్రస్తుతం ఈ విషయం గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

20:30 October 03

టాప్​ న్యూస్​ @9PM

  • 'ఈటల గెలిస్తే కేసీఆర్‌ సీఎం పదవికి రాజీనామా చేస్తారా?'

హుజూరాబాద్​లో భాజపా నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో అభ్యర్థి ఈటల రాజేందర్​తో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పాల్గొన్నారు. కార్యకర్తలకు బండి సంజయ్​ దిశానిర్దేశం చేశారు. వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లి.. ఈటల రాజేందర్​ను గెలిపించేందుకు కృషి చేయాలని సూచించారు.

  • 'సైనిక పాలనను గుర్తు చేస్తోంది'

యువతపై తెరాస ప్రభుత్వ వ్యవహార తీరును కాంగ్రెస్​ నేతలు ఎండగట్టారు. సీఎం కేసీఆర్​ సైనిక పాలనను గుర్తుచేసేలా వ్యవహరిస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్​ మధుయాష్కీ గౌడ్​ మండిపడ్డారు. ఈ నెల 12న మహబూబ్​నగర్​లో జంగ్ సైరన్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

  • భవానీపుర్​లో దీదీ విజయఢంకా

భవానీపుర్ ఉపఎన్నికలో(Bhabanipur by poll) టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) విజయ ఢంకా మోగించారు.తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు. తొలి రౌండ్‌ నుంచీ మమత ఆధిపత్యం కొనసాగించారు. 58, 832 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. ఈ విజయంతో మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు.

  • పట్టువీడని సిద్ధూ

పంజాబ్​ పీసీసీ పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ(Navjot Sidhu news).. పట్టువీడటం లేదు. తన డిమాండ్లు పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మరోమారు ట్విట్టర్​ వేదికగా(navjot sidhu tweet) రాష్ట్ర డీజీపీ, ఏజీని తొలగించాలని డిమాండ్​ చేశారు. సోమవారం మంత్రివర్గ భేటీ ఉన్న నేపథ్యంలో సిద్ధూ ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • షారుక్ ఖాన్​ తనయుడు అరెస్ట్​

ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్​ పార్టీలో (Mumbai Rave Party news) పట్టుబడ్డవారిలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Mumbai Rave Party Superstar Son) సైతం ఉన్నాడు. అతడిని ఇప్పటికే ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్​సీబీ) (Drugs news) అధికారులు అరెస్టు చేశారు. ఆర్యన్​ను ప్రశ్నించిన అనంతరం.. వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టులో ప్రవేశపెట్టగా.. రేపటివరకు ఎన్​సీబీ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

19:50 October 03

టాప్​ న్యూస్​ @8PM

  • తెలుగు అకాడమీ కేసులో ముమ్మర దర్యాప్తు 

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. F.Dలు స్వాహా చేయడంలో కీలకపాత్రధారని భావిస్తున్న యూబీఐ మేనేజర్‌ మస్తాన్ వలి సహచరుడు రాజ్‌కుమార్‌ను పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.

  • 'బీసీలకు న్యాయం జరగడం లేదు'

తెలంగాణలో బీసీలకు న్యాయం జరగడం లేదని వైఎస్సార్​​ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల(YS Sharmila) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం ఆధునీకరణ వైపు అడుగులు వేస్తుంటే.. బీసీలను మాత్రం కులవృత్తులకే పరిమితం అవ్వమంటున్నారని మండిపడ్డారు. నారాయణపేట జిల్లా కోస్గిలో వైఎస్సాఆర్​ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో బీసీల ఆత్మగౌరవ సభలో షర్మిల పాల్గొన్నారు.

  • పిల్లలకు కరోనా టీకా ధరపై కీలక ప్రకటన

కరోనా టీకా ధరపై కేంద్రానికి ఓ ప్రతిపాదన చేసింది (Zycov-D Vaccine Price) జైడస్​ క్యాడిలా సంస్థ. మూడు డోసులకు రూ.1900 చెల్లించాలని కోరింది. అయితే.. ఈ ధర తగ్గింపుపై కేంద్రం ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

  • కోహ్లీసేనకు ప్లే ఆఫ్స్​లో బెర్తు ఖరారు

పంజాబ్​ కింగ్స్​పై(RCB vs PBKS) 6 పరుగుల తేడాతో విజయం సాధించింది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు. దీంతో (IPL 2021) ప్లే ఆఫ్స్​లో బెర్తు ఖరారు చేసుకుంది కోహ్లీసేన.

  • సాయిధరమ్​ తేజ్​ ట్వీట్​!

ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడిన టాలీవుడ్​ యువహీరో సాయిధరమ్​ తేజ్​ (Saidharamtej health) ఆస్పత్రి నుంచి ట్వీట్​ చేశారు. తన రిపబ్లిక్​ సినిమా గురించి స్పందించారు.

18:44 October 03

టాప్​ న్యూస్​ @7PM

  • 'పిల్లలకు త్వరలోనే టీకా'

టీకా పంపిణీలో భాగంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలకే (Kids Vaccine Covid India) కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందన్నారు ఎన్​టీఏజీఐ ఛైర్మన్​ అరోడా. దేశంలోని అన్ని ప్రాంతాల్లో టీకాలు అందేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.

  • ఆటోలో నుంచి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లిన కోతి

కోతి చేసిన పనికి ఓ వ్యక్తి భారీగా నష్టపోవాల్సి వచ్చింది. ఆటోలో నుంచి లక్ష రూపాయలతో ఉన్న టవల్​ను ఎత్తుకెళ్లి.. సమీప ప్రాంతంలో కరెన్సీ నోట్లు వెదజల్లింది ఆ వానరం. ఈ సంఘటన మధ్యప్రదేశ్​ జబల్​పుర్​ జిల్లా కటవ్​ ఘాట్​ ప్రాంతంలో జరిగింది.

  • ఆల్​టైం హై వద్ద పెట్రోల్ రేట్లు

దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్ ధరలు సామాన్యులకు మోయలేని భారంగా మారుతున్నాయి. చమురు ధరలు ఈ స్థాయిలో పెరిగేందుకు కారణాలు ఏమిటి? ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం ఏం చేయలేదా? జీఎస్​టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకురావడం ద్వారానే ధరలకు కళ్లెం వేయడం సాధ్యమా?

  • లైగర్​తో యువీ వార్​

ఫీల్డ్​లో దిగితే బౌలర్లకు చుక్కలు చూపించే యువరాజ్ సింగ్ (Yuvraj Singh).. ఇటీవలే ఓ లైగర్​తో పోటీపడ్డాడు. దుబాయ్​ ఫేమ్​ పార్క్​ సందర్శన సందర్భంగా లైగర్​తో టగ్​ ఆఫ్​ వార్​లో దిగిన యువీ.. గెలిచాడో లేదో చూడండి మరి.

  • ఈ ముగ్గురి పోస్ట్స్​పైనే చర్చ!

సమంత- నాగచైతన్య (Samantha Chaitanya) విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్​కు గురిచేశారు. వారి ప్రకటను ముందు.. ఆ తర్వాత సామ్ (CHAYSAM), నటుడు సిద్ధార్థ్ చేసిన కొన్ని పోస్టులు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

17:46 October 03

టాప్​ న్యూస్​ @6PM

టాప్​ న్యూస్​ @6PM

ఆ అరుపులకు భయపడం..

ఎట్టిపరిస్థితుల్లో ఒకరికి బెదిరిపోయే ప్రసక్తే లేదని వైకాపా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కమిటీ వేసి నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అరుపులకు బెదిరిపోయి.. పారిపోయే ప్రభుత్వం తమది కాదని ఎద్దేవా చేశారు.

మసీదులో బాంబు దాడి..

అఫ్గానిస్థాన్​ కాబూల్​లోని (Afghan news) ఓ మసీదుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో చాలా మంది పౌరులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాలిబన్ (Afghanistan Taliban)​ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.  

డీమార్ట్​ దూకుడు..

'డీమార్ట్' పేరిట రిటైల్​ స్టోర్లను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్​​ 2021-22 క్యూ2లో (Dmart results) దూకుడు ప్రదర్శించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే.. తమ ఆదాయం 46.6 శాతం (Dmart revenue) పెరిగినట్లు అవెన్యూ సూపర్ మార్ట్స్​​ ప్రకటించింది.

రాణించిన మాక్స్​వెల్​...

ఐపీఎల్​ రెండో దశలో(IPL 2021) భాగంగా ఆదివారం(అక్టోబర్​ 3) పంజాబ్​ కింగ్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో (RCB vs PBKS) ఆర్​సీబీ బ్యాట్స్​మన్​ మ్యాక్స్​వెల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో పంజాబ్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది బెంగళూరు.

వీకెండ్​ మూడ్​లో జాన్వీ..

బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీ కపూర్(janhvi kapoor vacation)​ స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్​కు వెళ్లి సరదాగా గడిపింది. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్​ చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

16:44 October 03

టాప్​ న్యూస్​ @5PM

  • 'దళితులమీద ప్రేమ ఉంటే మున్సిపల్‌ శాఖను వారికే ఇవ్వాలి'

దేశంలో దళితుడిని ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్​ మాణికం ఠాగూర్​ (Manickam Tagore) అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్... మాట తప్పారని విమర్శించారు. ఇందిరాభవన్​లో టీపీసీసీ ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశం జరిగింది. 

  • విజయం కోసం రూ.154 కోట్లు ఖర్చు చేసిన మమత!

అసెంబ్లీ ఎన్నికల్లో(bengal election 2021 ) పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి మరోమారు అధికారం చేపట్టటంలో విజయం సాధించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అయితే.. అందుకోసం భారీగా ఖర్చు(poll expenses) చేశారు. ఎన్నికల ప్రచారం కోసం టీఎంసీ రూ.154 కోట్ల మేర ఖర్చు చేసినట్లు ఈసీకి సమర్పించిన డేటా ద్వారా వెల్లడైంది.

  • సీఎంకు ప్రతిపక్ష నేత సవాల్

తన ఆరోగ్యం, వయసు గురించి పదేపదే విమర్శలు గుప్పిస్తున్న మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​కు ఓ సవాల్​ విసిరారు కాంగ్రెస్​ నేత కమల్​నాథ్(Kamal Nath news today)​. "ఇద్దరం రన్నింగ్​ రేసులో పాల్గొని ఎవరి ఫిట్​నెస్​ ఏంటో పరీక్షించుకుందాం రమ్మని" ఛాలెంజ్​ చేశారు. కొవిడ్​ తర్వాత చికిత్స కోసమే దిల్లీ వెళ్లినట్లు స్పష్టం చేశారు కమల్​నాథ్​.

  • పండుగ ఆఫర్లు అదుర్స్​..

దేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్​కార్ట్(Flipkart Big Billion Days)​, అమెజాన్​ (Amazon Great Indian Festival Sale) ప్రత్యేక సేల్స్ ప్రారంభించాయి. స్మార్ట్​ఫోన్లు, స్మార్ట్​ టీవీలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై భారీ డిస్కౌంట్​ ఇస్తున్నాయి. ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

  • షారుక్​ తనయుడి గురించి ఈ విషయాలు తెలుసా?

ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్​ పార్టీ కేసులో Mumbai Rave Party news) పట్టుబడ్డ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్​ను (Mumbai Rave Party Superstar Son) ప్రస్తుతం విచారణ చేస్తోంది ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఈ నేపథ్యంలో అతడి(Shah Rukh Khan son drugs) గురించి తెలుసుకుందాం..

15:46 October 03

టాప్​ న్యూస్​ @4PM

  • 'ఈటల గెలిస్తే కేసీఆర్​ రాజీనామా చేస్తారా?' 

  • 'కేంద్రం ఒక్క వైద్య కళాశాలైనా మంజూరు చేయలేదు'

బండి సంజయ్​ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన రాలేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్​ కుమార్​ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చదనమే ఉందని.. అందుకే ఆయనకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. తెరాస పాలనపై భాజపా నాయకుల వ్యాఖ్యలను వినోద్​ కుమార్ తిప్పికొట్టారు.

  • పాక్​ సరిహద్దులో డ్రగ్స్​ పట్టివేత 

సరిహద్దుల గుండా భారత్​లోకి భారీగా డ్రగ్స్​ సరఫరా చేసే ప్రయత్నాన్ని భగ్నం చేశాయి బలగాలు. జమ్ముకశ్మీర్​ ఉరీ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వద్ద రూ.25 కోట్లు విలువైన హెరాయిన్​ను(drugs recovered in kashmir) స్వాధీనం చేసుకున్నాయి.

  • రూ.100కే బంగారం కొనొచ్చు.. ఎక్కడంటే?

పండుగల వేళ బంగారం కొనుగోలు(digital gold) చేస్తే మంచిదని చాలా మంది నమ్ముతారు. అయితే.. వేల రూపాయలు వెచ్చించలేక నిరాశ పడతారు. ఇకపై అలా నిరాశకు గురికావాల్సిన అవసరం లేదు. కేవలం రూ.100కే బంగారం(digital gold) కొనుగోలు చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి పలు సంస్థలు(gold business in india). అది ఎలాగో తెలుసుకోండి మరి.

  • మళ్లీ పేరు మార్చుకున్న సామ్​!

14:43 October 03

టాప్​ న్యూస్​ @3PM

  • దీదీ విజయఢంకా

భవానీపుర్ ఉపఎన్నికలో(Bhabanipur by poll) టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) విజయ ఢంకా మోగించారు.తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై భారీ ఆధిక్యాన్ని నమోదు చేశారు. తొలి రౌండ్‌ నుంచీ మమత ఆధిపత్యం కొనసాగించారు. 58,389 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు. ఈ విజయంతో మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు.

  • 'శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్ ఉద్యమిస్తుంది'

రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీనే ప్రత్యామ్నాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత, విద్యార్థి సమస్యలపై నిర్వహించిన జంగ్‌ సైరన్‌ సందర్భంగా జరిగిన ఉద్రిక్తతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​ ఎల్బీనగర్‌లో శ్రీకాంతాచారి విగ్రహానికి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్ ఉద్యమిస్తోందని తెలిపారు.

  • ఆర్మీలో ఉద్యోగాలు 

ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ పోస్టుల భర్తీకి (Indian Army SSC Recruitment 2021) నోటిఫికేషన్ విడుదలైంది. పెళ్లి కాని పురుషులు, మహిళలే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఖాళీలు ఎన్ని ఉన్నాయి? అప్లై చేసుకోవడం ఎలా అన్ని వివరాలు పూర్తి కథనంలో..

  • ధోనీ 'కింగ్​ కాంగ్​' లాంటోడు

టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనిని 'కింగ్​ కాంగ్'గా అభివర్ణించాడు భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి(Dhoni Ravi Shastri). పరిమిత ఓవర్లలో మహీ ఉత్తమ సారథి అని కొనియాడాడు.

  • ఫ్యామిలీమ్యాన్​ నటుడి ఇంట్లో విషాదం

ఫ్యామిలీ మ్యాన్​ 2 వెబ్​సిరీస్​ కథానాయకుడు మనోజ్​ బాజ్​పాయ్​ (Manoj Bajpayee News) నివాసంలో విషాదం నెలకొంది. అతని తండ్రి ఆర్​కే బాజ్​పాయ్​ (Manoj Bajpayee Father) ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని బాలీవుడ్​ డైరెక్టర్​ అవినాష్​ దాస్​ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

13:43 October 03

టాప్ న్యూస్ @2 PM

  • డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడు..

ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్​ పార్టీలో Mumbai Rave Party news) పట్టుబడ్డవారిలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Mumbai Rave Party Superstar Son) సైతం ఉన్నాడు. ఈ విషయాన్ని ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. ఆర్యన్​ను ప్రశ్నిస్తున్న అధికారులు.. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. (Shah Rukh Khan son drugs)

  • మాజీ సీఎం కుమారుడు సజీవ దహనం

కారులో మంటలు (Car Accident News) చెలరేగి మాజీ సీఎం కుమారుడు అక్కడికక్కడే సజీవ దహనం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన మేఘాలయలోని రి-భోయ్​ జిల్లాలో జరిగింది.

  • ఈ బుడతడు మామూలోడు కాదు..

ఐదేళ్ల బాలిక చేసిన ధైర్యాన్ని టీవీలో చూసి ఆశ్చర్యపోయాడు. అరే కిలిమంజారో పర్వతాన్ని భలేగా ఎక్కేసిందే.. నేనూ అలాగే ఎక్కేయాలనుకున్నాడు. ఇంకేముంది తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు. ఎనిమిదేళ్ల వయసులోనే ఐదు నెలల పాటు కఠోర సాధన చేశాడు. యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మరి ఆ చిన్నారి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇదిగో ఇది చదవండి.

  • ఐపీఓ కోసం అతి త్వరలోనే

ఎల్​ఐసీ ఐపీఓకు (LIC IPO update) సంబంధించి మరో కీలక అప్​డేట్ వచ్చింది. వచ్చే నెలలోనే సెబీకి ఎల్​ఐసీ ఐపీఓ దరఖాస్తు (LIC IPO DRHP) సమర్పించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.

  • బంతికోసం ఫిలిప్స్​ పరుగులు

శనివారం(అక్టోబర్​ 2) రాత్రి జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​.. ఛేదనలో అద్భుతంగా రాణించి చెన్నై సూపర్​ కింగ్స్​పై ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో ఓ హాస్యభరితమైన సంఘటన జరిగింది. సామ్​కరన్​(Glenn Phillips Sam curran) వేసిన వైడ్ బంతి కోసం ఫిలిప్స్(Glenn Phillips IPL)​ పరుగులు తీయడం నవ్వులు పూయించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

12:53 October 03

టాప్ న్యూస్ @1 PM

  • దేశంలో తొలి టెక్నలాజీకల్ వర్సిటీ జేఎన్​టీయూహెచ్​

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని గవర్నర్​​ తమిళిసై సౌందరరాజన్​(Governor Tamilisai Soundararajan) సూచించారు. జేఎన్​టీయూ(JNTU) హైదరాబాద్​ స్వర్ణోత్సవాలను (JNTUH Golden Jubilee Celebrations) ఆమె ప్రారంభించారు. వర్సిటీలో పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేక కేంద్రం నిర్మిస్తున్నట్లు తెలిపారు.

  • అమ్మవారి ఆశీస్సులతో హుజూరాబాద్​లో జయకేతనం

హుజూరాబాద్​లో భాజపాదే విజయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ (BANDI SANJAY)దీమావ్యక్తం చేశారు. తొలిదశ ప్రజాసంగ్రామయాత్ర పూర్తైన సందర్భంగా చార్మినార్​ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.

  • డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడు

  • తైవాన్​ గగనతలంలోకి భారీగా చైనా యుద్ధ విమానాలు!

మునుపెన్నడూ లేని స్థాయిలో చైనా యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి చొచ్చుకు వస్తున్నాయని తైవాన్‌(Chinese Planes Taiwan) ఆరోపించింది. శనివారం కూడా 30కిపైగా విమానాలు చక్కర్లు కొట్టాయని చెప్పింది.

  • ఆ హిట్​ రీమేక్​లో పవన్​కల్యాణ్​​-చరణ్​!

పవన్​కల్యాణ్​, రామ్​చరణ్(ramcharan pawankalyan)​ కలిసి నటించనున్నారంటూ ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. మలయాళ హిట్​ 'డ్రైవింగ్​ లైసెన్స్'​లో(driving license telugu remake) వీరిద్దరూ సందడి చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

11:41 October 03

టాప్ న్యూస్ @12PM

  •  అధికారిక ప్రకటన

హుజూరాబాద్ భాజపా అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించింది భాజపా. ఎన్నికల బరిలో ఈటల రాజేందర్ నిలవనున్నట్లు వెల్లడించింది. 

  • జేఎన్‌టీయూలో స్వర్ణోత్సవాలు..

దేశంలోనే తొలి సాంకేతిక విశ్వవిద్యాలయం.. అత్యధిక సంఖ్యలో గుర్తింపు ఉన్న ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలలు.. ఏటా లక్ష మంది ఇంజినీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కోర్సులకు పట్టాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సాధించిన జేఎన్‌టీయూ- హైదరాబాద్‌ 49 ఏళ్లు పూర్తి చేసుకుని శనివారం 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రారంభించారు. ప్రత్యక్షప్రసారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

  • డ్రోన్​ ద్వారా ఆయుధాలు!

అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆయుధాలతో కూడిన ఓ పార్సిల్​ను (Arms Recovery) అధికారాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిని డ్రోన్​ ద్వారా భారత్​కు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

  • 23,957 ఓట్ల ఆధిక్యంలో దీదీ

భవానీపుర్ ఉప ఎన్నికల్లో టీఎంసీ అధినేత్రి, ఆ పార్టీ అభ్యర్థి మమతా బెనర్జీ దూసుకుపోతున్నారు. ప్రత్యర్థికి అందనంత ఆధిక్యం సంపాదించారు. ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి మమతా బెనర్జీ 23,957 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.

  • ఆర్​బీఐ అంచనాలు..

ఈ వారం స్టాక్ మార్కెట్లకు (Stock market) ఆర్​బీఐ సమీక్ష అంచనాలు, అంతర్జాతీయ పరిణామాలు (Market Outlook) దిశా నిర్దేశం చేయనున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత వారం వరుస నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు.. ఈ సారి తేరుకుంటాయా? నిపుణులు ఏమంటున్నారు?

10:45 October 03

టాప్ న్యూస్ @11AM

  • ఆ బాస్​లు అందరూ.. అక్కడ విద్యార్థులే..

దేశంలోనే తొలి సాంకేతిక విశ్వవిద్యాలయం... అత్యధిక సంఖ్యలో గుర్తింపు ఉన్న ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలలు... ఏటా లక్ష మంది ఇంజినీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కోర్సులకు పట్టాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సాధించిన జేఎన్‌టీయూ- హైదరాబాద్‌ 49 ఏళ్లు పూర్తి చేసుకుని శనివారం 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. దిగ్విజయంగా 49 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నేడు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్వర్ణోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ 50 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు, మరెన్నో ప్రత్యేకతలు సాధించింది జేఎన్‌టీయూ. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

  • శిక్షణ తర్వాతే.. 

దళిత బంధు పథకం కింద ఒకరి కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు కలిసి రూ.10 లక్షలకు మించిన యూనిట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. లబ్ధిదారుల అభివృద్ధి కోసం వారు ఎంచుకున్న యూనిట్లకు సంబంధించి అవసరమైన శిక్షణ ఇవ్వాలనిపేర్కొంది. యూనిట్‌ ఏర్పాటుకు లబ్ధిదారులు పూర్తి స్థాయిలో శిక్షణపొంది సన్నద్ధమైనట్లు కలెక్టర్‌, ఎస్‌ఆర్‌టీ సంతృప్తి చెందితేనే నిధుల మంజూరు చేయాలని స్పష్టం చేసింది.

  • ఆరేళ్ల బాలుడ్ని సుత్తితో కొట్టి చంపారు.

బంధువుల మధ్య గొడవ జరగగా.. ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఆరేళ్ల బాలుడి తలపై సుత్తితో బాది హత్య చేశాడు.

  • అతడిని చూసి భయపడ్డాం

చెన్నై సూపర్​ కింగ్స్(chennai super kings rajasthan royals match)​ ఓపెనర్​ రుతురాజ్​ గైక్వాడ్​ ఆటతీరు చూసి భయపడినట్లు చెప్పాడు రాజస్థాన్​ రాయల్స్​ కెప్టెన్​ సంజూ శాంసన్​. శనివారం(సెప్టెంబరు 2) రాత్రి జరిగిన మ్యాచ్​లో అతడు అద్భుతంగా ఆడాడని కొనియాడాడు.

  • మీకు ఏ జీవిత బీమా సరిపోతుంది?

అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి జీవిత బీమా పాలసీలు (Uses of Life Insurance) కుటుంబాన్ని ఆదుకుంటాయి. దీని ప్రాముఖ్యతను గుర్తించిన వారు పాలసీ తీసుకునేందుకు ముందుకు వస్తారు. కానీ, చాలా రకాల పాలసీలు ఉండడంతో కొంత గందరగోళానికి గురవుతారు. మరి మనకు ఏది అవసరం(Best insurance plan).. ఎలాంటి సందర్భంలోనైనా రక్షణ కల్పించేలా ఉండే వాటిని ఎలా ఎంచుకోవాలో చూద్దాం..!

09:46 October 03

టాప్ న్యూస్ @10AM

  • ఉక్కపోత తప్పదు

తెలంగాణలో గత రెండ్రోజులుగా ఉక్కపోత పెరుగుతోంది. వారం రోజులు వరణుడి(Telangana Weather updates) రాకతో వణికిపోయిన నగరవాసులు ఇప్పుడు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 15 వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

  • మూతపడ్డ కళాశాలలు

ప్రాథమిక విద్య(1-5 తరగతులు)లో బోధించేందుకు సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీ) కొలువులకు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ) పాసైనవారూ పోటీపడవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డీఎడ్‌(D.Ed colleges in Telangana) కోర్సులకు గిరాకీ తగ్గిపోయింది. రాష్ట్రంలో గత ఆరేళ్ల కాలంలో సగానికి పైగా కళాశాల(D.Ed colleges in Telangana)లు మూతపడ్డాయి. 2016-17లో 212 డీఎడ్ కళాశాలలుంటే.. ఈసారి 92 కళాశాలలే దరఖాస్తు చేశాయి.

  • 52.80 లక్షల ఎకరాల్లో వరి సాగు!

తెలంగాణలో యాసంగిలో మొత్తం 68.16 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగు అయ్యే అవకాశం ( paddy cultivation in Yasangi)ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఇందులో కేవలం వరి మాత్రమే ఏకంగా 52.80 లక్షల ఎకరాలుంటుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే అవసరానికి మంచి వరి సాగు అవుతోందని చెబుతున్న ప్రభుత్వం.. సాగు విస్తీర్ణం తగ్గించాలని చెబుతోంది. కానీ రైతన్నల ఆలోచన మరోలా ఉన్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

  • చక్రం తిప్పనున్న కిమ్​ సోదరి

దక్షిణ కొరియాలో అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ తరువాత అంత శక్తిమంతమై వ్యక్తి కిమ్​ సోదరి కమ్‌ యో జోంగ్‌ (Kim Sister North Korea). అయితే ఇప్పుడు ఆమెను అమెరికాపై ఒత్తిడి పెంచే దిశగా కిమ్​... ప్రభుత్వ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా నియమించారు. దీంతో సోదరుడి తరఫున విదేశాంగ వ్యవహారాలను చక్కబెట్టే పనిని ఆమెకు అప్పగించినట్లు స్పష్టమైంది. ఒకవైపు శాంతి ప్రతిపాదనలు చేస్తూనే, రెండోవైపు ఆయుధ బలాన్ని ప్రదర్శించడం ఆమె ప్రత్యేకత.

  • ఆర్‌సీబీ.. ప్లేఆఫ్స్‌లో అడుగేస్తుందా?

ఆదివారం పంజాబ్​ కింగ్స్​తో(PBKS vs RCB) తలపడేందుకు సిద్ధమైంది రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు. ఈ మ్యాచ్​లో గెలిస్తే.. ప్లే ఆఫ్​ బెర్తు ఖరారు చేసుకుంటుంది కోహ్లీ సేన.

08:43 October 03

టాప్ న్యూస్ @9AM

  • కౌంటింగ్​​ షురూ

దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బంగాల్ భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితం ఇవాళ వెలువడనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రక్రియ ప్రారంభమైంది. 21 రౌండ్లలో ఈ కౌంటింగ్​ జరగనుంది. భవానీపుర్​తో పాటు బంగాల్​లోని సంసేర్​గంజ్​, జంగీపుర్​ ఉపఎన్నిక ఫలితాలు కూడా వెలువడనున్నాయి.  

  • ఆగని పెట్రో మంట..

దేశంలో ఇంధన​ ధరలు (Fuel Price Today) పరుగులు పెడుతున్నాయి. లీటర్​ పెట్రోల్​పై 25 పైసలు, డీజిల్​పై 30 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.

  • డ్రగ్స్​ పార్టీ'పై దాడులు

ముంబయిలో జరిగిన డ్రగ్ పార్టీపై (Mumbai Rave party news) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు జరిపింది. పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. ఈ పార్టీలో బాలీవుడ్ ప్రముఖుల పిల్లలు పాల్గొన్నారని ఎన్​సీబీ అధికారులు తెలిపారు. ఓ సూపరస్టార్ కుమారుడు సైతం ఇందులో ఉన్నట్లు చెప్పారు.

  • కన్యత్వం అమ్మకానికి..

అమ్మ ప్రాణాలు దక్కించుకోవటంకోసం తన కన్యత్వాన్నే అమ్మకానికి పెట్టింది ఓ పదకొండేళ్ల బాలిక. చిన్నారిని ఒత్తిడి చేసి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమైన ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

  • మొదట సేఫ్‌ అయింది వీళ్లే..

బిగ్​బాస్​లో (Bigg Boss 5 Telugu) వీకెండ్​ ఎపిసోడ్​కు ఉన్నంత క్రేజ్​ అంతా ఇంతా కాదు. అయితే.. ఈ వారం హౌస్‌లో ఉన్న 16మందిలో ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఎవరెవరు సేఫ్ అయ్యారంటే..

07:50 October 03

టాప్ న్యూస్ @8AM

  • అంతర్జాతీయ స్థాయికి బతుకమ్మ పాట

తెలంగాణ మహిళల సంబురం.. సద్దుల బతుకమ్మ(saddula Bathukamma Song 2021) అంతర్జాతీయ స్థాయికి ఎదగనుంది. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించగా.. ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకోనుంది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సారి బతుకమ్మ పాట(saddula Bathukamma Song 2021)ను ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్ మీనన్‌, ఆస్కార్‌ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తెలుగులో రూపొందించారు. ఈ గీతాన్ని ఇతర భాషల్లోకి సైతం అనువదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

  • మహా సముద్రంలో భారత నౌకాదళ స్థావరం?

హిందూ మహాసముద్రంలో చైనాకు చెక్​పెట్టేలా భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మారిషస్​కు చెందిన ఉత్తర అగలేగా దీవిలో రన్‌వే సహా పలు నిర్మాణాలు (Indian Military base in Mauritius) చేపట్టింది. (Agalega Indian Military base) మహాసముద్రంలో నిఘా వేసి డ్రాగన్‌ జోరుకు కళ్లెం వేసేందుకే ఈ సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని భారత్, మారిషస్ ప్రభుత్వాలు మాత్రం ఖండిస్తున్నాయి.

  • తాలిబన్ల కొత్త ఆత్మాహుతి దళం

తాలిబన్లు (Taliban News) కొత్తగా ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేసినట్లు అఫ్గానిస్థాన్​లో బదాక్షన్​ ప్రావిన్స్​ గవర్నర్ ముల్లా సిసార్​ అహ్మద్​ అహ్మదీ తెలిపారు. వీరు ముఖ్యంగా చైనా, తజకిస్థాన్​ సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ​

  • ఆ లక్షణాలు మీలో ఉన్నాయా..?

కరోనా(CORONA VIRUS) వ్యాప్తి తగ్గినా.. ఆ పేరు వింటే కలిగే వణుకు మాత్రం తగ్గడం లేదు. 'కరోనా వచ్చి పోయింది.. అనంతరం టీకాలు(COVID VACCINE) తీసుకున్నాం, ఇకేం భయం లేదు' అనుకునే వారందరిని కొత్తగా వస్తున్న సమస్యలు కలవరపెడుతున్నాయి. మానవ శరీరంలోని అన్ని భాగాలపై(Corona effect on human body) కొవిడ్ ప్రభావం చూపుతూ.. మరోసారి ఆస్పత్రుల పాలు చేస్తుంది. తాజాగా చిన్నపేగులపై కరోనా ప్రభావం(Corona effect on small intestine) చూపుతున్నట్లు తెలింది. ఇటీవల రోజుల వ్యవధిలో ఆరుగురు తీవ్ర కడుపునొప్పితో నిమ్స్‌లో చేరారు. వారి చిన్నపేగుల్లో రక్తం గడ్డకట్టి గ్యాంగ్రేన్‌(GANGRENE) (కుళ్లిన స్థితి)గా మారినట్లు వైద్యులు గుర్తించారు.

  • సింగరేణి టాప్

విద్యుదుత్పత్తి(Power generation in Telangana)లో తెలంగాణ జెన్​కో, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలు(Singareni Thermal Power Project) దేశంలో వరుసగా తొలి రెండు ర్యాంకులు సాధించాయి. ఏపీ జెన్​కో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యుత్ శాఖ వెలువరించిన నివేదికలో ఈ ర్యాంకులు ప్రకటించింది.

06:40 October 03

టాప్ న్యూస్ @7AM

  • ఆలోచించు.. బంగారం పండించు

దేశానికి అన్నం పెట్టే అన్నదాతను అనావృష్టి, అతివృష్టి, చీడపీడలు, గిట్టుబాటు కాని ధరలు, సరైన మార్కెటింగ్‌ సదుపాయం లేకపోవడం.. ఇలా ఎన్నో సమస్యలు పట్టిపీడిస్తుండటంతో అప్పులే మిగులుతున్నాయి. రుణమే పాశమై కొందరు బలవన్మరణాలకూ పాల్పడుతుండటం విషాదకరం. విపత్కర పరిస్థితుల్లోనూ వినూత్నంగా ఆలోచిస్తే(new farming ideas).. సేద్యంలోనూ లాభాల బాట పట్టవచ్చంటున్నారు పలువురు కర్షకులు. డ్రాగన్‌ ఫ్రూట్‌, యాపిల్‌, ఉద్యాన పంటల సాగు, నాటుకోళ్లు, చేపల పెంపకం.. ఇలా విభిన్న మార్గాల్లో పయనిస్తూ ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అని నిరూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్ఫూర్తిగా నిలుస్తున్న కొందరు రైతులపై ప్రత్యేక కథనాలు..

  • సమర స్ఫూర్తి 'సబర్మతి'

దేశాన్ని ఏకతాటిపై నడిపిన మహాత్ముని వజ్ర సంకల్ప కేంద్రం సబర్మతి ఆశ్రమం. స్వాతంత్ర్యోద్యమానికి ఆయువు పట్టుగా నిలిచిన ముఖ్యకేంద్రం. అనేక చారిత్రక ఉద్యమఘట్టాలకు శ్రీకారం చుట్టిన ప్రాకారం. దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవ సంవత్సరంలో బాపూజీ నివసించిన సబర్మతి ఆశ్రమ అవలోకనం ఎంతో స్ఫూర్తిదాయకం.

  • 75వేల వరకు ఉపకార వేతనం

కొవిడ్‌ బాధిత కుటుంబాల్లోని పిల్లల(Covid 19 Children) చదువులకు ఉపకారవేతనం అందించనుంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. 2020 జనవరి తరవాత కొవిడ్‌ వల్ల తల్లి లేదా తండ్రి లేదా ఇద్దర్నీ కోల్పోయిన పిల్లలకు ఒకసారి ఆర్థిక సాయం రూపంలో రూ.15,000 నుంచి రూ.75,000 వరకు ఇవ్వనుంది.

  • మర్మమేంటి..?

ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​కు(cg cm bhupesh baghel) కీలక బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్​ అధిష్ఠానం. ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల(up polls 2022) సీనియర్​ పరిశీలకుడిగా నియమించింది. సీఎం మార్పుపై(chhattisgarh cm change) జోరుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • అలా చేయకపోతే గెలవలేం

బ్యాట్స్​మెన్​ పరుగులు చేయకపోతే మ్యాచ్​లు గెలవడం కఠినంగా మారుతుందని అన్నాడు ముంబయి ఇండియన్స్​ సారథి రోహిత్ శర్మ. ఈ ఐపీఎల్​లో (IPL 2021) తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయడం లేదని దిల్లీతో (MI vs DC) ఓటమి అనంతరం వ్యాఖ్యానించాడు.

05:39 October 03

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు

  • నేడే జేఈఈ 

నేడు దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్ పరీక్ష (JEE Advanced Online Exam) జరగనుంది. మొత్తం 23 ఐఐటీల్లో (IIT) సుమారు 16 వేల 500 సీట్లు ఉండగా... దాదాపు లక్ష 70వేల మంది పోటీ పడుతున్నారు.

  • పోడు భూములపై చర్చ

పోడు భూముల సమస్యలపై సోమవారం శాసనసభలో చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Cm Kcr) నిర్ణయించారు. అటవీ భూములపై హక్కు గుర్తింపు చట్టం (RVFR) కింద గడువు (కటాఫ్‌ తేదీ)ను పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయించనున్నారు.

  • బీమా అమలయ్యేనా?

రాష్ట్రంలో పంటల బీమా(Pantala Beema)పై సర్వత్రా విస్తృత చర్చ సాగుతోంది. ప్రకృతి వైపరీత్యాల బారినపడి పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపు ప్రస్తావన లేకుండా పోయింది. 2020 ఖరీఫ్ సీజన్‌ నుంచి ప్రధానమంత్రి పంట బీమా పథకం (Prime Minister's Crop Insurance Scheme) అమలు నిలిపేసిన రాష్ట్ర ప్రభుత్వం... కొత్తగా మరో పంట బీమా పథకం ప్రవేశపెట్టి అమలు చేయకపోవడం వల్ల అన్నదాతలకు పరిహారం దక్కడం లేదు. 

  • వాటిపైనే మొదటి సంతకం

భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ (Bjp State President Bandi Sanjay) చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర (Praja sangrama yatra) తొలివిడత శనివారం ముగిసింది. ఆగస్టు 28న హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభమై 36 రోజుల పాటు 438 కి.మీ. మేర సాగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ (Husnabad Bjp Meeting)లో నిర్వహించిన ముగింపుసభకు ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి స్మృతిఇరానీ (Smiriti Irani) హాజరయ్యారు.

  • ఉద్రిక్తంగా జంగ్ సైరన్

కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగ యువత, విద్యార్థి సమస్యలపై జంగ్‌ సైరన్‌ (Congress Jung Siren)) పేరుతో చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. లాఠీఛార్జీలు, తోపులాటలు, అరెస్టులతో దద్దరిల్లింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ఇంటి వద్దనే అడ్డుకున్న పోలీసులు... దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ వద్ద వందలాది మంది మోహరించి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.

  • ముష్కరుల దాడి

కశ్మీర్​లో(Kashmir News) వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో(Terrorist Attack) ఓ పౌరుడు మృతిచెందాడు. మరొకరు గాయపడ్డారు. మరోచోట సీఆర్‌పీఎఫ్ బంకర్​పై ముష్కరులు గ్రనేడ్ దాడి జరిపినట్లు పోలీసులు తెలిపారు.

  • ఇంధన కొరత

ఇంధన కొరత సమస్య పరిష్కారానికి బ్రిటన్ ప్రభుత్వం.. సైన్యం సాయం తీసుకోనుంది. 200 మంది ఆర్మీ సిబ్బందిని వినియోగించనున్నట్లు ఆదేశ ప్రభుత్వం తెలిపింది. ట్రక్కు డ్రైవర్ల లేమితో బ్రిటన్‌లో ఇంధన కొరత(Fuel Crisis UK) ఏర్పడింది.

  • హెడ్​​​ఫోన్స్​ వాడడం నేరం

స్మార్ట్​ ఫోన్​ ఉన్నవారు హెడ్​ఫోన్స్​, బ్లూటూత్​ వినియోగించటం సర్వసాధారణంగా మారింది. ఓ వైపు బ్లూటూత్​ ద్వారా పాటలు వింటూ, ఫోన్​ మాట్లాడుతూనే.. బైక్​, కారు డ్రైవింగ్​(bluetooth earphones while driving ) చేస్తుంటారు కొందరు. 

  • రాజస్థాన్ ధనాధన్

చెన్నైతో జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ జైస్వాల్ శుభారంభం చేయగా, శివం దుబై అర్థ శతకంతో రాణించాడు.

  • మేం విడిపోతున్నాం

ప్రముఖ టాలీవుడ్ జోడీ నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు చైతూ, సమంత.

Last Updated : Oct 3, 2021, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.