ETV Bharat / city

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు - తెలంగాణ లేటెస్ట్ వార్తలు

ఈటీవీ భారత్
ఈటీవీ భారత్
author img

By

Published : Sep 29, 2021, 5:51 AM IST

Updated : Sep 29, 2021, 10:10 PM IST

22:03 September 29

టాప్​న్యూస్​ @10PM

  •  'భయమంటే ఎలా ఉంటుందో.. నేను నేర్పిస్తా'

నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అనే సామెతను వైకాపా ప్రభుత్వం నిజం చేస్తోందని జనసేనాని పవన్‌ కల్యాణ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి గురించి ఏపీలో మాట్లాడటానికేం లేదని.. రోడ్లు వేయటానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని ఆక్షేపించారు. ప్రజలు నా వారు అనుకోబట్టే ప్రతి సన్నాసితో తిట్టించుకుంటున్నానంటూ మండిపడ్డారు.

  •  కారులో చెలరేగిన మంటలు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద కారులో (Car fire at toll plaza) అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రేనాల్ట్ లార్జ్ కారు వరంగల్ నుంచి హైదరాబాద్​కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది

  •  మళ్లీ పెరిగిన కరోనా కేసులు

కేరళలో కరోనా కేసులు(Kerala Covid Cases) మళ్లీ పెరిగాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 12,161 మందికి వైరస్(Kerala Covid Cases)​ సోకినట్లు తేలింది. మరో 155 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మిజోరంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 1,980 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

  •  నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి 

తన జీవితంలో(allu arjun sneha reddy) అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలిపారు హీరో అల్లుఅర్జున్​. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్​స్టా వేదికగా ఆ వ్యక్తి గురించి ప్రత్యేకంగా ఓ వ్యాఖ్య రాసుకొచ్చారు.

  • ఆర్సీబీ లక్ష్యం 150

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది రాజస్థాన్ రాయల్స్(RR vs RCB 2021). లూయిస్ (58), జైస్వాల్ (31)ఆకట్టుకున్నారు.

20:47 September 29

టాప్​న్యూస్​ @9PM

  • ​ షర్మిలతో పీకే భేటీ.. !

వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ బలోపేతం, విస్తరణ సహా భవిష్యత్​ కార్యాచరణపై పార్టీ అధ్యక్షురాలు(ysrtp president ys sharmila)షర్మిల దృష్టిసారించారు. హైదరాబాద్​ లోటస్ ​పాండ్​లో వైఎస్​ షర్మిలను ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ (election stagestist prashant kishor) బృంద ప్రనిధులు కలిశారు

  • స్వల్పంగా పెరిగిన  కేసులు

భారత్​లో కొవిడ్​ కేసులు (Coronavirus update) స్పల్పంగా పెరిగాయి. కొత్తగా 18,870 మంది వైరస్​ (Coronavirus India) బారినపడ్డారు. ఒక్కరోజే 28,178 మంది కొవిడ్​ను జయించారు. మరో 378 మంది మృతిచెందారు.

  • ఐపీఎల్‌ బెట్టింగ్ ముఠా అరెస్టు

హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు(IPL betting gang arrested). పక్కా సమాచారంతో మియాపూర్‌, బాచుపల్లి, గచ్చిబౌలి, మైలార్‌దేవ్‌ పల్లి సహా 7 ప్రాంతాల్లో దాడులు చేసి 23 మంది బుకీలను పట్టుకున్నారు. వారి నుంచి 93 లక్షల నగదు సహా 2.2 కోట్ల విలువైన సొత్తును సీజ్‌ చేశారు.

  • అర్జున్ తెందూల్కర్ ఔట్.

సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్(arjun tendulkar ipl) ఐపీఎల్ 2021(IPL 2021 News) నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా లీగ్​కు దూరమైన ఇతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకుంది ముంబయి ఇండియన్స్.

19:54 September 29

టాప్​న్యూస్​ @8PM

  •  'మరో లేఖ'

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. నాగార్జునసాగర్​ కుడి, ఎడమ కాలువల నీటి విడుదల సామర్థ్యాలు సమానంగా ఉండాలని లేఖలో కోరింది. రెండు కాలువల వద్ద ఉన్న అసమానతలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేసింది.

  •  గుండెపోటు వస్తే ఏం చేయాలి?

దేశంలో ప్రతి యేటా 7లక్షల మందికి పైగా గుండెపోటు(Sudden Cardiac Arrest)తో చనిపోతున్నారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. హృద్రోగ సమస్యలతో పాటు అధిక రక్తపోటు కూడా ఆకస్మిక గుండెపోటుకు కారణమవుతోంది.

  • విడాకుల నోటీసు పంపిందని.. ముగ్గురిని !

దాంపత్య కలహాలు ముగ్గురి హత్యకు దారితీశాయి. భార్యతో తరచూ గొడవ పడుతూ.. చివరకు ఆమెను చంపేశాడు ఓ భర్త (Husband killed wife news). మహిళ తల్లి, చెల్లిని సైతం కిరాతకంగా కడతేర్చాడు.

  • లంచం ఇస్తే ఓకే.. కానీ డిమాండ్ చేయొద్దు..!

ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ప్రజలు స్వచ్ఛందంగా లంచం ఇస్తే అధికారులు తీసుకోవచ్చని, కానీ కచ్చితంగా ఇంత కావాలని డిమాండ్ చేయొద్దని ఆమె అన్నారు. లంచం చిటికెడు ఉప్పు పరిమాణంలో ఉంటే అభ్యంతరం లేదని, కానీ మొత్తం భోజనం లాక్కునేలా ఉండొద్దని అధికారులకు హితవు పలికారు.

  • రాజస్థాన్ బ్యాటింగ్

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది రాజస్థాన్ రాయల్స్ (RR vs RCB 2021). ఈ మ్యాచ్​లో ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది.

18:49 September 29

టాప్​న్యూస్​ @7PM

కమలం గూటికి అమరీందర్..!

పంజాబ్ రాజకీయాల్లో రోజుకో అనూహ్య పరిణామం చోటు చేసుకుంటోంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్.. అమిత్​షాతో భేటీ అయ్యారు. దిల్లీలోని షా నివాసంలో ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. దీంతో కెప్టెన్ భాజపాలో చేరుతారన్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది. 

గాయత్రికి కేటీఆర్ భరోసా

నల్గొండ జిల్లా చండూరులో కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న గాయత్రి(21) పరిస్థితిపై మంత్రి కేటీఆర్(KTR RESPOND) స్పందించారు. ఆ యువతికి వీలైనంత త్వరలోనే ఆర్థిక సాయం అందజేస్తామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ నెల 23న గాయత్రి ఆరోగ్య పరిస్థితిపై 'ఈనాడు'లో 'మాత్రలు వేసుకుంటేనే మనుగడ' శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న కేటీఆర్.. ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

కోర్టులోనే భార్య కాలు నరికేసిన భర్త..!

కోర్టు ప్రాంగణంలోనే భార్య కాలిని తెగ్గోశాడు కిరాతక భర్త(Husband attacks Wife). దంపతుల మధ్య ఆర్థిక తగాదాలు ఉన్నాయి. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ విచారణకు హాజరైన సమయంలోనే ఈ ఘటనకు ఒడిగట్టాడు ఆ వ్యక్తి.

 మాకే శిక్ష వేస్తారా?

అఫ్గాన్​లో తాలిబన్లు(Afghanistan Taliban) అధికారం చేపట్టిన తర్వాత.. ​గత ప్రభుత్వంలో న్యాయమూర్తులుగా సేవలందించిన మహిళలు ఎంతో భయాందోళనకు లోనవుతున్నారు. ప్రాణభయంతో బయటకు అడుగుపెట్టకుండా కాలం వెళ్లదీస్తున్నారు. అయితే.. వారికి ఎవరి నుంచి ముప్పు పొంచి ఉంది? అంతలా భయపడటానికి వారు చేసిందేంటి? 

రిలీజ్​పై 'రాధేశ్యామ్' క్లారిటీ..!

'రాధేశ్యామ్'​(prabhas radhe shyam release date) విడుదల తేదీలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది చిత్రబృందం. 2022 సంక్రాంతికి రిలీజ్ అవ్వడం పక్కా అని​ చెప్పింది. 

17:43 September 29

టాప్​న్యూస్​ @6PM

  • 'భయమంటే ఏంటో నేర్పిస్తా'

  • ' ఆ నిర్ణయాలు ఎవరివో తెలీదు'

పంజాబ్ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నేత కపిల్ సిబల్ (Kapil Sibal news) వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని పేర్కొన్నారు. పంజాబ్​లో ప్రస్తుత పరిస్థితులు (Punjab Congress Crisis) పాకిస్థాన్​కు ప్రయోజనం కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్​కు అధ్యక్షులు లేరని, నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో తెలీదని వ్యాఖ్యానించారు.

  • 'డబ్బు కోసమే లష్కరేలో చేరా'

భారత్​లోకి చొరబాటుకు యత్నించి.. భారత సైన్యానికి చిక్కిన ఉగ్రవాది అలీ బాబర్​ పాత్రా(Pakistan news) సంచలన విషయాలు బయటపెట్టాడు. తనను పాక్​ సైన్యం, ఐఎస్​ఐ, లష్కరే తోయిబా(ఎల్​ఈ​ఈటీ) భారత్​కు పంపించాయని చెప్పాడు. తనను విడిపించి, తిరిగి తీసుకెళ్లాలని అక్కడి కమాండర్లకు విజ్ఞప్తి చేశాడు. తనది పేద కుటుంబమని, డబ్బు కోసమే లష్కరేలో చేరానని మీడియాకు వెల్లడించాడు.

  • 'భార్య, పిల్లలతో సహా భర్త కూాడా.!'

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గదిలో ఉరితాడుకు వేలాడుతూ శవమై కనిపించారు. కుటుంబ కలహాల నేప‌థ్యంలోనే వీరంతా బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • రూమర్స్​పై​ సమంత క్లారిటీ

తనపై వస్తున్న రూమర్స్​కు చెక్​ పెట్టారు స్టార్​ హీరోయిన్​ సమంత(samantha marriage life). అందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే 'శాకుంతలం'(samantha shakuntala movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సామ్​.

16:41 September 29

టాప్​న్యూస్​ @5PM

'పాడిపరిశ్రమ  కోసం కృషి '

మదర్ డెయిరీ లాభాలకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి కేటీఆర్(ktr about dairy development) సూచించారు. రాష్ట్రంలో హరితవిప్లవంతో పాటు క్షీరవిప్లవం మొదలైందన్నారు. సాగునీరు అందుబాటులోకి రావడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు.

 'ప్రతిపక్షాలు భయపడుతున్నాయి'

మంత్రి కేటీఆర్ స్పీచ్‌కు ప్రతిపక్షాలు ఆగమాగమవుతున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Mla jeevan reddy comments) అన్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పీఎం మోదీకి(pm modi) లేఖలు రాయాలని.. సీఎం కేసీఆర్‌కు(cm kcr) కాదని సూచించారు. ఫసల్ బీమాను భాజపా పాలిత(bjp) రాష్ట్రాలూ తిరస్కరించాయని పేర్కొన్నారు.

 'ఆ రంగంపై కేటీఆర్‌వి అబద్ధాలు.. !'

అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పిన ఐటీ మంత్రి కేటీఆర్... చర్చకు ముందుకు రావాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan rao fires on KTR) డిమాండ్ చేశారు. 2014కు ముందే వేవ్‌రాక్ నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు. టెక్నోసిటీ నిర్మిస్తామన్న టిస్మాన్ స్పెయిర్‌కు ప్రభుత్వం సహకరించలేదని విమర్శించారు.

కేంద్రం గ్రీన్​సిగ్నల్​

ఎక్స్​పోర్ట్​ క్రిడెట్​ గ్యారంటీ కార్పొరేషన్​ లిమిటెడ్​ను ఐపీఓ ద్వారా స్టాక్​ ఎక్స్చేంజీలో నమోదు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెప్పింది. మూలధన పెట్టుబడిగా రూ. 4,400 కోట్లు పెట్టనున్నట్లు స్పష్టం చేసింది. బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్​ పలు నిర్ణయాలు తీసుకుంది.

చైనాలో అంధకారం

విద్యుత్ సంక్షోభంతో చైనా (China power crisis) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అనేక రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు ఈ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. (Blackout in China 2021) కొన్ని రాష్ట్రాలు రోజుకు 9 గంటలకు పైగా విద్యుత్ కోతలను అమలు చేస్తున్నాయి. (China power crunch)

15:48 September 29

టాప్​న్యూస్​ @4PM

'ఆ అధికారాన్ని తొలగించలేరు'

కోర్టు ధిక్కరణకు(contempt of court) పాల్పడిన వారిని శిక్షించేందుకు న్యాయస్థానాలకు రాజ్యాంగం ద్వారా అధికారం లభించిందని, దానిని శాసన చట్టాల ద్వారా కూడా తొలగించలేరని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఓ ఎన్​జీఏ ఛైర్​పర్సన్​పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

'వారి దృష్టిలో  భూభాగమే..!'

భారతీయుల మధ్య సంబంధాలను దెబ్బతీస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ(Rahul Gandhi News). ఆ బంధాలను ప్రేమతో పునర్నిర్మించడమే తన కర్తవ్యమన్నారు. వారి దృష్టిలో భారత్​ అంటే భూభాగమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఐపీఎల్‌ బెట్టింగ్ ముఠా అరెస్టు

చెట్లు నరికినందుకు రూ. 4లక్షల జరిమానా..

స్థిరాస్థి సంస్థ 'వెస్ట్ సైడ్ వెంచర్స్​'కు అటవీ శాఖ జరిమానా విధించింది. అనుమతి లేకుండా చెట్లను నరికేసేందుకు గాను రూ. 4లక్షల జరిమానా విధిస్తూ.. కొత్త మొక్కలు నాటాలని ఆదేశించింది. 

కోహ్లీ కెప్టెన్సీపై బీసీసీఐ ఏమందంటే!

టీమ్ఇండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు విరాట్ కోహ్లీ(virat kohli captaincy). దీని వెనక బలమైన కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. అలాగే కొందరు సీనియర్లు కోహ్లీ సారథ్యం పట్ల అసంతృప్తితో ఉన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్.

14:36 September 29

టాప్​న్యూస్​ @3PM

  • రెండురోజుల్లో ప్రకటన

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మరోసారి తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థులే ప్రాణాలు అర్పించారు తప్ప... నాయకులు కాదని అన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలను తెరాస రాజకీయంగా వాడుకున్నదని ఆరోపించారు.

  • సంక్షోభంలో జిన్నింగ్ మిల్లులు

రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లులు (Ginning Cotton Mills) సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ విధానాలు, రాయితీల ప్రోత్సాహం నేపథ్యంలో పత్తి మిల్లులు నెలకొల్పిన యాజమానులు బకాయిలు రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.

  • 'ఒక్కటే కూల్చేస్తాం.. ఒప్పుకోండి'

ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రముఖ రియల్​ ఎస్టేట్​ కంపెనీ సూపర్​ టెక్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో అత్యున్నత న్యాయస్థానం.. 40 అంతస్తుల జంట భవనాలను 3 నెలల్లోగా కూల్చివేయాలని ఆదేశించగా.. అందులో ఒక్కదాన్నే కూల్చేసేందుకు అంగీకరించాలని ఇప్పుడు కోర్టును అభ్యర్థించింది.

  • వాటి ధరలు 3 శాతం వృద్ధి!

కరోనా సంక్షోభం నుంచి రియల్టీ రంగం క్రమంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అనరాక్​ ప్రాపర్టీ కన్సల్టెంట్ (Housing sales data) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జులై-సెప్టెంబర్ మధ్య దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో (Housing sales in India) ఇళ్ల విక్రయాలు రెండింతలు పెరిగినట్లు తెలిసింది. ఈ మూడు నెలల కాలంలో మొత్తం 62,800 యూనిట్లు విక్రయమైనట్లు వెల్లడైంది.

  • 'అతనే కెప్టెన్'

విరాట్ తర్వాత భారత టీ20 జట్టుకు రోహిత్(rohit sharma ipl) కెప్టెన్​గా ఉంటే బాగుంటుందని గావస్కర్ అన్నాడు. వైస్​ కెప్టెన్​గా జట్టులోని ఇద్దరు యువ క్రికెటర్ల పేర్లను సూచించాడు.

13:53 September 29

టాప్​న్యూస్​ @2PM

  • కేసీఆర్​కు బండి సంజయ్​ లేఖ..

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ విషయంలో సీఎం కేసీఆర్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay letter to Kcr) పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లలో ఎన్ని పూర్తి చేశారని అడిగారు. ఈ మేరకు కేసీఆర్​కు బండి సంజయ్ లేఖ(Bandi Sanjay letter to Kcr) రాశారు.

  • హుజూరాబాద్​లో  లిక్కర్​ జోరు

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మరోవైపు మద్యం అమ్మకాలు(huzurabad liquor sales) జోరందుకున్నాయి. ఇప్పటికే రికార్డుస్థాయిలో మద్యం అమ్ముడుపోతోంది. పక్క జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈటల రాజేందర్ రాజీనామాతో ఐదు మాసాలుగా హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల్లో రూ.వందల కోట్లలో లిక్కర్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. అసలే దసరా సీజన్.. ఆపై ఎన్నికల ప్రభావం.. మరో నెలపాటు కిక్కే కిక్కు ఉంటుందని అంచనాలున్నాయి.

  • సజ్జనార్‌ విచారణ వాయిదా..

దిశ నిందితుల ఎన్​కౌంటర్​ కేసుపై ఎన్‌హెచ్చార్సీ బృందాన్ని సిర్పూర్కర్ కమిషన్(justice sirpurkar commission) ప్రశ్నిస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన సజ్జనార్ విచారణ వాయిదా పడింది.

  • శ్రీరాంసాగర్‌కు వరద..

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో(heavy rains in telangana) రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు(sriram sagar project water level) వచ్చి చేరుతోంది.

  • భారత్​కు తాలిబన్ల లేఖ

అఫ్గానిస్థాన్​కు విమాన సేవలను పునరుద్ధరించాలని(flights to afghanistan from india) కోరుతూ భారత్​కు లేఖ రాశారు తాలిబన్లు(Afghanistan Taliban). ప్రస్తుతం వారి లేఖను పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ పరిశీస్తున్నట్లు సమాచారం.

12:51 September 29

టాప్​న్యూస్​ @1PM

  • పోసానిపై జనసేన ఫిర్యాదు.. పోలీసులు ఏం చేశారో తెలుసా?

పవన్​ వర్సెస్​ పోసాని మధ్య వార్​ ముదురుతోంది. పోసానిపై జనసేన కార్యకర్తలు పంజాగుట్ట పీఎస్​లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ ఫిర్యాదును పోలీసులు న్యాయ సలహాకు పంపారు. లీగల్ ఓపీనియన్ తర్వాత నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.

  • చోరీకి గురైన బైక్​.. మరుసటి రోజే దొరికింది.! ఎలా అంటే..

ఒక సినిమాలో ఓ దొంగ విచిత్రంగా దొంగతనాలు చేస్తుంటాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వాళ్ల బైక్ దొంగతనం చేస్తాడు. వాళ్లు గాబరా పడి పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి వచ్చేలోపు ఆ బైక్ యథాస్థానంలో ఉంటుంది. అందులో మళ్లీ చిట్టీ కూడా రాసి ఉంటుంది. 'అవసరం ఉండి బండి దొంగిలించాను. మీ బైక్ వాడుకున్నందుకు ఇందులో సినిమా టికెట్లు పెడుతున్నాను. మీరంతా కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్తే సంతోషిస్తాను' అని రాసి పెడతాడు. దొంగ నిజాయతీకి ముచ్చటపడి సంతోషంతో సినిమాకు వెళ్తారు. వాళ్లు తిరిగి ఇంటికి వచ్చేలోపు ఉన్నదంతా దోచుకుపోతాడు. ఈ సినిమాలో దొంగ స్టోరీ చీటింగ్ అయితే ఇక్కడ దొంగ మాత్రం నిజంగా(Bike theft) నిజాయతీపరుడేనండోయ్.. ఎందుకంటారా ఇది చదవండి...

  • చమురే ప్రధాన ఇంధన వనరా?

కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో.. విద్యుత్​ వాహనాల వినియోగం వైపు ప్రపంచం పరుగు పెడుతున్న తరుణంలో.. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య 'ఒపెక్​' (OPEC World Oil Outlook) నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. మరిన్ని దశాబ్దాల పాటు చమురే ప్రధాన ఇంధనంగా (OPEC forecast on OIL demand) ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒపెక్ ఓ నివేదిక విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం

ఐపీఎల్​లో(ipl 2021) పంజాబ్ కింగ్స్ ఒత్తిడి తట్టుకోలేకపోతుందని ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. మంబయితో మ్యాచ్​ ఓటమి అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. తర్వాతి మ్యాచ్​ల్లో రాణిస్తామని చెప్పాడు.

  • 'పవన్​కల్యాణ్​ను 'పవర్​స్టార్' చేసింది నేనే'

'పవర్​స్టార్' టైటిల్ పవన్​కల్యాణ్​కు తానే పెట్టినట్లు సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali News) చెప్పారు. 'గోకులంలో సీత' చిత్రానికి తానే కథ అందించానని.. చిత్రంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan Movies)నటన చూసి..' పవర్​స్టార్' టైటిల్ పెట్టినట్లు తెలిపారు.

11:50 September 29

టాప్​న్యూస్​ @12PM

  • ఎవరిపైనా వైరం లేదు..

పంజాబ్​ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ(పీసీసీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి స్పందించారు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ(Sidhu news). వ్యక్తిగతంగా ఎవరితోనూ శత్రుత్వం లేదని ఆయన అన్నారు. తన 17 ఏళ్ల రాజకీయ జీవితం.. ప్రజల జీవితాలను మెరుగపరచడం కోసమే జరిగిందని వ్యాఖ్యానించారు.

  • నిర్లక్ష్యం వహిస్తే.. మరణమే శరణ్యం

రేబిస్‌(Rabies Diseases) మందులేని మహమ్మారి. కుక్క కాటే కదా అని నిర్లక్ష్యం వహిస్తే... నిలువునా ప్రాణాలు తీసే రక్కసి అవుతోంది. ఒక్క సూది మందుతో ప్రాణాలు కాపాడుకునే అవకాశం వున్నా... అవగాహనా లోపం మాత్రం ఉసురు తీస్తోంది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మందిని బలితీసుకుంటోంది. ప్రపంచ రేబిస్ దినాన్ని (World Rabies Day 2021) పురస్కరించుకుని ప్రత్యేక కథనం.

  • ఉత్తర కొరియా క్లారిటీ

మంగళవారం(సెప్టెంబరు 28).. జరిపిన క్షిపణి పరీక్షపై(North Korea missile test latest news) ధ్రువీకరించింది ఉత్తర కొరియా. అణ్వస్త్రాలను మోసుకెళ్లే హైపర్‌ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు(North Korea missile test ) వెల్లడించింది. క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా, జపాన్‌ ఆరోపించిన మరుసటి రోజే ఉత్తరకొరియా అధికారికంగా ప్రకటించింది.

  • ఐపీఓ షురూ..

ఆదిత్య బిర్లా క్యాపిటల్, సన్ లైఫ్ ఏఎంసీల సంయుక్త సంస్థ.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ (Aditya Birla Sun Life AMC IPO) ఐపీఓకు వచ్చింది. దాదాపు రూ.2,770 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో బుధవారం ఐపీఓ ప్రారంభించింది. ఐపీఓలో ఒక షేరు ధర (Aditya Birla Sun Life AMC Share price) ఎంత? కనీసం ఎన్ని లాట్లు (Aditya Birla Sun Life AMC lot size) కొనాలి? అనే వివరాలు ఇలా ఉన్నాయి.

  • దాచినా దాగని అందం.. 

దాచినా దాగని అందం సౌందర్య శర్మ సొంతం. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ నెటిజన్లను అలరిస్తున్న ఈ అప్సరస ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

10:54 September 29

టాప్​న్యూస్​ @11AM

  • పంజాబ్​లో ఏం జరుగుతోంది?

పంజాబ్​ కాంగ్రెస్​ కమిటీ పదవికి నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ రాజీనామాతో సంక్షోభ పరిస్థితులు(punjab congress crisis) మరింత క్లిష్టంగా మారాయి. ఈ క్రమంలోనే అత్యవసరంగా కేబినెట్​ భేటీకి(punjab cabinet meeting today) పిలుపునిచ్చారు సీఎం చరణ్​జీత్​ సింగ్​ చన్నీ. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్​ తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉండనుంది?

  • శ్రీచైతన్యలో కరోనా కలకలం

బెంగళూరులోని శ్రీచైతన్య విద్యాసంస్థలో 60 మంది విద్యార్థులకు కొవిడ్​ పాజిటివ్​గా(Corona virus) తేలింది. మొత్తం 480కి పరీక్షలను నిర్వహించగా 60మందికి నిర్ధరణ అయినట్లు విద్యాసంస్థల యాజమాన్యం తెలిపింది.

  • గవర్నర్ తమిళిసైకి ఊరట

పరువునష్టం కేసులో గవర్నర్‌ తమిళిసై(tamilisai soundararajan)కి ఊరట లభించింది. తమిళిసై 2017లో భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌పై చేసిన వ్యాఖ్యలపై వీసీకే సభ్యుడు తాటి కార్తికేయన్‌ కాంచీపురం కోర్టులో పరువునష్టం వ్యాజ్యం వేశారు. దీనిని కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు(madras high court quashes defamation case) ఉత్తర్వులిచ్చింది.

  • ఆహారం కలుషితమైతే..

కొన్ని రోజులుగా ముసురు వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో ఏమాత్రం ఆహారం కలుషితమైనా.. పేగు సంబంధిత వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని జాతీయ పోషకాహార సంస్థ విశ్రాంత శాస్త్రవేత్త డా.సుదర్శన్‌ హెచ్చరిస్తున్నారు. వీధి పక్కన ఆహారం వడ్డించేవారు (Food Safety and Standards Authority of India) ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

  • పక్కా పల్లెటూరి యువతిగా రష్మిక

'పుష్ప'(Pushpa Release Date) చిత్రం కథానాయికగా రష్మిక మందాన(Rashmika Mandanna Upcoming Movie) ఫస్ట్​లుక్ వచ్చేసింది. 'శ్రీవల్లి' పాత్రలో ఈమె కనిపించనుంది.

09:52 September 29

టాప్​న్యూస్​ @10AM

  • ఉపపోరుకు వ్యూహాలు..

ఎట్టకేలకు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక (Huzurabad bypoll 2021)తేదీ ఉత్కంఠ వీడింది. ఇన్నాళ్ల ఎదురు చూపులకు తెరపడింది.. వచ్చేనెల 8న నామినేషన్ల సమర్పణకు గడువు, 30న ఎన్నిక తేదీ ఖరారవడం.. మంగళవారం షెడ్యూల్‌ వెలువడటంతో రాజకీయ సందడి మొదలైంది. కొన్ని నెలలుగా రాష్ట్రస్థాయి రాజకీయాల్ని ప్రభావితం చేసేలా మారిన ఇక్కడి హుజూరాబాద్‌ ఎన్నికపై ఇప్పటికే అందరి దృష్టి పడింది.

  • గోదావరి జలకళ

ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది జలకళను సంతరించుకుంది. భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పుష్కరఘాట్​ను తాకుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి (Godavari and Pranahita rivers flowing as excerpts).

  • తెలంగాణ సరళం చేసింది

లైసెన్సులు, క్లియరెన్సులు, సర్టిఫికెట్ల జారీని తెలంగాణ ప్రభుత్వం వేగవంతంచేసి వ్యాపారాల ప్రారంభం, నిర్వహణను సులభతరంగా మార్చినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలశాఖ పేర్కొంది(Reduced burden of regulations in Telangana). కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ (Union Minister Piyush Goyal) మంగళవారం ఇక్కడ విడుదల చేసిన ‘ఏ ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఆన్‌ రిడక్షన్‌ ఆఫ్‌ కంప్లయన్స్‌ బర్డన్‌’ (A Progress Report on Reduction of Compliance Burden) నివేదిక ఈ అంశాన్ని పేర్కొంది.

  • స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు

  • లైఫ్​లో హైదరాబాద్​ చూడగలవా?

తన వ్యక్తిగత, సినీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఆటుపోట్ల గురించి సీనియర్ నటుడు మోహన్​బాబు చెప్పారు. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరై అలీ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అవేంటో మీరు చదివేయండి.

09:01 September 29

టాప్​న్యూస్​@9AM

  • ఆస్పత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం..

నిజామాబాద్​లో దారుణం జరిగింది. ఆస్పత్రిలోనే యువతిపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు మృగాళ్లు. యువతికి మద్యం తాపించి బలవంతం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

  • 24 మంది ఖైదీలు మృతి!

ఖైదీల మధ్య వివాదం హింసాత్మకంగా(prison riots) మారింది. బాంబులు, తుపాకులతో ఇరు వర్గాలు దాడి చేసుకోవటం వల్ల 24 మంది మరణించారు. ఈ ఘటన ఈక్వెడార్​లోని గుయాక్విల్​ ప్రాంతీయ జైలులో(ecuador prison riots 2021) జరిగింది.

  • మాటల యుద్ధం.. అసలేం జరుగుతోంది..!

ఏపీలో రాజకీయ వేడి బలంగా వీస్తోంది. జనసేన - వైకాపా (YCP vs JanaSena) మధ్య విమర్శలు.. ప్రతివిమర్శల దాడి పతాక స్థాయికి చేరుకుంది. ట్వీట్లు... రీట్వీట్లు.. వ్యాఖ్యలు.. కౌంటర్లతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఓ పక్షం నుంచి కౌంటర్ పడిందో లేదో... సెకన్లలోనే మరోపక్షం నుంచి వందల సంఖ్యలో తిరుగు సమాధానాలు వచ్చేస్తున్నాయి. ఏ మాత్రం వెనక్కి తగ్గేదిలేదంటూ ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నెలకొంది. ఒక్కమాటలో చెప్పాలంటే గులాబ్​ తుపాన్ తీవ్రత కంటే.. సామాజిక మాధ్యమాల్లో ఇరు పక్షాలు పోస్టులు వరద ప్రవాహన్ని తలపిస్తున్నాయి. ఆన్​లైన్​ సినిమా టిక్కెట్ల వివాదం చినికి చినికి గాలి వానగా మారి.. మరో ఎపిసోడ్ దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తాజా వివాదంలోకి సామాజిక, వ్యక్తిగత అంశాలను కూడా చొప్పిస్తూ.. వాతావరణాన్ని ఆయా పార్టీల నేతలు వేడెక్కించారు. రోడ్ల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ 'శ్రమదానం' కార్యక్రమానికి సిద్ధమయ్యారు పవన్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు రాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేపట్టడం అనివార్యమైంది. ఫలితంగా తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో పవన్ పర్యటనపై అందరీ దృష్టి కేంద్రీకృతమైంది.

  • సొరంగం నిర్మాణంలో సవాళ్లెన్నో!

కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ కశ్మీరులో నిర్మాణాలు చేపడుతున్నారు నిపుణులు. ఈ జోజిలా సొరంగం(Zozila Tunnel) నిర్మాణంలో ​తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇంజినీరింగ్‌ నిపుణులే కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఇరవై అడుగులు నడిస్తే చాలు శ్వాస భారంగా అనిపించే హిమగిరుల్లో కొనసాగుతున్న పనుల తీరుపై ఓ ప్రత్యేక కథనం..

  • 300 వికెట్ల క్లబ్​లో పొలార్డ్​

ముంబయి ఇండియన్స్​ ఆల్​రౌండర్​ కీరన్​ పొలార్డ్​.. టీ20 ఫార్మాట్​లో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 300 వికెట్లు తీసిన (Pollard Ipl Wickets)ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

07:51 September 29

టాప్​న్యూస్​@8AM

  • మీ గుండె ఆరోగ్యంగానే ఉందా?

గుండె ఉండేది పిడికెడే. అయితేనేం.. నిలువెత్తు మనిషిని నడిపిస్తుంది. మనం తల్లి కడుపులో ఉన్నప్పట్నుంచే క్షణం ఆగకుండా నిరంతరం రక్తాన్ని పంప్‌ చేస్తూనే ఉంటుంది. అవయవాల నుంచి వచ్చే ‘చెడు’ రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి చేరవేసి, అక్కడ ఆక్సిజన్‌ను నింపుకొని వచ్చిన ‘మంచి’ రక్తాన్ని అవయవాలకు పంపిస్తూ ప్రాణాలను నిలబెడుతుంది. అలుపెరగకుండా మనకోసం ఇంతలా పరిశ్రమించే గుండె కోసం మనమేం చేస్తున్నాం? తేలికగా, సమర్థంగా పనిచేసేలా చూసుకుంటున్నామా? మరింత ఎక్కువకాలం మన్నేలా కాపాడుకుంటున్నామా? లేదనే చెప్పుకోవాలి. రోజురోజుకీ పెరిగిపోతున్న గుండె జబ్బులే దీనికి నిదర్శనం. అందుకే గుండెతో ఆత్మీయ బంధం ఏర్పరచుకోండని నినదిస్తోంది ‘వరల్డ్‌ హార్ట్‌ డే’ (World Heart Day 2021 ). గుండెజబ్బులపై అవగాహన పెంచుకొని, నివారణ మీద దృష్టి పెట్టమని అన్యాపదేశంగా సూచిస్తోంది.

  • 'గులాబ్' విషాదం...

కుంభవృష్టి కర్షకులకు కన్నీళ్లను మిగిల్చింది. మూడు రోజులుగా భారీ వర్షాలకు లక్షల ఎకరాల్లో పంటలు (Huge Loss to Farmers) నీటమునిగాయి. ఇరవై రోజుల క్రితమూ అతి భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. గత జూన్‌లో ప్రారంభమైన వానాకాలం సీజన్‌ రేపటి (సెప్టెంబరు 30)తో ముగుస్తోంది. జూన్‌ చివర్లో, జులై, ఆగస్టు, సెప్టెంబరు.. ఇలా ప్రతి నెలా కనీసం వారం, పది రోజులు భారీ వర్షాలు రాష్ట్రంలో ఏదోక ప్రాంతంలో పంటలను (Huge Loss to Farmers)నష్టపరిచాయి.

  • 22 లక్షల మందికి రైతు బీమా వర్తించదట..

తెలంగాణ ప్రభుత్వం (telangana government) అందిస్తున్న రైతు బీమా (Rythu Bheema) రైతులకు అందని ద్రాక్షగా మారింది. 57.79 లక్షల మంది అన్నదాతల్లో 61 శాతం అర్హులుగా పేర్కొంది. 59 ఏళ్లలోపు వారికే పథకం అమలు కానుందని తెలిపింది. కాగా 22 లక్షల మందికి రైతు బీమా వర్తించదని వెల్లడించింది.

  • ఐదేళ్లలో 30 తుపానులు

తుపానుల కల్లోలానికి దేశంలో పలు రాష్ట్రాలు విలవిల్లాడిపోతున్నాయి. కుంభవృష్టి కారణంగా వరదల భయంతో మహానగరాలు వణికిపోతున్నాయి. ముందస్తు హెచ్చరికలతో ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగినా.. మరోవైపు లక్షల ఎకరాల్లో పంట నష్టం, ఆస్తి నష్టం తీవ్రంగా కలచివేస్తుంది. ఈ నేపథ్యంలో బాధితులకు ఉపశమనం కలిగించేలా తక్షణ సాయం అందించడం ఎంత కీలకమో.. ప్రకృతి విపత్తులను మరింత మెరుగ్గా ఎదుర్కొనేలా దీర్ఘకాలిక వ్యూహాలపైనా ప్రభుత్వాలు శ్రద్ధపెట్టడం అంతే అవసరమని నిపుణులు భావిస్తున్నారు.

  • బాలనటి నుంచి స్టార్​ హీరోయిన్​గా..

తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంలో 200కు పైగా చిత్రాల్లో నటించారు సీనియర్​ నటి ఖుష్బూ. నేడు(సెప్టెంబరు 29) ఆమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం..

06:48 September 29

టాప్​న్యూస్​@7AM

  • డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు కోసం కృషి

'కొవాగ్జిన్‌'కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అత్యవసర గుర్తింపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు భారత్​ బయోటెక్​ పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు ఎప్పుడు వస్తుందనే విషయంలో ఊహాగానాలు, అంచనాలు సరికాదని వ్యాఖ్యానించింది.

  • తెలుగు అకాడమీలో గోల్‌మాల్‌..

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నగదు గోల్‌మాల్‌ అయ్యింది(Telugu Academy Funds scam) . యూబీఐ బ్యాంక్‌లో తాము డిపాజిట్‌ చేసిన రూ.43కోట్లు బ్యాంకులో లేవని అకాడమీ ప్రతినిధులు హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు అకాడమీలోని వ్యక్తులే వాటిని విత్‌డ్రా చేసుకున్నారంటూ యూబీఐ ఉన్నతాధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు అకాడమీ తమ వద్ద ఉంచిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మొత్తం రూ.54.41కోట్లుగా బ్యాంక్‌ అధికారులు పోలీసులకు తెలిపారు. రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసుకున్న బ్యాంక్‌ అధికారులు, తెలుగు అకాడమీ ప్రతినిధులను విచారించిన అనంతరం దర్యాప్తు మొదలు పెట్టనున్నారు.

  • గుండె వ్యాధుల తీవ్రత అధికంగా భారత్​లోనే!

గుండెపోటు కేసుల సంఖ్య పురుషుల్లో ఎక్కువగా ఉండగా, మహిళల్లో మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల ప్రజలతో పోలిస్తే, భారతీయుల్లో తక్కువ వయసులోనే గుండె వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో గుండె కవాటాల సమస్యలే అధికం. పాశ్చాత్యులకు 60లలో ఇలాంటి సమస్యలు వస్తే, భారతీయులకు 50లలోనే వస్తున్నాయని 'ఇండియన్‌ హార్ట్‌ అసోసియేషన్‌' స్పష్టం చేస్తోంది.

  • 'ఆమె' ప్రాతినిధ్యం అరకొరే!

పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు, స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలని అన్ని రాజకీయ పార్టీలూ సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాయి. వాస్తవానికి వచ్చేసరికి ఆర్భాటం జాస్తి ఆచరణ నాస్తిగా పరిస్థితి ఉంటోంది. భారత్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో మహిళలు కేవలం తొమ్మిది శాతమే అయినా, లోక్‌సభకు ఎన్నికైన వారిలో 14శాతం మంది స్త్రీలు ఉన్నారు.

  • మనం బాగా ఆడితే..

పాకిస్థాన్​ క్రికెట్​ (Pakistan Cricket) జట్టుకు అభిమానలంతా అండగా నిలవాలని ఆ దేశ ఆటగాడు వసీమ్​ అక్రమ్​ అన్నాడు. ఇంగ్లాడ్​, న్యూజిలాండ్​లతో పర్యటనలు రద్దు కావడంతో తానూ అందరిలానే నిరాశ చెందినట్లు తెలిపారు.

05:28 September 29

టాప్​న్యూస్​@6AM

  • రైతుల పాలిట శాపంగా

గులాబ్‌ తుపాన్‌ (Gulab Cyclone) ప్రభావంతో కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 31 వేల చెరువులు అలుగు పోస్తున్నాయి. పలు చోట్ల రహదారులు ధ్వంసం కాగా... ప్రకృతి ప్రకోపం రైతుల పాలిట శాపంగా మారింది. 

  • ఈసారి 289 వర్ణాల్లో

వచ్చే నెలలో జరగనున్న బతుకమ్మ పండుగ (Bathukamma Festival)ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) పేద మహిళలకు ఉచితంగా ఇచ్చే చీరలు మంగళవారానికి అన్ని జిల్లాలకు చేరాయి. వచ్చే నెల రెండో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

  • పారిశ్రామికవేత్తల ఆసక్తి

హైదరాబాద్​ ప్రగతిభవన్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR)ను శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ వెంకటేశ్వరన్ (Sri Lanka Deputy High Commissioner Venkateshwaran) కలిశారు. తెలంగాణలో ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని కితాబిచ్చారు.

  • హై అలర్ట్​

గులాబ్​ తుపాను ప్రభావంతో తెలంగాణలో జోరువానలు కురుస్తున్నాయి. హైదరాబాద్​లో సోమవారం నాటి వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భాగ్యనగరంలో జంట జలాశయాలైన హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​ గేట్లను ఎత్తి దిగువకు నీటికి విడుదల చేస్తున్నారు. 

  • బాణసంచా పేల్చడం బంద్​!

ఇప్పటికే వాయుకాలుష్యంతో అల్లాడుతున్న దిల్లీలో.. రానున్న పండుగ వేడుకల్లో ప్రజలు బాణసంచా కాలిస్తే మరింత కాలుష్యం పెరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బాణసంచా పేల్చడం సహా అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ(Delhi Pollution Control Committee) తెలిపింది.

  • రూ.10 వేల లోన్​ కోసం పిటిషన్

'ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకం' ద్వారా కొందరు వ్యక్తులకు రూ. 10 వేలు లోన్ ఇప్పించాలంటూ దిల్లీ హైకోర్టులో(Delhi High Court News) పిటిషన్ దాఖలు చేశారు ఓ న్యాయవాది. దీనిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. పిటిషన్​ను తోసిపుచ్చింది. ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించమని ఆదేశిస్తూ రూ. 25వేలు జరిమానా విధించింది.

  • అంతర్జాతీయ విమానాలపై నిషేధం

కొవిడ్ కారణంగా విదేశాలకు వెళ్లే ప్రయాణికుల విమాన సర్వీసులపై(Flight Ban India) నిషేధాన్ని మరోమారు పొడిగించింది కేంద్రం. అక్టోబర్ 31 వరకు ఈ నిషేధం కొనసాగనున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA Flight News) స్పష్టం చేసింది.

  • చిన్నపిల్లలపై

చిన్నపిల్లలపై సీరం(Serum Institute of India) వ్యాక్సిన్​ ప్రయోగ పరీక్షలు జరిపేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు సెంటర్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిపుణుల కమిటీ సభ్యుడు దీనిపై స్పష్టత ఇచ్చారు.

  • ప్లే ఆఫ్స్ రేసులో!

ఐపీఎల్​ 2021లో భాగంగా పంజాబ్ కింగ్స్​తో జరుగుతోన్న మ్యాచ్​లో విజయం సాధించింది ముంబయి ఇండియన్స్. ఫలితంగా ప్లే ఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.

  • నమ్మకాన్ని ఇచ్చింది

సినీ పరిశ్రమపై(akkineni nagarjuna love story) తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. చిత్రసీమను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడూ చల్లగానే చూశాయని అన్నారు హీరో నాగార్జున(love story success meet). ప్రభుత్వాల మద్దతు అలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. 

Last Updated : Sep 29, 2021, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.