ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @9PM
టాప్​ టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Jun 25, 2021, 8:51 PM IST

ఎన్జీటీ హెచ్చరిక

తమ ఆదేశాలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడితే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జాతీయ హరిత ట్రైబ్యూనల్(National Green Tribunal) ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు జరుగుతున్నట్లు తేలితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కేసీఆర్​కు కేంద్ర మంత్రి ఫోన్​

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకంపై వాగ్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్​తో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​ ఫోన్​లో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి కృష్ణా బోర్డు బృందాన్ని పంపుతామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకం పనులను కొనసాగిస్తుందా లేదా అన్న విషయమై నిజనిర్ధారణ చేయిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విచారణకు సీఎం ఆదేశం

ఎస్సీ మహిళ మరియమ్మ (Mariyamma) లాకప్​డెత్​కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధరణ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr)... డీజీపీ మహేందర్ రెడ్డి (Dgp Mahender Reddy)ని ఆదేశించారు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని సీఎం స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఒక్కరైనా కుటుంబమే..

మల్లన్నసాగర్ నిర్వాసితుల్లో ఒంటరిగా ఉన్నవారికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిల్లలతో కాకుండా ఒంటరిగా ఉన్నవారిని కుటుంబంగా పరిగణించాలని సూచించింది. వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ వాసుల పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వ్యర్థంతో అర్థం

చెత్త నుంచి సంపాదన సృష్టించేలా కృషి జరుగుతోందని మంత్రి కేటీఆర్​ అన్నారు. చెత్తను పునర్వినియోగించేలా ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ నాగోల్‌ సమీపంలో నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ రీసైక్లింగ్​ ప్లాంట్​ ఏర్పాటుతో.. దిల్లీ, అహ్మదాబాద్‌, సూరత్‌, విశాఖపట్నం నగరాలతో పాటు సీ అండ్‌ డీ ప్లాంట్‌ను కలిగిన ఐదో నగరంగా హైదరాబాద్ నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

డెల్టా ప్లస్​ను టీకాలు అడ్డుకోలేవా..

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో డెల్డాప్లస్ వేరియంట్​​ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్​లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలతో ఈ వేరియంట్ కట్టడికి వీలవుతుందా? అనే కోణంలో​ భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​), నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ(ఎన్​ఐవీ) పరిశోధన ప్రారంభించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కేంద్రమంత్రికే ఝలక్​

మైక్రోబ్లాగింగ్ ప్లాట్​ఫార్మ్​ ట్విట్టర్.. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్​కు ఝలక్ ఇచ్చింది. గంట సమయం పాటు మంత్రి అకౌంట్​ను బ్లాక్​ చేసింది. అమెరికా డిజిటల్ మిలీనియమ్ కాపీరైట్​ యాక్ట్ ఉల్లంఘించారన్న కారణంతో ఖాతాను నిలిపివేసినట్లు పేర్కొంది. ట్విట్టర్ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రవిశంకర్ ప్రసాద్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

లాభాల జోరు

ఒడుదొడుకుల సెషన్​ను లాభాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. వారాంతపు సెషన్​లో సెన్సెక్స్ (Sensex Today) 226 పాయింట్లు లాభపడి.. 52,900 ఎగువకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 70 పాయింట్ల లాభంతో.. 15,850 పైన స్థిరపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్​ షురూ

ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​​ రెండో ఎడిషన్​ (2021-23)లో భాగంగా టీమ్ఇండియా షెడ్యూల్​ ఖరారైంది. మొత్తం ఐదు టెస్ట్​ సిరీస్​లు ఆడనుంది కోహ్లీసేన. ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్​తో ప్రారంభం కానున్న టెస్ట్​ సిరీస్​తో ఈ సీజన్​ మొదలవుతుంది. బంగ్లా పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్​ల సిరీస్​తో ఈ సీజన్​ ముగుస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రముఖ నటి పాయల్​ అరెస్ట్​

అహ్మదాబాద్​ పోలీసులు శుక్రవారం ప్రముఖ నటిని అరెస్టు చేశారు. ఆమె నివాసం ఉంటున్న హౌసింగ్​ సొసైటీ నివాసితులను దూషించిన కారణంగా వివాదాస్పద నటి పాయల్​ రోహత్గీని(Payal Rohatagi) అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.