ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

ETV BHARAT LATEST TOP NEWS
ETV BHARAT LATEST TOP NEWS
author img

By

Published : Nov 21, 2021, 6:16 AM IST

Updated : Nov 21, 2021, 10:01 PM IST

21:53 November 21

టాప్​న్యూస్ @ 10PM

  • కైకాలహెల్త్​బులిటెన్‌ విడుదల

అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై(actor satyanarayana health condition) హెల్త్​ బులిటెన్​ను విడుదల చేశారు వైద్యులు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వివవరించారు.

  • పోలీసింగ్​లో  మోదీ కీలక సూచనలు

పోలీస్​ వ్యవస్థలో భవిష్యత్​ తరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు సంబంధించిన సాంకేతికను అందిపుచ్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ (modi news) పిలుపునిచ్చారు. ఇందుకుగానూ కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో హైపవర్​ పోలీస్​ టెక్నాలజీ మిషన్​ను ఏర్పాటు చేయాలని సూచించారు.

  •  చాక్లెట్ కవర్లలో డ్రగ్స్ తరలింపు

చూయింగమ్​, చాక్లెట్ కవర్లలో అక్రమంగా (Drugs in chewing gum) తరలిస్తున్న మత్తు పదార్థాలను ఎన్సీబీ (నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. వేర్వేరు చోట్ల జరిపిన దాడుల్లో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

  •  'ప్రభుత్వ చిత్తశుద్ధితోనే అవార్డులు'

రాష్ట్ర పురపాలికలకు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్​ 2021 అవార్డులు.. ప్రభుత్వ కృషితోనే సాధ్యమైందని మంత్రి కేటీఆర్​(KTR on Swachh sarvekshan awards) అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రంలోని పట్టణాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం పట్ల పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవం అనంతరం కేటీఆర్​.. వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

  •  ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!

రాష్ట్రంలో స్థానిక సంస్థల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల(Local body mlc elections telangana 2021) పేర్లు దాదాపు ఖరారయ్యాయి. 12 మంది అభ్యర్థుల పేర్లను అధికార పార్టీ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. కాగా రేపు, ఎల్లుండి తెరాస అభ్యర్థులు(TRS mlc candidates) నామినేషన్లు వేయనున్నారు.  

20:49 November 21

టాప్​న్యూస్ @ 9PM

  • హస్తిన చేరుకున్న కేసీఆర్ బృందం.. 

  ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌, (cm kcr delhi tour)  మంత్రులు, అధికారులు దిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ,(cm kcr meet pm modi) జలవనరులశాఖ మంత్రితో  సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు

  • వివాహ వేడుకలో ఇద్దరు సీఎంలు

శాసనసభ స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహ వేడుకకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్​, కేసీఆర్​ హాజరయ్యారు. శంషాబాద్​లో జరిగిన వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చొన్న కేసీఆర్, జగన్​ కాసేపు ముచ్చటించుకున్నారు.  

  • జలదిగ్బంధంలో తిరుపతి...

లు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తాగునీరు, తిండిలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జలదిగ్బంధంలోని కాలనీలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. వరద ప్రభావంతో రైళ్లును రద్దు చేయగా.. మరి కొన్నింటిని దారి మళ్లించారు. ఆర్టీసీ బస్సులను సైతం దారి మళ్లించి.. తిరుమల, తిరుపతికి సర్వీసులు నడుపుతున్నారు.

  •  కివీస్ లక్ష్యం 185

న్యూజిలాండ్​తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్​లో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది భారత్. దీంతో కివీస్​ ముందు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 

19:48 November 21

టాప్​న్యూస్ @ 8PM

  • రామగుండంలో విషాదం

 పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. రాజధాని రైలుకు ఎదురుగా నిలబడి  ఒడిశాకు చెందిన ఓ కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు.

  • పోలీస్​ స్టేషన్‌లో భారీ పేలుడు.. !

పోలీస్​ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

  • 'భీమ్లా నాయక్​​' రిలీజ్ అప్పుడే..!

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'భీమ్లానాయక్'​, 'గమనం', 'థ్యాంక్ గాడ్', 'మరక్కార్' సహా పలు చిత్రాల వివరాలు ఉన్నాయి.

18:51 November 21

టాప్​న్యూస్ @ 7PM

  • 'ఆ చట్టాలు మళ్లీ తెస్తారా?'

వివాదాస్పద సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు (Farm Laws repeal) కేంద్రం ప్రకటించింది. అయినా రైతుల సంఘాల నేతలు, విపక్ష నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్​ సాక్షిగా ఈ చట్టాలను రద్దు చేసి, మరికొన్ని డిమాండ్లకు ఒప్పుకుంటేనే ఆందోళన విరమిస్తామని రైతు సంఘాలు చెబుతున్నారు.

  • 'ఆ ఘటన దురదృష్టకరం'

మీడియా సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు కంటతడి పెట్టడంపై ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ​(SonuSood Phone call to Chandrababu) ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు సోనూ ఫోన్​ చేసి పరామర్శించారు.

  • మువ్వన్నెల జెండా  రెపరెపలు

లద్దాఖ్​లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది(ladakh indian flag). హాన్లే లోయలో.. 15వేల అడుగుల ఎత్తులో భారత సైన్యం, ఫ్లాగ్​ ఫౌండేషన్​ ఆఫ్​ ఇండియా.. ఈ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశాయి. 

  •  'రాధేశ్యామ్​' కథ లీక్​!

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్​, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, తొలి పాట సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి(prabhas radhey shyam song). ఈ క్రమంలోనే సినిమా స్టోరీ ఇదేనంటూ ఓ కథ ప్రచారంలో ఉంది. ఇంతకీ స్టోరీ ఏంటంటే?​

  • భారత్ బ్యాటింగ్​

కోల్​కతా వేదిక నేడు (ఆదివారం) న్యూజిలాండ్​తో ఆఖరి టీ20 మ్యాచ్​ జరగనుంది. అందులో భాగంగా తొలుత టాస్ గెలిచిన భారత్​.. బ్యాటింగ్​ ఎంచుకుంది.

17:50 November 21

టాప్​న్యూస్ @ 6PM

  • 15వేల అడుగుల ఎత్తులో   రెపరెపలు

  •  బిడ్డలతో సహా బావిలో దూకి..!

బిహార్​ పట్నా జిల్లాలోని బిక్రమ్​లో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

  •  'ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావొద్దు'

వరద ప్రాంతాల ఎమ్మెల్యేలు.. సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ (CM JAGAN on AP Floods) సూచించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా.. రానక్కర్లేదన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అండగా ఉండాలని చెప్పారు.

  • స్మార్ట్​ఫోన్​తోనే సినిమా షూటింగ్..​!

ఓ సినిమాను తెరకెక్కించేందుకు భారీ సాంకేతికతలను వినియోగిస్తున్న ఈ కాలంలో.. కేవలం ఓ స్మార్ట్​ ఫోన్​తో తీసిన ఓ చిత్రం ప్రజల ముందుకు రానుంది. స్మార్ట్​ ఫోన్​తో సినిమా తీయడం ఎలా సాధ్యం? ఇంతకీ ఆ సినిమా పేరేంటి? ఎప్పుడు విడుదల అవుతుంది?

  •  '​ అతను అర్థమవ్వాలంటే కాస్త వేచిచూడాలి'

టీమ్​ఇండియా టీ20 సారథి రోహిత్‌ శర్మ (Rohit Sharma News) ఆలోచనా విధానం పూర్తి వేరుగా ఉందని అన్నాడు సీనియర్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, రోహిత్ ప్రణాళికలు అర్థం కావాలంటే కాస్తా వేచి చూడాలని చెప్పాడు (Robin Uthappa News).

16:56 November 21

టాప్​న్యూస్ @ 5PM

  •  దిల్లీకి సీఎం కేసీఆర్, మంత్రులు

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చించేందుకు సీఎం కేసీఆర్‌(cm kcr delhi tour) దిల్లీ బయలుదేరి వెళ్లారు.  కేసీఆర్​తో పాటు మంత్రులు కూడా హస్తిన వెళ్లారు.

  •  'కేసీఆర్‌ దీక్ష వారి కోసమేనా?'

రైస్‌ మిల్లర్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధర్నా చేశారని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay Fires on KCR) విమర్శించారు. కేసీఆర్‌ దీక్ష(KCR dharna) చేయడానికి, ప్రధాని మోదీ సాగుచట్టాలు రద్దు చేయడానికి ఏమైనా సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

  • ఈ సమావేశాల్లోనే ఆ చట్టాల రద్దు'!

నూతన సాగు చట్టాల రద్దు(farm laws repeal ) బిల్లులకు ఈనెల 24న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో ప్రారంభంకానున్న శీతాకాల సమావేశాల్లోనే(winter session of parliament) ఈ బిల్లులను పార్లమెంట్​ ముందుకు తీసుకురానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

  • ​ కేబినెట్​లో కీలక మార్పులు!

రాజస్థాన్​లో 15 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు(rajasthan cabinet reshuffle). గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రా వీరి చేత ప్రమాణం చేయించారు. దీంతో సీఎం గహ్లోత్​ కేబినెట్​లో మంత్రుల సంఖ్య 30కి చేరింది.

  • నల్లగా ఉందని భార్యకు విడాకులు..!

వివాహం చేసుకున్న తొమ్మిది నెలలకే భార్యకు విడాకులు(divorce case) ఇచ్చాడు ఓ భర్త. నల్లగా ఉందనే కారణంతో తలాక్​(triple talaq case) చెప్పి ఇంటి నుంచి గెంటేశాడు. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​ బరేలీ జిల్లాలో జరిగింది.

15:41 November 21

టాప్​న్యూస్ @ 4PM

  •  ఇకపై రాత్రి వేళల్లోనూ..

పోస్టుమార్టంపై వైద్యశాఖ కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాత్రి వేళల్లోనూ పోస్టుమార్టం చేయాలని వైద్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

  •  సంప్రదాయ హంగులతో యాదాద్రి 

శ్రీ లక్ష్మీ నారసింహుడు స్వయంభుగా వెలసిన యాదాద్రి పుణ్యక్షేత్రం పునఃనిర్మాణం(Yadadri temple reconstruction) తుది మెరుగులు దిద్దుకుంటోంది. సీఎం కేసీఆర్​ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, ధృడ సంకల్పంతో చేపట్టిన నారసింహుని సన్నిధి.. స్వర్ణకాంతులతో విరాజిల్లుతోంది. ఆలయ రాజగోపురాలు పసిడి వర్ణాన్ని నింపుకొని భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను మరింత పెంచుతోంది.

  • అడవుల్లో దూసుకెళ్లే 'ఈ-బైక్​'..!

అటవీ శాఖ సిబ్బంది కోసం సరికొత్త ఎలక్ట్రిక్​ బైక్​ను రూపొందించారు(e bike for forest officials) కర్ణాటకలోని ఎన్​ఐటీ విద్యార్థులు. నిత్యం అడవుల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు ఈ బైక్​ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

  • ఆమెతో రిలేషన్​షిప్​.. అతను​ ఏం చెప్పాడంటే?

బిగ్​బాస్​ హౌస్​లో(bigg boss show telugu nagarjuna) ఇంటిసభ్యులందరూ సరదా ఆటల్లో మునిగిపోయి ఎంజాయ్​ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ రిలేషన్​షిప్​ గురించి మాట్లాడారు మానస్​, ప్రియాంక. కాగా, ఇలా ఎంతో సరదాగా సాగుతున్న బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి నేడు ఎవరు ఎలిమినేట్‌(bigg boss elimination telugu this week) కానున్నారో తెలియాలంటే కొన్ని గంటల్లో ప్రసారం కానున్న ఎపిసోడ్ చూడాల్సిందే.అప్పటివరకు ప్రోమోను చూసేయండి..

  • ఐసీసీ శాశ్వత సీఈఓగా అతనే..!​

ఎనిమిది నెలలకు పైగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాత్కాలిక సీఈఓ పదవిలో కొనసాగుతున్న జెఫ్​ అలార్​డైస్​​కు కీలక బాధ్యతలు అప్పగించింది ఐసీసీ. ఆయన్ను ఐసీసీ శాశ్వత సీఈఓగా(Icc new ceo) నియమించినట్లు తెలిపింది.

14:33 November 21

టాప్​న్యూస్ @ 3PM

  •  వివాహ వేడుకలో తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • ఆ నిందితునిపై మరో ఫిర్యాదు

సినీ నటి షాలూ చౌరసియాపై దాడికిశ్(Attack on Shalu Chourasiya) పాల్పడిన నిందితుడు కొమ్ముబాబుపై... ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద ఈ నెల 2వ తేదీన తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు

  • 'యథావిధిగా రైతు నిరసనలు'

సాగు చట్టాల రద్దు(Farm laws repeal), భవిష్యత్తు కార్యాచరణపై సింఘు సరిహద్దులో సమావేశమయ్యారు సంయుక్త కిసాన్​ మోర్చా నేతలు. సుదీర్ఘంగా చర్చించి.. గతంలో నిర్ణయించిన కార్యక్రమాలు, ఆందోళనలు యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. పెండింగ్​లో ఉన్న అంశాలపై మోదీకి లేఖ రాయనున్నట్లు చెప్పారు.

  •  'అఖండ' , 'పుష్ప' అప్‌డేట్స్‌

సినీ అప్డేట్స్(cinema news) వచ్చేశాయి. ఇందులో అఖండ, పుష్ప, అర్హ పుట్టినరోజు, జయమ్మ పంచాయితీ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

  • క్రికెట్ అభిమానుల గొడవ.. ఎందుకంటే..!

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈడెన్ గార్డెన్స్​లో(Eden gardens match) మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్​ జరగనుంది. ఆదివారం ఇండియా, న్యూజిలాండ్​ మూడో టీ20(India vs new zealand t20) ఈ మైదానం వేదికగా నిర్వహించనున్నారు.

13:37 November 21

టాప్​న్యూస్ @ 2PM

  • కేసీఆర్​ను నమ్మాలా?

గతంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని సీఎం కేసీఆర్‌... పంజాబ్‌లో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తామంటే ఎలా నమ్మాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy latest tweet) ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని విమర్శించారు.

  • గురుకులంలో కరోనా కలకలం

      గురుకుల పాఠశాలలో కరోనా(Corona Cases in gurukul school) కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లా వైరా గురుకుల బాలికల పాఠశాలలో 13 మంది విద్యార్థినులకు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఎనిమిదో తరగతికి చెందిన 13 మంది బాలికలకు వైరస్ సోకిందని వైద్య సిబ్బంది తెలిపారు. మిగిలిన విద్యార్థులకు కరోనా పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు.

  • భారత నౌకా దళంలోకి 'ఐఎన్​ఎస్​ విశాఖపట్నం'

దేశీయంగా తయారు చేసిన యుద్ధ నౌక ఐఎన్​ఎస్​ విశాఖపట్నంను(ins visakhapatnam) జాతికి అంకితం చేశారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్. ఈ నౌకను విశాఖపట్నంలో మోహరించనున్నారు. ఇండోపసిఫిక్​ మార్గంలో భారత నౌకాదళ పాత్ర కీలకమైందని కొనియాడారు రాజ్​నాథ్​.

  • 'ఫేస్​మాస్క్'​తో హైటెక్​ కాపీ!

హైటెక్ కాపీయింగ్​కు పాల్పడేందుకు సిద్ధమైన ఓ అభ్యర్థి గుట్టురట్టు చేశారు మహారాష్ట్ర పోలీసులు(maharashtra police). పోలీస్ రిక్రూట్​మెంట్ పరీక్షా కేంద్రం వద్ద నిర్వహించిన తనిఖీల్లో.. ఓ వ్యక్తి మాస్క్​లో సిమ్​కార్డ్​, మైక్, బ్యాటరీతో హాజరైనట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.

  • పెంగ్‌ షువాయికి ఏమైంది?

చైనా టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయ్​ ఆచూకీ తెలియని నేపథ్యంలో.. "పెంగ్ ఎక్కడ?"(Where is peng shuai) అంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. పెంగ్​ క్షేమంగానే ఉన్నారనే ఫొటోలు, వీడియోలు తెరపైకి వచ్చినప్పటికీ.. ఆమె భద్రతపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె కనిపించడం లేదా?.. కనిపించకుండా చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

12:33 November 21

టాప్​న్యూస్ @ 1PM

  • సాగు చట్టాలను మళ్లీ తీసుకురావొచ్చు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు(Farm laws repealed) ప్రధాని మోదీ(PM Modi news) ప్రకటన చేసిన రెండో రోజే కీలక వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్​ గవర్నర్(rajasthan governor)​ కల్​రాజ్​ మిశ్రా. అవసరమైతే వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావొచ్చని పేర్కొన్నారు. మరోవైపు.. సాగు చట్టాల రద్దు ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది.

  • కొనుగోళ్లలో జాప్యం

అసలే అకాల వర్షాలు.. ఆపై కొనుగోలు కేంద్రాల్లో (Farmers Problems in Telangana) ఇబ్బందులు.. రైతన్నలను మరింత అవస్థకు గురిచేస్తున్నాయి. ఫలితంగా వేల రూపాయల అదనపు భారం రైతులపై పడుతోంది.

  • ఆమెను అనడానికి మీకు నోరెలా వచ్చింది?

నారావారిపల్లెలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద సినీనటుడు నారా రోహిత్(Nara Rohit on chandrababu incident) నిరసన తెలిపారు.

  • ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు

బంగారం (Gold Price today), వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • సందడిగా హీరో కార్తికేయ వివాహం

తెలుగు యువ కథానాయకుడు కార్తికేయ(karthikeya marriage).. పెళ్లి చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్​లో ఈ వేడుక జరిగింది. మెగాస్టార్ చిరంజీవి.. కొత్త దంపతులను ఆశీర్వదించారు.

12:06 November 21

టాప్​న్యూస్ @ 12PM

  • కుమార్తెతో సహా వరద కాల్వలో దూకిన తల్లి 

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలో ఆత్మనగర్​లో విషాదం చోటుచేసుకుంది. ఆత్మనగర్​లో కాల్వలో దూకి తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన వనజ.. తన కుమార్తె శాన్విని తీసుకుని శనివారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. అర్ధరాత్రి వరకు తిరిగి రాకపోవటంతో.... కుటుంబసభ్యులు చుట్టపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించలేదు. 

  • తనను కాదన్న వ్యక్తిపై యాసిడ్ దాడి

ఫేస్​బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆ మహిళకు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారన్న నిజం తెలుసుకున్న వ్యక్తి ఆమెకు దూరంగా జరగాలనుకున్నాడు. కానీ.. ఆ మహిళ అందుకు ఒప్పుకోలేదు. అతని వద్ద డబ్బులు డిమాండ్ చేసింది. యాసిడ్​ దాడి(kerala acid attack) చేసి.. అతని కంటిచూపు పోగొట్టింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముఖం నిండా గాయలపాలైన తను ఊచలు లెక్కించేందుకు సిద్ధంగా ఉంది.

  • మేం బతికేదెలా?

దాదాపు 60 కుటుంబాలు ఉన్న గ్రామం అది. కానీ, అభివృద్ధికి నోచుకోని ప్రజలు వారు. కాలువపై వంతెన లేకపోవడం కారణంగా.. అక్కడి విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. రోగులు, గర్భిణులు అత్యవసర పరిస్థితుల్లో సమయానికి ఆస్పత్రికి చేరుకోలేక ప్రాణాపాయంలో చిక్కుకుంటున్నారు. అధికారులు స్పందించి తమ కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.

  • కోహ్లీని అప్పుడు పూర్తిగా నమ్మలేదు

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్​, టీమ్ ఇండియా సారథిల స్నేహం(Ab de villiers kohli)​ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్​లో ఆర్​సీబీ తరఫున గత కొన్నేళ్లుగా ఆడుతున్న వీరిద్దరూ.. తమ ఆటతో అభిమానులను అలరిస్తూ వచ్చారు. అయితే.. కోహ్లీని డివిలియర్స్ తొలిసారి​ ఎప్పుడు కలిశాడు. కోహ్లీ గురించి అప్పుడు ఏబీ ఏం అనుకున్నాడంటే?

  • కైకాల హెల్త్ అప్డేట్

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తాజా హెల్త్ అప్డేట్(kaikala satyanarayana health) వచ్చేసింది. వెంటిలేటర్​పై ఉంచి ఆయనకు చికిత్స చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

10:57 November 21

టాప్ న్యూస్ @ 11AM

  • 532 రోజుల కనిష్ఠానికి కొవిడ్​ కేసులు

దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్యలో​(Coronavirus India) పెరుగుదల నమోదైంది. తాజాగా 10,488 మంది కరోనా (Coronavirus India) బారినపడ్డారు. వైరస్​ ధాటికి మరో 313 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి..

రాష్ట్రంలో ఇవాళ రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు(Road accident in telangana today) జరిగాయి. వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఇద్దరు మృతి చెందగా... ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

  • కిలో టీ పొడి రూ.పదికోట్లు

మన దగ్గర మంచి టీ పౌడర్‌ కిలో రూ. ఆరువందల నుంచి వెయ్యి వరకూ ఉంటుంది. మరి మీకు తెలుసా.. మన దేశంలోనే డార్జిలింగ్‌లో పండించే ఒక రకం టీ పొడి ధర కిలో రూ.1.3 లక్షలని. అయ్యబాబోయ్‌ అనిపిస్తోంది కదూ.. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఇలా ఖరీదైన టీ పొడులు(most expensive tea world) మరికొన్ని ఉన్నాయి. వీటిలో డా హాంగ్‌ పావొ అనే టీ పొడి అత్యధికంగా కిలో రూ.పదికోట్లు పలుకుతుంది.

  •  సిద్ధూపై గౌతమ్ గంభీర్ ఆగ్రహం

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ తన పెద్దన్నగా సంబోధించిన నేపథ్యంలో మాజీ ఓపెనర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌(Gautam gambhir on navjot singh sidhu) ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధూ తన పిల్లల్ని బోర్డర్‌కు పంపిన తర్వాత ఇమ్రాన్​ను అలా పిలవాలని మండిపడ్డారు.

  • ఎలుకలు పట్టేందుకు వెళ్లాను

'జై భీమ్' సినిమాతో మెప్పించిన నటి లిజో.. షూటింగ్​లో, దాని ప్రారంభానికి ముందు ఎదురైన ఆసక్తికర విషయాల్ని చెప్పింది. పాత్ర కోసం ఎలుకలు పట్టడం, వాటి మాంసం కూడా తిన్నానని తెలిపింది.

09:52 November 21

టాప్ న్యూస్ @ 10AM

  • చంద్రబాబుకు రజనీకాంత్ ఫోన్​కాల్

తమిళ సూపర్​స్టార్​ రజనీకాంత్​ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి ఫోన్​ చేసి పరామర్శించారు. శుక్రవారం (నవంబర్​ 19) ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. 

  • భారత్ @ 10,488 కేసులు

దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్యలో​(Coronavirus India) పెరుగుదల నమోదైంది . తాజాగా 10,488 మంది కరోనా (Coronavirus India) బారినపడ్డారు. వైరస్​ ధాటికి మరో 313 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • సింగర్‌పై నోట్ల వర్షం

గుజ‌రాతీ జాన‌ప‌ద గాయ‌ని రాధాదియాపై క‌నక‌వ‌ర్షం (Currency notes showered) కురిసింది. స్టేజ్‌పై ఆమె పాటు పాడుతుండ‌గా.. న‌గ‌దుతో వ‌చ్చిన అభిమానులు ఆమెపై కరెన్సీ నోట్లను కుమ్మరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

  • 'పంచనేత్ర'లో భారత్‌

అయిదు ఆంగ్లో- శాక్సన్‌ దేశాలైన అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో ఏర్పడిన పంచనేత్ర గూఢచర్య కూటమిలో భారత్‌ను కలుపుకొనేందుకు సభ్యదేశాలు ఆసక్తి చూపుతున్నాయి. వాటిలో అమెరికాతో సైనిక పొత్తు లేని దేశం భారత్‌ ఒక్కటే. అయినా గూఢచర్య సమాచారాన్ని భారత్‌తో పంచుకోవడానికి పంచనేత్ర సిద్ధపడటం ఆసక్తికర పరిణామం. భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రతిపాదన రావడం విశేషం.

  • ఈ పాటలోనే 'రాధేశ్యామ్' కథ

'రాధేశ్యామ్' సినిమాలోని 'ఈ రాతలే'.. తాను చేసిన ప్రయోగమని రచయిత కృష్ణకాంత్ అన్నారు. ఈ సాంగ్​లోనే సినిమా కథ ఉందని తెలిపారు.

08:51 November 21

టాప్ న్యూస్ @ 9AM

  • నేటి నుంచి ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌

నేటి నుంచి ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్(TSICET counselling 2021 news) జరగనుంది. రేపు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని.. రేపు, ఎల్లుండి వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇస్తున్నట్లు కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.

  • నీట్‌ రాష్ట్ర అభ్యర్థుల ర్యాంకుల విడుదల

నీట్​లో తెలంగాణ అభ్యర్థుల ర్యాంకుల(NEET Telangana ranks 2021)ను కాళోజీ హెల్త్​ యూనివర్సిటీ వెల్లడించింది. రాష్ట్రంలో తొలి 10 ర్యాంకుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు చెరి సగం ఉన్నారు.

  • యూపీపై భాజపా ప్రత్యేక కసరత్తు

ఉత్తర్​ప్రదేశ్​లో(UP election 2022) మరోసారి అధికార పీఠాన్ని చేజిక్కించుకునేందుకు కసరత్తు ముమ్మరం చేసింది భాజపా. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్​కు కీలక బాధ్యతలను అప్పగించింది.

  • ఆన్​లైన్​లో గంజాయి విక్రయం

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్​పై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదైంది. ఈ సంస్థ ద్వారా గంజాయి విక్రయంపై దర్యాప్తు చేస్తున్న భింద్ జిల్లా పోలీసులు అమెజాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై (Amazon India officials) నార్కోటిక్స్​ చట్టం కింద కేసు నమోదు చేశారు.

  • భారత్​లో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు

వీసా సమస్యలతో 2016 ప్రపంచకప్​ దూరమైన పాకిస్థాన్ జూనియర్ హాకీ జట్టు.. ఇప్పుడు వరల్డ్​కప్​ కోసం మన దేశానికి వచ్చింది.

07:26 November 21

టాప్ న్యూస్ @ 8AM

  • 202 రోజులు కరోనాతో పోరాటం

202 రోజులు కొవిడ్​తో (Gujarat Covid-19 patient) పోరాడి ఇంటికి చేరింది గుజరాత్​కు చెందిన ఓ మహిళ. మే1న కరోనాతో ఆస్పత్రిలో చేరగా.. పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి శుక్రవారం ఇంటికి చేరింది. దీంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

  • యూపీలో విగ్రహ రాజకీయాలు

ఎన్నికలు సమీపిస్తున్న ఉత్తర్​ప్రదేశ్​లో (UP election 2022) విగ్రహాల రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. మాయావతి ముఖ్యమంత్రిగా (mayawati cm tenure) ఉన్న సమయంలో కాన్షీరాం విగ్రహాలతో పాటు ఏనుగు బొమ్మలు, స్వయంగా తన నిలువెత్తు విగ్రహాలను ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. అయితే ఇప్పుడు అదే బాటలో ప్రధాన పార్టీలైన భాజపా, ఎస్​పీ పయనిస్తుండటం గమనార్హం.

  • ఎమ్మెల్సీ బరిలో దిగాలా? వద్దా?

స్థానిక సంస్థ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్​ (MLC elections Telangana congress 2021) ఎటూ తేల్చుకోలేకపోతోంది. బరిలో అభ్యర్థులను నిలపాలా..? అసలు పోటీకే దూరంగా ఉండాలా అని సమాలోచనలు చేస్తోంది.

  • నేడు తెతెదేపా మౌనదీక్ష

నేడు రాష్ట్రవ్యాప్తంగా మౌన ప్రదర్శనలు, దీక్షలు చేయాలని తెలంగాణ తెదేపా(Telangana TDP) నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ప్రకటించారు. చంద్రబాబు సతీమణిపై అసభ్యకరంగా మాట్లాడటం సరికాదని అన్నారు.

  • ఆన్​లైన్​లో పెంగ్ ఫొటోలు

గతకొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయిన చైనా టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆమె ఆచూకీపై ఆందోళన మరింత పెరిగింది.

06:53 November 21

టాప్ న్యూస్ @ 7AM

  • సఫాయి మిత్ర సురక్షలో రాష్ట్రానికి రెండో స్థానం

స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ర్యాంకుల్లో(swachh survekshan 2021 awards) రాష్ట్రం సత్తా చాటింది. ‘సఫాయి మిత్ర సురక్ష’లో తెలంగాణకు రెండో స్థానం.. నగరాల్లో కరీంనగర్‌కు 2వ ర్యాంకు దక్కింది. ఉత్తమ సుస్థిర పట్టణంగా సిద్దిపేట నిలిచింది. దక్షిణాది జోన్‌లో పరిశుభ్ర పురపాలికగా సిరిసిల్లకు గుర్తింపు వచ్చింది.

  •  వాళ్లకే అవకాశం

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై తెరాస(trs mlc candidates list in telangana 2021) కసరత్తు తుది దశకు చేరింది. అభ్యర్థులను ఇవాళ ఖరారు చేసే అవకాశముంది. ఎమ్మెల్యే కోటా అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన తెరాస.. స్థానిక సంస్థల కోటాలోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ అవకాశం కోసం గులాబీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

  • కొవిన్‌ పోర్టల్‌లో కొత్త సదుపాయం

కొవిన్​ పోర్టల్​లో కొత్తఫీచర్​ను తీసుకొచ్చింది కేంద్రం. ఇకపై వ్యక్తుల వ్యాక్సినేషన్‌ స్టేటస్​ను తెలుసుకునే సదుపాయాన్ని ఇతరులకూ కల్పించింది. వ్యక్తి ఫోన్‌ నంబర్‌, పేరు ఎంటర్‌ చేయడం ద్వారా వ్యక్తి మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారంగా వ్యాక్సిన్‌ స్థితిని తెలుసుకునే వీలును కల్పించినట్లు కేంద్రం పేర్కొంది.

  • టీమ్​ఇండియా.. సిరీస్​ చుట్టేస్తుందా?

ఇప్పటికే 2-0తో టీ20 సిరీస్​ను సొంతం చేసుకున్న టీమ్​ఇండియా.. మూడో మ్యాచ్​ గెలిచి ప్రత్యర్థిని వైట్​వాష్​ చేయాలని భావిస్తోంది. కోల్​కతా వేదికగా ఆదివారం ఈ మ్యాచ్​ జరగనుంది.

  • 'నలుగురితో చూస్తూ.. నవ్వుకునే చిత్రమిది'

'అనుభవించు రాజా' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు వెల్లడించారు నిర్మాత సుప్రియ యార్లగడ్డ. ఆ విషయాలు మీకోసం.
 
05:27 November 21

టాప్ న్యూస్ @ 6AM

  • నేడు హస్తినకు సీఎం కేసీఆర్​ 

వరి కొనుగోళ్లు(paddy procurement in telangana), రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై స్పష్టత కోసం సీఎం కేసీఆర్ దిల్లీ బాట(CM KCR Delhi Tour) పట్టారు. ఇవాళ ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులు, ఎంపీలు, అధికారుల బృందం దిల్లీకి వెళ్తోంది. కృష్ణా, గోదావరి జలాల వాటా(krishna godavari water dispute)పైనా స్పష్టత కోరతామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వానా కాలం పంటలో ప్రతీ గింజను కొంటామని... రైతులు ఆందోళన పడవద్దని కేసీఆర్‌ భరోసా కల్పించారు.

  • ఇవాళ తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

  • దేశ రాజకీయాలపై తెరాస ఫోకస్​..

జాతీయ రాజకీయాలపై తెరాస దృష్టి(trs party focus on national politics) సారిస్తోంది. వరి కొనుగోళ్లపై స్పష్టతనివ్వాలంటూ కేంద్రం, భాజపాపై దాడి చేస్తున్న కేసీఆర్(cm kcr demand on paddy procurement policy).... రైతు అంశాలతో రోజురోజుకీ దూకుడు పెంచుతున్నారు. సాగు చట్టాల ఉద్యమంలో మరణించిన అన్నదాతలకు... రాష్ట్రం తరఫున 3లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం(CM KCR on Three farm laws)... కేంద్రం 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర చట్టం కోసం పోరాడతామన్న గులాబీ దళపతి.. విద్యుత్ చట్టం రద్దుకు పోరాడతామన్నారు.

  • పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా...

కరోనా ప్రభావం(corona effect in telangana) తెలంగాణ జాతీయోత్పత్తి వృద్ధిరేటుపై(telangana gsdp 2020-21) తీవ్రంగా పడింది. తయారీరంగంతో పాటు మిగతా రంగాలను దెబ్బతీసింది. ఫలితంగా గత దశాబ్దంలోనే తొలిసారి జీఎస్​డీపీ వృద్ధిరేటు(telangana gsdp 2020-21) స్వలంగా నమోదైంది. తలసరి ఆదాయం(Per capita income of Telangana) వృద్ధిరేటు పరిస్థితి అదే తరహాలో ఉంది.రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా స్వల్పంగా పెరిగింది. పశుసంపద నుంచి వచ్చే ఆదాయం ఏకంగా 24 వేల కోట్ల రూపాయలకు చేరింది.

  • ఉసురు తీస్తోన్న ముసురు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కురుస్తున్న ముసురు రైతన్న ఉసురుతీస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వానల కారణంగా ఎక్కడికక్కడ మొలకెత్తుతోంది. మొలకెత్తని ధాన్యాన్నైనా వెంటనే అమ్మేద్దామంటే తేమ అధికంగా ఉన్న కారణంగా కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదు. వానలకు ఉన్న పంట దెబ్బతింటుందని అమ్మేయాలా.. ఎండలొస్తే ఆరబెట్టి మద్దతు ధరకే అమ్ముకోవాలా తేల్చుకోలేక అన్నదాత ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

  • రాజస్థాన్ మంత్రివర్గ ​పునర్​వ్యవస్థీకరణ

రాజస్థాన్ మంత్రివర్గ ​పునర్​వ్యవస్థీకరణలో(Rajasthan cabinet news) భాగంగా 15 మంది ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేసింది రాజస్థాన్ కాంగ్రెస్. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

  • పాక్​లో హిందూ బాలున్ని రేప్​ చేసి..

11 ఏళ్ల హిందూ బాలుడిపై అత్యాచారానికి పాల్పడారు కిరాతకులు. అంతేకాక చిన్నారుడ్ని కిరాతకంగా చంపారు. ఈ షాకింగ్ ఘటన పాకిస్థాన్​లోని​ సింధ్​ రాష్ట్రంలో జరిగింది.

  • రెండంకెల వృద్ధి సాధ్యమే...

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వృద్ధి పథంలో సాగుతోందని కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఏఎంసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీలేశ్‌ షా తెలిపారు. పెట్టుబడుల్లో సానుకూల ధోరణి పెరిగిందన్నారు. ఈ మేరకు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

  • 15వ ఐపీఎల్​ సీజన్​ భారత్​లోనే..

చెన్నైలో జరిగిన ఐపీఎల్ 2021(ipl 2021 news) టైటిల్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు బీసీసీఐ కార్యదర్శి జై షా(bcci secretary jay shah). ఈ సందర్భంగా ఐపీఎల్ 2022 వేదికపై క్లారిటీ ఇచ్చారు.

  • విషమంగానే కైకాల ఆరోగ్య పరిస్థితి

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్లు వైద్యులు తెలిపారు(kaikala satyanarayana health condition). ఆయన చికిత్సకు స్పందించట్లేదని అన్నారు.

Last Updated : Nov 21, 2021, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.