ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - etv headlines

ETV BHARAT LATEST TOP NEWS
ETV BHARAT LATEST TOP NEWS
author img

By

Published : Nov 17, 2021, 6:30 AM IST

Updated : Nov 17, 2021, 10:05 PM IST

21:57 November 17

టాప్​న్యూస్​@10PM

  • 'తెలంగాణ ధనం తీసుకునే కేంద్రం... ధాన్యం తీసుకోదా?'

తెలంగాణ ధనం తీసుకునే కేంద్ర ప్రభుత్వం... ధాన్యం తీసుకోదా అని మంత్రి కేటీఆర్​ ప్రశ్నించారు. భాజపా నేతల మాటలు విని రైతన్నలు మోసపోవద్దని.. ముఖ్యమంత్రి కేసీఆర్​ చేయబోయే ప్రకటన అనుసరించి నడుచుకోవాలని సూచించారు. రేపు హైదరాబాద్​ ఇందిరాపార్క్​ వద్ద ప్రభుత్వం తరఫున చేస్తున్న మహాధర్నాకు మద్దతు తెలపాలని రైతులను కోరారు.

  • 'వీలైనంత త్వరగా పూర్తి చేయాలి'

రాష్ట్రంలో వీలైనంత త్వరగా వందశాతం వ్యాక్సినేషన్ (covid vaccination)పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు (minister harish rao)ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో అన్ని జిల్లాల వైద్యాధికారులతో టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

  • 7,287 గ్రామాల్లో టెలికాం టవర్లు

మారుమూల ప్రాంతాల్లో 32 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర మంత్రివర్గం (Cabinet Decision today) ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 33,822 కోట్లు ఖర్చు చేయనుంది మోదీ సర్కార్. అంతేకాకుండా 7,287 గ్రామాలకు టెలికాం సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు పచ్చజెండా ఊపింది.

  • కేరళలో ఆగని కరోనా ఉద్ధృతి

కేరళలో కరోనా మహమ్మారి(kerala corona cases today) ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 6,849 కేసులు, 388 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు.. దేశంలో ఒక్కడోసు(Corona vaccination) తీసుకున్న వారి సంఖ్యను.. రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య తొలిసారి అధిగమించిందని తెలిపారు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్​ మాండవియా.

  • 'ఆయనెప్పుడూ జీవించే ఉంటారు'

పునీత్ రాజ్​కుమార్​ భార్య అశ్విని ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగపు లేఖను పోస్ట్‌ చేశారు. ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండని ఆమె.. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి తొలిపోస్టును పునీత్‌కు అంకితమిచ్చారు.

21:32 November 17

టాప్​న్యూస్​@9PM

  • 'ధరణి టెక్నికల్ మాడ్యూల్స్ రూపొందించాలి'

ధరణి పోర్టల్​లో అవసరమైన మాడ్యూల్స్​ రూపొందించాలని.. వాటిపై అందరికీ అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి హరీశ్​రావు ఆదేశించారు. కలెక్టరేట్లలో ధరణి హెల్ప్​ డెస్క్​లు ఏర్పాటుచేయాలని కోరారు.

  • 'రైతుల చేతుల్లో రాళ్లు, కోడిగుడ్లు ఉంటాయా..?'

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చమని అడిగినందుకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్​ వేటాడుతారా? వెంటాడుతారా? అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు (bandi sanjay comments on cm kcr). ధాన్యం కొంటారా? కొనరా అని అడిగితే అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.

  • ఐసిస్​​ ఉగ్రవాదిని దోషిగా తేల్చిన ఎన్​ఐఏ కోర్టు

ఐసిస్​లో చేరి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన కేరళకు (NIA ISIS Kerala) చెందిన నషీదుల్​ హమ్జాఫర్​ను దోషిగా తేల్చింది ఎన్​ఐఏ కోర్టు. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.

  • పాకిస్థాన్​కు టీమ్​ఇండియా..!

పాకిస్థాన్​లో జరగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీపై (2025 Champions Trophy news) భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. అప్పటి పరిస్థితుల ఆధారంగా అక్కడికి టీమ్​ఇండియా వెళ్లాలా? వద్దా? నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

  • పునీత్​ ఇంటికి విశాల్

కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. శ్రీవిష్ణు నటించిన 'అర్జున ఫల్గుణ' సినిమాలోని సాంగ్​ విడుదలై ఆకట్టుకుంటోంది. 'ఆర్​ఆర్​ఆర్'​లోని 'నాటు నాటు' పాటకు డ్యాన్స్​ ఎలా వేయాలో చేసి చూపించారు కొరియోగ్రాఫర్​ ప్రేమరక్షిత్​. కాగా, గుండెపోటుతో మరణించిన కన్నడ స్టార్​ పునీత్ రాజ్​కుమార్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు తమిళ హీరో విశాల్​.

19:55 November 17

టాప్​న్యూస్​@8PM

  • భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు(suicide attempt) యత్నించాడు. తన పిల్లలతో సహా వచ్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు అతన్ని కాపాడి పోలీసులకు సమాచారమిచ్చారు.

  • అండగా ఉంటాము

సిరిసిల్ల జిల్లా మానేరు మృతుల కుటుంబాలకు మంత్రి కేటీఆర్​ (KTR) రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విద్యార్థుల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్‌... వారి కుటుంబాలను కలిసి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

  • భర్త విడుదల కోసం నక్సల్స్​తో పోరాటం!

అలనాటి సతీసావిత్రి యముడితో పోరాడి తన భర్త ప్రాణాలను కాపాడుకుందని పురాణాల్లో చదువుకున్నాం. అయితే అడవుల బాట పట్టి మావోయిస్టుల చెరలో ఉన్న తన భర్తను రక్షించుకుంది ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh Bijapur news today) ఓ ఇంజినీర్‌ భార్య. 

  • 'ద్రవిడ్‌ను అందుకే నమ్ముతున్నా'

టీమ్​ఇండియా క్రికెటర్​ రోహిత్ శర్మ, కోచ్​ రాహుల్ ద్రవిడ్ మధ్య సమన్వయం (rahul dravid news) బాగుంటుందని భారత మాజీ క్రికెటర్‌ సునీల్ గావస్కర్ అన్నారు. వారిద్దరి స్వభావాలు ఒకే రకంగా ఉంటాయని చెప్పారు.

  • సినీ నటుడు మోహన్​బాబు ఇంట విషాదం

ప్రముఖ సీనియర్​ నటుడు మోహన్​బాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి(63) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నివాళులు అర్పిస్తున్నారు.

18:53 November 17

టాప్​న్యూస్​@7PM

  • ఇంజినీర్ విడుదల

ఛత్తీస్​గఢ్​లోని(chhattisgarh state) బీజాపూర్ జిల్లాలో ఇంజినీర్​ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఇవాళ ప్రజాకోర్టులో విడుదల చేశారు. దాదాపు ఏడు రోజుల తర్వాత ఆయనను వదిలిపెట్టారు. ఆ సమయంలో ఇంజినీర్ భార్య కూడా అక్కడే ఉన్నారు. ఇదివరకే ఇంజినీర్​తో పాటు కిడ్నాప్​ చేసిన అటెండర్​ను ఇప్పటికే విడిచిపెట్టిన మావోయిస్టులు తాజాగా ఇంజినీర్​ను ఆయన భార్యకు అప్పగించారు.

  • కొవిడ్​ సెంటర్లో నకిలీ రోగులు

కరోనా వచ్చింది ఒకరికి.. చికిత్స పొందుతున్న వారు మరొకరు. రూ. 10వేలు ఆశచూపి నకిలీ రోగులను పెట్టి అసలువారు చికిత్స పొందకుండా పరారయ్యారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • 'గిన్నిస్​ డే' స్పెషల్

అతిపెద్ద పిజ్జా, పొడవైన మీసం, భారీ గుమ్మడికాయ, పెద్ద ఆలుగడ్డ... అంతేనా.. స్కేటింగ్, డ్రాయింగ్, మ్యూజిక్, డాన్సింగ్... ఇలా ఏ విషయంలో రికార్డులు సాధించినా ముందుగా మనకు వినిపించే పదం గిన్నిస్. అలాంటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే (Guinness World Records day) సందర్భంగా.. పలువురు ఔత్సాహికులు, అథ్లెట్లు సరికొత్త ఫీట్లు చేశారు.

  • 9ఏళ్ల నాటి రోహిత్​ ట్వీట్​ వైరల్​

మరి కొద్ది గంటల్లో టీమ్​ఇండియా-న్యూజిలాండ్(nz vs ind t20 series 2021) ​ మధ్య టీ20 సిరీస్​​ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో 9ఏళ్ల క్రితం రోహిత్​ శర్మ చేసిన ఓ ట్వీట్​ వైరల్​గా మారింది. ఇంతకీ అదేంటంటే?

  • అభిమాని ప్రేమకు ప్రభాస్​ ఫిదా

తనపై వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్న ఓ ఫ్యాన్​కు అదిరిపోయే గిఫ్ట్​ ఇచ్చి ఆశ్చర్యపరిచారు స్టార్​ హీరో ప్రభాస్​. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి.

17:44 November 17

టాప్​న్యూస్​@6PM

  • 'ఎంత కొంటారో చెప్పండి'

ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ (cm kcr letter to pm modi) లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుపై ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని తన లేఖలో కేసీఆర్​ కోరారు. 2020-21 రబీలో మిగిలిన 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని విన్నవించారు.

  • సైబర్​ మోసాలకు ఇలా చిక్కుకుంటున్నారా?

మనం డౌన్‌లోడ్ చేసే యాప్‌లే మోసపోవటానికి కారణమవుతున్నాయా? సమాచారం కోసం వెతికే వెబ్‌సైట్లే...వలలో చిక్కేలా చేస్తున్నాయా? సైబర్ నేరాల (Cyber Crime) సరళి పరిశీలిస్తే...అవుననే అనిపిస్తోంది. డౌన్‌లోడ్‌ చేసుకునే సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌ల ద్వారా మన గుట్టు పట్టేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆర్‌బీఐ అంబుడ్స్‌మ్యాన్‌ కార్యాలయం డిజిటల్‌ మోసాల తీరుతెన్నులపై సమగ్ర నివేదికను రూపొందించింది. 

  • హైదర్​పొరా ఎన్​కౌంటర్​పై కశ్మీర్​లో రగడ

హైదర్​పొరాలో జరిగిన ఎన్​కౌంటర్​కు (Hyderpora encounter news) వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ.. జమ్ము కశ్మీర్​లోని రాంబన్ జిల్లా యంత్రాంగం స్థానికంగా ఆంక్షలు విధించింది. 144 సెక్షన్ అమలులోకి వచ్చినట్లు తెలిపింది. అటు, ఎన్​కౌంటర్​కు వ్యతిరేకంగా మృతుల కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సైతం ఆందోళనలో పాల్గొన్నారు.

  • కరోనా ఆంక్షలు ఎత్తివేత..!

కొవిడ్​-19 ఆంక్షలను(Covid restrictions) పూర్తిస్థాయిలో ఎత్తివేసి(remove all covid restrictions), అన్ని కార్యక్రమాలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది మధ్యప్రదేశ్​ ప్రభుత్వం. సినిమా హాళ్లు, హోటళ్లు, జిమ్ములు సహా ఇతర అన్ని కేంద్రాలు 100శాతం సామర్థ్యంలో పని చేయొచ్చని చెప్పింది. 

  • కరోనాతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత!

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్​ఎన్​ఆర్​ మనోహర్(54) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు(rnr manohar director). చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కరోనాతో పోరాడుతూ మరణించారని తెలిసింది.

16:52 November 17

టాప్​న్యూస్​@5PM

  • ఏర్పాట్ల పరిశీలన

రేపటి తెరాస మహాధర్నాకు శ్రేణుల సమాయత్తమవుతున్నాయి. ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న ధర్నా ఏర్పాట్లను మంత్రులు హరీశ్​రావు, తలసాని పరిశీలించారు (Maha Dharna arrangements). భద్రతా ఏర్పాట్లను సీపీ అంజనీకుమార్​ పరిశీలించారు.

  • వర్ష సూచన..

తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

  • జనసంద్రంగా ఓ యాచకుడి అంతిమ యాత్ర

కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ యాచకుడి అంతిమ యాత్ర సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఇందుకు కారణం.. అతడి కడసారి వీడ్కోలుకు వేల సంఖ్యలో ప్రజలు హాజరుకావడమే. ఎవరైనా ప్రముఖులు చనిపోతే వచ్చేంత మంది ఈ యాచకుడు మరణిస్తే చూసేందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఇంతకీ ఆ యాచకుడు ఎవరు? అంతమంది ఎందుకు వచ్చారు?

  • ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్​గా గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని(Sourav Ganguly News) ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్​గా అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమించింది(ICC News). అలానే అఫ్గానిస్థాన్​ క్రికెట్​ కమిటీ పనితీరుపై సమీక్షించేందుకు అఫ్గాన్​ వర్కింగ్​ బోర్డును ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

  • సూర్య ఇంటి వద్ద భారీ బందోబస్తు

తమిళ హీరో సూర్యకు భద్రత కల్పిస్తూ ఆయన ఇంటి వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు(jaibhim movie controversy). ఇటీవలే 'జైభీమ్'​ సినిమా విషయంలో ఆయనకు బెదరింపులు రావడమే ఇందుకు కారణం(surya latest news).

15:57 November 17

టాప్​న్యూస్​@4PM

ఇక లాంఛనమే..

శాసనసభ కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన ( mlc nominations)ప్రక్రియ పూర్తైంది. తెరాస అభ్యర్థులు గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్, రవీందర్ రావు పరిశీలనకు హాజరయ్యారు.

  • 'లఖింపుర్' కేసు దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీం చర్యలు

లఖింపుర్ ఖేరి రైతు నిరసనల్లో చెలరేగిన హింసపై దర్యాప్తును పర్యవేక్షించేందుకు పంజాబ్, హరియాణా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ జైన్‌ను నియమించింది సుప్రీంకోర్టు.

  • మార్కెట్లకు నష్టాలు

స్టాక్ మార్కెట్లు బుధవారం సెషన్​ను నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్​ (Sensex today) 314 పాయింట్లు కోల్పోయి 60,008 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 101 పాయింట్లు దిగజారింది.

  • కోహ్లీ మళ్లీ అదే స్థానంలో

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్​ బుధవారం(నవంబర్​ 17) టీ20 ర్యాంకింగ్స్​ను(ICC T20 Rankings 2021) ప్రకటించింది. ఇందులో టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli News) యథావిధిగా ఎనిమిదో స్థానంలో నిలవగా.. ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ ఒక స్థానం దిగజారి 6వ ర్యాంకులో ఉన్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ డేవిడ్​ వార్నర్​ తన ర్యాంకును మెరుగుపరచుకున్నాడు.

  • రికార్డు స్థాయిలో రిలీజ్​కు ప్లాన్​!

డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్'(prabhas radhe shyam movie release date) చిత్రబృందం​ మాస్టర్​ ప్లాన్ వేస్తోంది. ఏ దక్షిణాది సినిమాకు సాధ్యం కాని రికార్డును సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ అదెంటంటే?

14:37 November 17

టాప్​న్యూస్​@3PM

  • '2024లో దేశ ప్రధానిగా యోగి ఆదిత్యనాథ్!'​

2024 ఎన్నికల్లో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(yogi adityanath news)​ ప్రధానమంత్రి(prime minister of india) అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు హిందూ రక్షా సేన జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రబోధానంద గిరి (prabodhananda swami).

  • సర్కారీ దవాఖానాలో డాక్టర్ డెలివరీ..

ప్రభుత్వ వైద్యురాలుగా విధులు నిర్వహిస్తూ... సర్కారీ దవాఖానాలోనే బిడ్డకు జన్మనిచ్చారు(doctor delivery in govt hospital) ఓ డాక్టర్. ప్రభుత్వ వైద్యుల సలహాలు పాటిస్తే సుఖ ప్రసవం పొంది.. ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. సాదారణ మహిళల్లాగే వైద్యురాలు కూడా గవర్నమెంట్ ఆస్పత్రిలో చేరి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

  • 'నివారణ చర్యలు సరిగా లేవు..'

దిల్లీలో కాలుష్య నివారణ చర్యలు సరిగా లేవని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. కేంద్ర, రాష్ట్రాలు నిందలు వేసుకోవడం మానుకొని.. ఎయిర్​ క్వాలిటీ మేనేజ్​మెంట్​ జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

  • అంధుడి సాహసం

'ఐ యామ్​ బ్లైండ్​.. బట్​ వెల్​ ట్రైన్డ్​'.. ఇది ఓ సినిమాలో హిరో రవితేజ చెప్పే డైలాగ్​. ఈ మాటలను నిజ జీవితంలో చేసి చూపిస్తున్నాడు ఓ ముంబయి వాసి. పుట్టుకతోనే అంధుడైన అజయ్​.. 7500 కిలోమీటర్ల సైకిల్​ యాత్ర చేపట్టాడు. ముంబయి నుంచి శ్రీనగర్​, అక్కడి నుంచి కన్యాకుమారికి సైకిల్​ మీద వెళ్లనున్నాడు.

  • నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..

మహారాష్ట్ర, ఫుణెలోని పింపరీ చించవాడలో ఒళ్లు గగుర్పొడిచే రీతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్, ద్విచక్రవాహనదారుడి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది.

13:55 November 17

టాప్​న్యూస్​@2PM

  • షిర్డీలో ఆంక్షల సడలింపు

షిర్డీ సాయి బాబాను(shirdi temple news) దర్శించుకునేందుకు రోజుకు మరో 10వేల మందిని అనుమతించాలని నిర్ణయించింది ఆలయ ట్రస్టు, అహ్మద్​నగర్​ జిల్లా యంత్రాంగం. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో అదనంగా భక్తులను అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో రోజుకు 25వేల మంది సాయి దర్శనం(shirdi saibaba darshan) చేసుకునే వీలు కలుగనుంది.

  • హాస్టళ్లలో 'అమ్మ' ప్రేమ..

'మదర్​ ఆన్​ క్యాంపస్​' పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది త్రిపుర ప్రభుత్వం. ఇందులో భాగంగా.. హాస్టళ్లలో ఉండి స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల వద్ద వారి తల్లులు కొంత కాలం పాటు ఉంటారు. ఇలా చేస్తే, విద్యార్థుల చదువులు మెరుగుపడతాయని త్రిపుర విద్యాశాఖ మంత్రి రతన్​ లాల్​నాథ్​ అభిప్రాయపడ్డారు.

  • వారానికొక వీడియో విడుదల

రాష్ట్ర పర్యాటక ప్రదేశాలపై వారానికొక వీడియో విడుదల చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas goud news) వెల్లడించారు. భూదాన్ పోచంపల్లి గ్రామానికి ఐరాస పర్యాటక ప్రాంతం గుర్తింపు(Bhoodan pochampally un award) రావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు ప్రపంచ గుర్తింపు దక్కడంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవ ఉందని తెలిపారు.

  • క్రికెట్ కమిటీ ఛైర్మన్​గా గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్​గా అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమించింది. అలానే అఫ్గానిస్థాన్​ క్రికెట్​ కమిటీ పనితీరుపై సమీక్షించేందుకు అఫ్గాన్​ వర్కింగ్​ బోర్డును ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

  • హాస్యంతో 'అనుభవించు రాజా'

రాజ్​తరుణ్ 'అనుభవించు రాజా' ట్రైలర్​ వచ్చేసింది. కింగ్ నాగార్జున.. బుధవారం దీనిని రిలీజ్ చేశారు. ఆద్యంతం హాస్యభరితంగా ఉన్న ఈ ప్రచార చిత్రం.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

13:00 November 17

టాప్​న్యూస్​@1PM

  • రూ.3కోట్లు దోచేశారు

బ్యాంక్ అధికారులమంటూ ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్న దిల్లీలోని కాల్ సెంటర్​పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు చేశారు. దిల్లీలోని కాల్‌ సెంటర్‌పై దాడి చేసి 16 మందిని అరెస్టు చేశారు. అక్కడి పోలీసుల సాయంతో నిందితులును అదుపులోకి తీసుకున్నారు.

  • ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం.. 

మేడ్చల్ జిల్లా మల్లాపూర్ గ్రీన్‌హిల్స్ కాలనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వ్యక్తి సజీవదహనమయ్యారు. అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ప్రమాదవశాత్తు మంటలు చేలరేగాయి. 

  • కంగన వివాదాస్పద వ్యాఖ్యలు

వరుస వివాదాలకు తెరతీస్తున్న బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ (Kangana ranaut news​).. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ (Kangana ranaut gandhi) సహా మరికొంతమంది నేతాజీని అణచివేతదారులకు అప్పగించేందుకు అంగీకరించారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా గాంధీ ప్రవచించిన అహింస సూత్రాన్ని ఎద్దేవా చేశారు కంగన. అయితే ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

  • టీ20 సిరీస్​కు కివీస్​ స్టార్ పేసర్ దూరం

భారత్​తో టీ20 సిరీస్​ (IND vs NZ T20 series)నేపథ్యంలో న్యూజిలాండ్​ జట్టుకు మరో షాక్​ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కైల్ జేమీసన్ టీ20 సిరీస్​కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు.

  • విజయ్​ ఇంటికి బాంబు బెదిరింపు కాల్

అగ్రకథానాయకుడు దళపతి విజయ్ ఇంట్లో బాంబు పెట్టానని ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అది ఫేక్ కాల్ అని గుర్తించారు.
 
11:48 November 17

టాప్​న్యూస్​@12PM

  • మానేరు వంతెన కింద మరో మృతదేహం లభ్యం

మానేరు(manair) చెక్​డ్యామ్​లో గల్లంతైన మనోజ్ మృతదేహాన్ని(dead body found in water) ఇవాళ వెలికి తీశారు. సోమవారం నాడు మొత్తం ఆరుగురు విద్యార్థులు గల్లంతు కాగా... నిన్నటి వరకు ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. మనోజ్ మృతదేహం బ్రిడ్జి వరకు కొట్టుకురావడంతో సహాయక బృందాలు ఇవాళ వెలికి తీశాయి. ఈతకోసం వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

  • ఎక్కడెక్కడ ఏయే పార్టీలు గెలిచాయంటే?

ఆంధ్రప్రదేశ్​లో నగరపాలక, పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు(AP municipal elections 2021 ) కొనసాగుతోంది. మధ్యాహ్నానికి 1,206 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. వైకాపా, తెలుగుదేశం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కుప్పం.. ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠ రేపుతోంది. కుప్పం ఎంఎఫ్‌సీ వృత్తి విద్యా కళాశాలలో లెక్కింపు(Kuppam muncipal election results 2021) కొనసాగుతోంది.

  • హైదరాబాద్​ యువకుడు మిస్సింగ్​

హైదరాబాద్​ యువకుడు అహ్మదాబాద్​లో అదృశ్యమయ్యారు. ఆశారాం ఆశ్రమంలో ఓ శిబిరానికి హాజరైన ఆయన.. నవంబర్​ 11 నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. కుటుంబసభ్యులు కూడా అక్కడికి చేరుకొని గాలిస్తున్నారు.

  • 'ప్రజాస్వామ్యం అంటే 'విధానం' మాత్రమే కాదు

ప్రజాస్వామ్యం అనేది ఒక విధానం మాత్రమే కాదని.. అది భారతదేశ స్వభావమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సిమ్లాలో జరుగుతున్న అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 82వ కాన్ఫరెన్స్​ను ఆయన వర్చువల్​గా ప్రారంభించి.. ప్రసంగించారు.

  • సినతల్లికి రూ.15 లక్షల చెక్ అందజేసిన సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య.. రియల్ సినతల్లి పార్వతికి రూ.15 లక్షల చెక్కును అందజేశారు. ఈమె భర్త రాజకన్ను.. పోలీసు విచారణలో మృతి చెందారు. వీళ్ల కథతోనే తీసిన 'జై భీమ్' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.

10:50 November 17

టాప్​న్యూస్​@11AM

  • బంగారం, వెండి ధరలు ఇలా..

కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధరలు రూ.50వేల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో 10గ్రాములు బంగారం ధర రూ.50,660కి చేరింది.

  • కొనసాగుతున్న ‘పుర’ ఓట్ల లెక్కింపు

  • అప్పటివరకు స్కూళ్లు మూసివేత

వాయుకాలుష్యాన్ని(delhi air pollution news) నియంత్రించే చర్యల్లో భాగంగా కమిషన్​ ఫర్​ ఎయిర్​ క్వాలిటీ మేనేజ్​మెంట్​.. కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలిచ్చేంతవరకు ఎన్​సీఆర్​లోని స్కూళ్లు, కళాశాలలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది(ncr pollution news ).

  • ప్రేమించిన వాళ్లే పక్కనపెడితే ఎలా?

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) ఆస్ట్రేలియా జట్టు తరఫున హీరోగా నిలిచాడు ఓపెనర్​ డేవిడ్​ వార్నర్(David Warner News). ఈ నేపథ్యంలో సన్​రైజర్స్​ జట్టులో నుంచి అతడిని తప్పించడంపై స్పందించాడు.

  • డిసెంబరులో 'సినిమా'ల ధమాకా

సంక్రాంతి కంటే ముందు టాలీవుడ్​లో పండగ వాతావరణం! వచ్చే నెలలో 'అఖండ', 'పుష్ప' లాంటి భారీ సినిమాలతో పాటు 'గని', 'శ్యామ్ సింగరాయ్' లాంటి మీడియం బడ్జెట్​ చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మరి ఎవరు ఫస్ట్​క్లాస్​ మార్కులు తెచ్చుకుంటారో?

09:56 November 17

టాప్​న్యూస్​@10AM

  • 527రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు

దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. తాజాగా 10,197 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. కరోనా (Coronavirus India)​ ధాటికి మరో 301 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసులు 527రోజుల కనిష్ఠానికి పడిపోయాయి.

  • పరిచయస్తులే దాడి చేశారా?

హైదరాబాద్​ నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద రెండు రోజుల కిందట నటి షాలూ చౌరాసియాపై దాడి (Attack on Actress) ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. 

  • 'క్లాస్​రూమ్​కు దీటుగా  ఆన్​లైన్​ పాఠాలు

లాక్​డౌన్​ నేపథ్యంలో విద్యార్థులకు క్లాస్​రూమ్​ తరహా పాఠాలను ఆన్​లైన్​లో అందించేందుకు ఇన్ఫినిటీ లెర్న్​ అనే అంకుర సంస్థను ప్రారంభించినట్టు తెలిపారు శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్​ సుష్మ బొప్పన. ఇంటర్‌, నీట్‌, జేఈఈ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న శ్రీచైతన్య విద్యాసంస్థల అండదండలతో పాఠాలు, స్టడీ మెటీరియల్‌, నమూనా పరీక్షలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

  • క్రికెట్ బోర్డుకు రూ. 1500 కోట్లు ఆదా!

ఐసీసీ తీసుకున్న నిర్ణయంతో బీసీసీఐకి(BCCI news) భారీ ఉపశమనం లభించనుంది. 2024-31 మధ్య భారత్​ వేదికగా నిర్వహించే టోర్నీల్లో భాగంగా పన్ను భారాన్ని భరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి సిద్ధమైంది.

  • ఐరాసలో మారని పాక్​ తీరు

దాయాది పాకిస్థాన్​ అదే వక్రబుద్ధి చూపిస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ) వేదికగా (India UNSC Pakistan) మరోసారి కశ్మీర్​ అంశాన్ని లేవనెత్తింది. దీనిని తీవ్రంగా తప్పుబట్టిన భారత్ (India slams pakistan)​.. కశ్మీర్​లో ఆక్రమించుకున్న ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని పాక్​ను(India slams Pakistan at UNSC) హెచ్చరించింది.

08:47 November 17

టాప్​న్యూస్​@9AM

  • శవపరీక్షలో జాప్యం

రాజధానిలో ఎవరైనా చనిపోతే అదే రోజు శవ పరీక్ష(పోస్టుమార్టం) జరగక తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో మృతుల బంధవులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొన్ని సార్లు మూడు రోజులకు గానీ ఈ పరీక్ష జరగడం లేదు. ఇలాంటి సందర్భాల్లో దూర జిల్లాల వారు మృతదేహాన్ని సొంత జిల్లాకు తీసుకువెళ్లి అంత్యక్రియలు చేయడానికి నాలుగు రోజులు పడుతోంది. ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకే పరీక్షలు నిలిపివేయడమే దీనికి కారణం.

  • కొరకరాని కొయ్యగా జిన్​పింగ్!

చైనాలో ఎదురులేని ఏకైక నేతగా ఉన్న షీ జిన్‌పింగ్‌- వరసగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టడం, జీవితకాల అధినాయకుడిగా అవతరించడం తథ్యమనే కథనాలు వెలుగుచూస్తున్నాయి. స్వదేశంలో తన పీఠాన్ని సుస్థిరం చేసుకోవడం ద్వారా శక్తిమంతమైన నాయకుడిగా అవతరించిన ఆయన- రాబోయే రోజుల్లో ఇండియాకూ కొరకరాని కొయ్యగా పరిణమించవచ్చు. 'సమస్యలు సృష్టించడం మాకు ఇష్టం లేని పని' అంటూనే అందుకు భిన్నంగా ప్రవర్తించడం జిన్‌పింగ్‌ నాయకత్వ శైలి! దేశ ప్రయోజనాలే పరమావధిగా, మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ ఇండియా చురుగ్గా వ్యవహరించాల్సిన సమయం ఇది.

  • అంతరిక్షం నుంచి నట్టింటి దాకా

ఈ రోజుల్లో కెమెరాలేని మొబైల్‌ ఫోన్‌ను ఊహించుకోవటమే కష్టం. కానీ.. ఆ కెమెరా ఆవిష్కరణ జరిగిన తీరు ఎంతో ఆసక్తికరం. అలాగే.. టెలివిజన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. మరి అది మొదట ప్రసారం అయిన విధానం ఎంతో ప్రత్యేకం. మానవుడు అంతరిక్షయానం చేపట్టే క్రమంలో ఈ ఆవిష్కరణలు పురుడుపోసుకన్నాయని మనలో ఎంతమందికి తెలుసు?.. మన దైనందిన జీవితంలో భాగమైన కొన్ని వస్తువులు.. అవి రూపాంతరం చెందిన క్రమాన్ని మీరూ చదివేయండి మరి..

  • స్థితిగతులపై సమగ్ర అధ్యయనం

రాష్ట్రంలో బీసీల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని బీసీ కమిషన్‌ను... ప్రభుత్వం ఆదేశించింది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ బీసీ కమిషన్‌ విధివిధానాలపై మంగళవారం ఉత్తర్వులు (జీవో నెం.9) జారీ చేసింది. రాష్ట్రంలోని వెనకబడిన తరగతుల వారి వృత్తులు, సాధకబాధకాలను వెల్లడిస్తూ వాటి పరిష్కారానికి సూచనలు ఇవ్వాలని ఆదేశించింది. 

  • కులాలవారీగా జనగణన..

జనగణనలో కుల ప్రాతిపదికన వివరాలు సేకరించాలంటూ అన్ని రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది. ఏపీ, తెలంగాణ, బిహార్‌, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఝార్ఖండ్‌ ప్రభుత్వాలు ఈ మేరకు అసెంబ్లీల్లో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ అగ్ర నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు కులగణనకు అనుకూలంగా ప్రకటనలు చేశారు. అయితే దీనిని అమలు చేసేందుకు కేంద్ర సర్కారు సుముఖత చూపకపోవడం గమనార్హం.

07:56 November 17

టాప్​న్యూస్​@8AM

  • ఇదే ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రస్థానం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థుల (TRS MLC Candidates )ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు ఖరారు చేశారు. చివరి నిమిషంలో బండా ప్రకాశ్‌, వెంకట్రామిరెడ్డి అవకాశం దక్కించుకున్నారు. ఆరుగురు నామినేషన్లు దాఖలు చేయగా.. ఈ ఆరు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. నేడు ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

  • ఝాన్సీ బాలుడేమయ్యాడు..?

రాణీ ఝాన్సీలక్ష్మీబాయి అనగానే.. వీపున చిన్నపిల్లాడితో.. గుర్రంపై దూసుకెళ్తూ కత్తి ఎత్తిన బొమ్మే అందరికీ గుర్తుకొస్తుంది. 1857 తొలి స్వాతంత్య్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరమరణం తర్వాత మరి వీపునున్న ఆ పిల్లాడేమయ్యాడు? ఝాన్సీ వారసుడిని బ్రిటిష్‌ ప్రభుత్వం ఏం చేసింది?

  • హెచ్‌ఐవీ నుంచి విముక్తి!

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సాంక్రమిక వ్యాధి అయిన ఎయిడ్స్​ను జయించడం దాదాపు అసాధ్యమేననే భావన ఉంది. కానీ.. సరైన చికిత్సతో ఈ వ్యాధిని తరిమేయొచ్చని అంటున్నారు పరిశోధకులు. తాజాగా ఈ మహమ్మారి నుంచి బయటపడిన రెండో వ్యక్తిని గుర్తించారు అమెరికా శాస్త్రవేత్తలు.

  • ఆ ఆరోపణలు సరికాదు'

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వన్8 రెస్టారెంట్​ అవుట్​లెట్లపై(one 8 commune restaurant) లింగవివక్ష ఆరోపణలు వచ్చాయి. పుణెలోని వన్‌8 కమ్యూన్‌ రెస్టారెంట్ అవుట్‌లోకి స్త్రీ-పురుష, సాధారణ మహిళలను మాత్రమే అనుమతిస్తున్నారని 'యస్‌వుయ్‌ఎగ్జిస్ట్‌ ఇండియా' గ్రూప్‌ సభ్యులు విమర్శించారు.

  • అవార్డుల సంగతి మరిచిపోయాయి

"రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాలూ సినిమా కళాకారులకు అందించే అవార్డుల సంగతిని మరిచిపోయాయి. ఇకపై రెండు రాష్ట్రాలూ ఆలోచించి సినీ అవార్డుల్ని ప్రకటించి వేడుకల్ని నిర్వహించాలి" అని కోరారు అగ్రకథానాయకుడు చిరంజీవి.

06:54 November 17

టాప్​న్యూస్​@7AM

  • ఆరూ తెరాసకే!!

రాష్ట్ర శాసనమండలిలో ఆరు ఎమ్మెల్యే కోటా స్థానాలు ఏకగ్రీవం (Unanimous) కానున్నాయి. ఆరు స్థానాలకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు (TRS Candidates For MLC) ఆరుగురే నామినేషన్లు దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో వారు ఏకగ్రీవంగా (Unanimous) ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

  • ప్రజాప్రయోజనం నెరవేరుతుందా?

కరోనా కేసులు తగ్గుముఖం పట్టి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న తరుణంలో ఎంపీలాడ్స్​ పథకాన్ని కేంద్రం పునరుద్ధరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంతో పాటు, 2025-26 వరకు దీన్ని కొనసాగించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది.

  • క్రిప్టోతో తీవ్ర సమస్యలే

క్రిప్టో కరెన్సీలు దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వర్చువల్‌ కరెన్సీల వల్ల 'చాలా తీవ్ర సమస్యలు' ఎదురవుతాయన్నారు.

  • టీ20 సిరీస్.. గెట్ రెడీ

టీమ్​ఇండియా.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో (ind vs nz 1st t20) పోరుకు సిద్ధమైంది. ఈ టీ20 సిరీస్‌తోనే కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌ శర్మ జోడీ శకం ప్రారంభమవుతుంది. ఐపీఎల్‌లో రాణించిన యువ ఆటగాళ్లతో రోహిత్‌ సేన తొలి టీ20లో న్యూజిలాండ్‌ను బుధవారం తలపడనుంది. ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 ప్రపంచకప్‌నకు ఏడాది మాత్రమే గడువు ఉన్నందున జట్టు కూర్పు దిశగా అడుగులు వేయాలని భారత్ భావిస్తోంది.

  • ఈటీవీలో 'రంగులరాట్నం

టీవీ ప్రేక్షకుల్ని అలరించేందుకు ఈటీవీ సరికొత్త సీరియల్​తో ముందుకొస్తోంది. 'రంగులరాట్నం' పేరుతో దీనిని టీవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రతిరోజూ రాత్రి 7:30 గంటలకు ఇది ప్రసారం కానుంది.

05:15 November 17

టాప్​న్యూస్​@6AM

  • కేంద్రపై పోరుకు సన్నద్ధం..

యాసంగి వరి కొనుగోళ్లపై కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని రేపు.. తెలంగాణ రాష్ట్ర సమితి మహాధర్నా చేయాలని నిర్ణయించింది. ఇందిరాపార్కు వద్ద ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్న ధర్నాలో మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్ పర్సన్లు ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. అనంతరం రాజ్​భవన్​లో గవర్నర్​కు వినతిపత్రం సమర్పించాలని గులాబీ పార్టీ నిర్ణయించింది.

  • కేబినెట్​లో కీలక మార్పులు..

రాష్ట్ర మంత్రివర్గం(telangana cabinet)లో త్వరలో మార్పులకు అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఇద్దరు లేదా ముగ్గురికి(telangana cabinet members) చోటు దక్కవచ్చని తెలుస్తోంది. ఈటల స్థానంలో బండా ప్రకాశ్‌(banda prakash mlc)ను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరు ముగ్గురిని తప్పించి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి(venkatram reddy ias)తో పాటు ఇతరులకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్నప్రచారం సాగుతోంది. మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, చీఫ్ విప్, రాజ్యసభ సీటుతో ముడిపడి పదవుల పంపిణీ జరిగే అవకాశం కనిపిస్తోంది.

  • వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్​ ఫిర్యాదు..

మాజీ ఐఎఎస్‌ వెంకట్రామిరెడ్డి(venkatram reddy ias)పై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఆయన సర్వీసులో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని... వాటిపై ఫిర్యాదులు పెండింగ్‌ ఉండగా వెంకట్రామిరెడ్డి రాజీనామా(venkatram reddy resignation)ను ఏవిధంగా ఆమోదిస్తారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే వెంకట్రామిరెడ్డి రాజీనామా(venkatram reddy resignation)ను తిరస్కరించి, ఆయనపై వస్తున్నఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

  • టైగర్​ స్టే ప్యాకేజీ మీకోసమే..

అడవి ఎలా ఉంటుంది..? అరణ్యంలో పులులు, జింకలు, ఇతర జీవాలు ఎలా తిరుగుతాయి..? అక్కడి వృక్షజాతులేంటి? అడవులే ఆవాసాలుగా జీవించే ఆదిమవాసి తెగల జీవన విధానం ఎలా ఉంటుంది? వీటన్నింటి తెలుసుకోవాలంటే నేరుగా అడవులకు వెళ్లాల్సిందే. కానీ అటవీశాఖ(telangana forest department) నిబంధనలు అందుకు అనుమతించవు. అలాకాకుండా ఒకరోజు అడవుల్లో తిరుగుతూ రిజర్వ్ ఫారెస్టు(telangana reserve forest)లో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది తెలంగాణ అటవీశాఖ. 

  • సన్న బియ్యం సేకరణకు అనుమతి...

రాష్ట్రంలో సన్న బియ్యం సేకరణకు సర్కారు అనుమతి ఇచ్చింది. ఈమేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 80,000 మెట్రిక్ టన్నుల బియ్యం వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చింది.

  • సీబీఐ అధికారులపై గ్రామస్థుల దాడి..

అంతర్జాలంలో చైల్డ్​ పోర్న్​కు సంబంధించి ఓ నిందితుడి ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులపై గ్రామస్థులు దాడికి దిగారు. ఈ ఘటన ఒడిశాలోని దేనకనాల్ జిల్లాలో జరిగింది.

  • ఇంచు కూడా మాకొద్దు..

తమది శాంతికాముక దేశమని, ఇతర దేశాలకు చెందిన అంగుళం భూభాగాన్నీ చైనా ఆక్రమించుకోలేదని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్​పింగ్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో వర్చువల్​గా భేటీ అయిన (Biden XI meeting) జిన్​పింగ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.

  • క్రిప్టోతో తీవ్ర సమస్యలు..

  • రోహిత్​, ద్రవిడ్​కు తొలి పరీక్ష..

  • చిరు, పవనే స్ఫూర్తి..

యువ నటుడు హర్షా నర్రా కథానాయకుడుగా (Missing movie 2021) శ్రీని జ్యోసుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్సింగ్. ఈ సినిమా నవంబర్​ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈటీవీతో హర్షా తన అనుభవాలను పంచుకున్నాడు.

Last Updated : Nov 17, 2021, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.