ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

top news
top news
author img

By

Published : Nov 15, 2021, 6:02 AM IST

Updated : Nov 15, 2021, 10:18 PM IST

22:15 November 15

టాప్​న్యూస్​@ 10PM

  • రేపు  కీలక భేటీ

రేపు తెరాస శాసనసభ పక్షం సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు సాయంత్రం 4 గంటలకు శాసనసభ పక్షం భేటీ కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిపై సమావేశంలో చర్చించనున్నారు.

  •  రణరంగమైన బండి టూర్​

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై తెరాస-భాజపా మధ్య రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అగ్రనేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన ఈ అంశం.... ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలను రాజేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన బండి సంజయ్‌ పర్యటన... తెరాస-భాజపా శ్రేణుల పోటాపోటీ ఆందోళనలతో దద్దరిల్లింది. మిర్యాలగూడలో జరిగిన పర్యటన యుద్ధాన్ని తలపించింది.

  • 'అమెజాన్​ ద్వారా గంజాయి స్మగ్లింగ్​'

విశాఖపట్నం నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు అమెజాన్ ద్వారా 1000కిలోల గంజాయి అక్రమ రవాణా జరిగిందని మధ్యప్రదేశ్ భిండ్ జిల్లా ఎస్పీ వెల్లడించారు(ganja smuggling news). గుజరాత్​కు చెందిన ఓ కంపెనీ వస్త్ర పరిశ్రమ ముసుగులో ఈ దందా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తునట్లు చెప్పారు(ganja smuggling in india).

  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ బుద్గాంలోని హైదర్​పొరాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

  • 'రాధేశ్యామ్' ఫస్ట్​ సాంగ్ వచ్చేసింది..

'రాధేశ్యామ్' తొలి పాట(radhe shyam song) ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. ఈ సినిమా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

20:42 November 15

టాప్​న్యూస్​@ 9PM

  • ఏ క్షణమైనా అభ్యర్థుల జాబితా

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఏ క్షణమైనా తెరాస అధిష్ఠానం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అభ్యర్థులు ఎంపికపై తుది కసరత్తులు చేసినట్లు తెలుస్తోంది.

  • శబరిమలకు వెళ్తే  అవీ తప్పనిసరి..!

శబరిమల ఆలయం సోమవారం తెరుచుకుంది. మంగళవారం ఉదయం నుంచి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్ టీకా రెండు డోసులు వేసుకున్నవారు, ఆర్​టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు కలిగిన వారికి మాత్రమే ఆలయ ప్రవేశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

19:41 November 15

టాప్​న్యూస్​@ 8PM

  • ఉద్రిక్తతల నడుమ ముగిసిన పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ చెదురుముదురు ఘటనల మినహా.... ప్రశాంతంగా ముగిసింది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా.. 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మొత్తం 325 వార్డుల్లో పోలింగ్‌ జరిగింది. కుప్పం మున్సిపల్‌ పోరు తీవ్ర ఉద్రిక్తతలతో ముగింది. 

  • తెరుచుకున్న శబరిమల-  అవీ తప్పనిసరి..!

  • రియల్ సినతల్లికి సూర్య సాయం.. ఎంత ఇచ్చారంటే.!

సూర్య.. నిజజీవితంలోనూ హీరో అని నిరూపించుకున్నారు. రియల్ సినతల్లి పార్వతి అమ్మాళ్​కు ఆర్థిక సాయం చేశారు. ఈమె కథతోనే 'జై భీమ్' సినిమా తీశారు. ఇటీవల ఓటీటీలో ఆ చిత్రం విడుదలైంది.

  • దాయాదుల సిరీస్​పై గంగూలీ ఏమన్నాడంటే?

భారత్​-పాక్​.. మధ్య జరిగేది మ్యాచ్ మాత్రమే​ కాదు. ఓ ఎమోషన్. ఇరు దేశాల అభిమానులు ఎంతో ఉద్వేగభరితంగా తిలకిస్తారు. గెలిస్తే.. పండగే. ఓడిందా.. టీవీలు పగలాల్సిందే! అలాంటిది.. దాదాపు దశాబ్ద కాలంగా ఐసీసీ టోర్నీల్లో మినహా ద్వైపాక్షిక సిరీసుల్లో (Ind vs Pak Bilateral Series) పాల్గొనడం లేదు

18:47 November 15

టాప్​న్యూస్​@ 7PM

  • ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ ఫిర్యాదు

హంద్రీనీవా సుజల స్రవంతి(Handri neeva sujala sravanthi project) ప్రాజెక్టుపై కేఆర్​ఎంబీ(krmb)కి తెలంగాణ ఫిర్యాదు చేసింది.

  • అలా మాట్లాడటం దుర్మార్గం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అలా మాట్లాడటం బాధ్యతరాహిత్యమని రాష్ట్ర పశు, సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) విమర్శించారు. గొర్రెల పంపిణీ పథకంపై అబద్ధాలు చెప్పడం తగదని హితవు పలికారు. హైదరాబాద్ మాసాబ్‌ ట్యాంక్​లోని పశు సంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

  • కాంగ్రెస్ నేత ఇంటికి నిప్పు

కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటికి నిప్పంటించారు కొందరు దుండగులు. ఉత్తరాఖండ్​ నైనీతాల్ జిల్లాలో ఆయన ఇంటిపై దాడి చేసి.. ఇంటిని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • 'దాన్ని ఆపలేం.. అలా చేస్తే బెటర్!'

క్రిప్టోకరెన్సీ అంశంపై పార్టమెంటరీ స్టాండింగ్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. పారిశ్రామిక వర్గం ప్రతినిధులు, నిపుణులు ఈ భేటీలో పాల్గొన్నారు. క్రిప్టోకరెన్సీని ఆపడం సాధ్యం కాదని, అందుకే దీనికి చట్టబద్ధత కల్పిచడమే మేలని పలువురు అభిప్రాయడినట్లు తెలుస్తోంది.

  • 'పుష్ప'లో ముద్దుగుమ్మ స్పెషల్ సాంగ్..!

ముద్దుగుమ్మ సమంత(samantha movies) క్రేజీ నిర్ణయం తీసుకుంది. 'పుష్ప'(pushpa release date) సినిమాలోని స్పెషల్ సాంగ్​లో నర్తించేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు.

17:39 November 15

టాప్​న్యూస్​@ 6PM

  • అడుగడుగునా అడ్డగింత

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay tour) పర్యటన నేపథ్యంలో నల్గొండలో ఉద్రిక్తత నెలకొంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని శెట్టిపాలెం వద్ద... భాజపా, తెరాస శ్రేణుల పరస్పర దాడుల నడుమ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

  •  రూ.2500 కోసం ఫ్రెండ్​ను..!

రూ. 2500 కోసం తోటి స్నేహితుడిని కిరాతకంగా పొడిచి చంపాడు ఓ యువకుడు. ఈ ఘటన పంజాబ్​లో జరిగింది.

  • 'ఈ రైల్వే స్టేషన్​ దేశానికి అంకితం'

భోపాల్​లో ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన​ రాణి కమలాపతి రైల్వే స్టేషన్​ను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

  •  బూట్లలో డ్రింక్​.. ఇదే కారణం

తొలిసారి టీ20 ప్రపంచకప్​ను (T20 world cup) కైవసం చేసుకొని అంతులేని ఆనందంలో ఉంది ఆస్ట్రేలియా (Australia Cricket News). ఆసీస్ క్రికెటర్లు అయితే ఏకంగా షూస్​లో కూల్​ డ్రింక్​ పోసుకొని తాగడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. వారు అలా చేయడానికి కారణం ఏమిటంటే..

16:54 November 15

టాప్​న్యూస్​@ 5PM

  • రేపు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

రేపు కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది.  సాయంత్రం 4 గం.కు తెరాస శాసనసభాపక్ష సమావేశం కానుంది. 

  • బండి పర్యటనలో ఉద్రిక్తత

  • 'వారిని పట్టించుకోని గత పాలకులు'

దేశానికి గిరిజన సమాజం చేసిన సేవలు గత పాలకుల హయాంలో మరుగునపడిపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సంస్కృతిని బలోపేతం చేయడంలో వారిదే కీలక పాత్ర అని చెప్పారు. దేశ జనాభాలో 10 శాతంగా ఉన్నప్పటికీ.. గిరిజనుల సమస్యల గురించి గత పాలకులు పట్టించుకోలేదని దుయ్యబట్టారు.

  •  ప్రాజెక్టుల పరిశీలనకు కేఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ 

నల్గొండ జిల్లాలో కేఆర్‌ఎంబీ(KRMB news) ఉపసంఘం సభ్యులు పర్యటిస్తున్నారు. నాగార్జున సాగర్(Nagarjuna Sagar Project) చేరుకున్న సభ్యులు... జలాశయం, విద్యుదుత్పత్తి కేంద్రం పరిశీలిస్తున్నారు. రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలోని కంపోనెంట్ల పరిశీలన జరగనుంది.

  • హీరోయిన్ 'ఫస్ట్​నైట్' కామెంట్స్..!

ప్రముఖ కథానాయిక రచితారామ్​.. ఇటీవల 'ఫస్ట్​నైట్'పై చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. ఆమెను బ్యాన్ చేయాలని కన్నడ క్రాంతి దళ్ డిమాండ్ చేసింది.

15:47 November 15

టాప్​న్యూస్​@ 4PM

  •  తెరాసలో చేరేందుకేనా..!

ఐఏఎస్ పదవికి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి (siddipet collector Venkata rami reddy resign news) రాజీనామా చేశారు. బీఆర్కే భవన్‌కు వెళ్లి సీఎస్ సోమేశ్‌కుమార్‌కు (CS SOMESH KUMAR) రాజీనామా లేఖ అందించారు

  • ' చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి '

ఆదివాసీ గిరిజన నాయకుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి (birsa munda jayanti)  సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ నివాళులు (Tributes to Chief Minister KCR on the occasion of Birsa Munda Jayanti) అర్పించారు.

  • 'వారితోనే దేశ సంస్కృతి బలోపేతం'

  • మరో ఎన్​కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌, నారాయణపుర్​ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో మావోయిస్టు కమాండర్ మృతిచెందాడు. సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ఎన్​కౌంటర్ జరిగినట్లు జిల్లా ఎస్పీ గిరిజా శంకర్ జైశ్వాల్​ తెలిపారు. ఏకే-47 తుపాకీ స్వాధీనం చేసుకున్నామన్నారు.

  • పడిలేచిన కెరటం అతను!

ఐపీఎల్​లో విధ్వంసకర బ్యాటర్​గా పేరున్న డేవిడ్​ వార్నర్​ను (David Warner News).. ఫామ్​లో లేడంటూ 14వ ఎడిషన్​కు పక్కనపెట్టింది సన్​రైజర్స్​ హైదరాబాద్​. దీనిపట్ల ఎందరో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వెంటనే జరిగిన టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup) అద్భుత ప్రదర్శనతో తన సత్తా ఏంటో మరోసారి చాటి.. ఆస్ట్రేలియాకు తొలి కప్పును అందించాడు. విమర్శకుల నోళ్లు మూయించాడు.​

14:46 November 15

టాప్​న్యూస్​@ 3PM

  •  'వారి కోసం దేనికైనా సిద్ధమే'

పండిన ప్రతి గింజా కొంటానని సీఎం కేసీఆర్(cm kcr) గతంలో చెప్పారని... సమస్య పరిష్కరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay comments) ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలంలో పంట మొత్తం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. పంటలన్నీ కేంద్రం కొనుగోలు చేస్తే సీఎం ఏం చేస్తారని ప్రశ్నించారు.

  •  'రైతులకు అన్యాయం చేయొద్దు..'

దేశ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితం హుజూరాబాద్​ ఉప ఎన్నిక అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Huzurabad MLA Etela Rajender)​ అన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా.. అంతిమంగా ప్రజలు ధర్మాన్నే గెలిపించారని స్పష్టం చేశారు. 

  • 'ఆయన పర్యవేక్షణలో దర్యాప్తు'

లఖింపుర్​ ఖేరి కేసు దర్యాప్తుపై బుధవారం ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సిట్​ బృందంలో సీనియర్​ ఐపీఎస్​ అధికారులకు చోటు కల్పించాలని, వారి పేర్లను మంగళవారం సమర్పించాలని యూపీ ప్రభుత్వానికి సూచించింది.

  • కేరళలో వరుణుడి ప్రతాపం

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కేరళలోని పలు ప్రాంతాలు(kerala heavy rain) చిగురుటాకులా వణుకుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇడుక్కి, ఎర్నాకుళం, కన్నూర్​, కోజికోడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్​ను, మరో 8 జిల్లాలకు యెల్లో అలర్ట్​ను వాతావరణ శాఖ జారీ చేసింది.

  • ఆ​ అవార్డుపై  పాక్ మాజీ బౌలర్ అభ్యంతరం

టీ20 ప్రపంచకప్​లో ఆసీస్​ ఆటగాడు డేవిడ్​ వార్నర్​కు ప్లేయర్​ ఆఫ్​ ద టోర్నమెంట్​ అవార్డు దక్కడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ షోయబ్​ అక్తర్. ఆ అవార్జు బాబర్​ అజామ్​కు దక్కాల్సిందని అభిప్రాయపడ్డాడు.

13:58 November 15

టాప్​న్యూస్​@ 2PM

  • ఐఏఎస్ పదవికి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా?

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బీఆర్కే భవన్‌కు వచ్చారు. ఐఏఎస్ పదవికి ఆయన రాజీనామా చేస్తారని సమాచారం. 

  • 'ప్రత్యామ్నాయ పంటలపై సలహాలివ్వండి'

దేశ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితం హుజూరాబాద్​ ఉప ఎన్నిక అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Huzurabad MLA Etela Rajender)​ అన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా.. అంతిమంగా ప్రజలు ధర్మాన్నే గెలిపించారని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం చేయకుండా.. ప్రతి గింజా కొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్(Huzurabad MLA Etela Rajender)​ ​చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా కేంద్రంలో ఈటల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

  • 'ఎంపీ ఇంటిపై కాల్పులు నా పనే'

భాజపా ఎంపీ రంజీతా కోలీ నివాసంపై కాల్పులకు ఓ బాలుడు బాధ్యత వహించాడు. ఈ మేరకు పోలీసులకు ఆదివారం ఫోన్​చేసి చెప్పాడు. బాలున్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

  • హైవేపై దిగిన మూడు యుద్ధవిమానాలు

భారత వాయుసేనకు చెందిన మూడు యుద్ధవిమానాలు రహదారిపై (Purvanchal Expressway route) దిగాయి. సుఖోయ్-30, మిరాజ్ 2000, ఏఎన్32 టర్బోప్రాప్​తో పాటు మరో రవాణా విమానం సైతం రహదారిపై ల్యాండ్ అయింది.

  • టీ20 ప్రపంచకప్ 2021లో నమోదైన రికార్డులివే

దుబాయ్​ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2021)​ క్రికెట్​ ప్రేమికులను అలరించింది. ఈ మెగాటోర్నీలో పలు జట్లకు చెందిన ఆటగాళ్లు రికార్డులు నమోదు చేశారు. ఇంతకీ ఆ ప్లేయర్స్​ ఎవరు?, ఏ రికార్డులను అందుకున్నారు? వంటి విషయాల సమాహారమే ఈ కథనం..

12:58 November 15

టాప్​న్యూస్​@ 1PM

  • విశాఖ నుంచి మహారాష్ట్రకు 1500 కిలోల గంజాయి

అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను (ganja seized) ముంబయి ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. 1500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

  • ఖాకీల అత్యుత్సాహంతో పోలీసుశాఖకు అప్రతిష్ట

వరుస సంఘటనలతో శాఖకు అప్రతిష్ట వస్తున్నా... కొంతమంది పోలీసుల తీరులో మార్పు కనిపించడం లేదు. చిన్న చిన్న కేసుల్లో పోలీసుల అత్యుత్సాహం (telangana police Enthusiasm) అమాయకుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటీవల ఆత్మకూరులో గిరిజన యువకుడిని చితకబాదిన ఎస్సై లింగం (si lingam) తీరు అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

  • ఏ చర్యలు తీసుకుంటారో తేల్చండి

వాహనాలు, పరిశ్రమలు, భవన నిర్మాణ పనులు వంటివే దిల్లీలో వాయు కాలుష్యానికి(Delhi Air Pollution) ప్రధాన కారకాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రైతుల పంట వ్యర్థాలు తగలబెట్టడమే కాలుష్యానికి ప్రధాన కారణం కాదని స్పష్టం చేసింది. వాయు కాలుష్యం కట్టడి కోసం చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

  • భారత్​పై ఆంక్షలా

రష్యా నుంచి ఎస్​-400 ఆయుధ వ్యవస్థను (S400 Air Defence system) కొనుగోలు చేసినందుకు భారత్​పై ఆంక్షలు విధించే (CAATSA sanctions) అంశంపై నిర్ణయం తీసుకోలేదని అమెరికా వెల్లడించింది. అమెరికా భారత్ మధ్య ఇటీవల భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరిందని... ఈ బలమైన బంధం కొనసాగాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. రష్యాతో లావాదేవీలు జరపొద్దని మిత్రదేశాలకు సూచించింది.

  • యూవీ సరసన మార్ష్​, హేజిల్​వుడ్​

టీ20 ప్రపంచకప్​ ఫైనల్​లో విజయం సాధించిన ఆసీస్ జట్టులోని ప్లేయర్స్​​ మార్ష్​, హేజిల్​వుడ్​ ఓ అరుదైన రికార్డును (T20 World Cup 2021 Records) నమోదు చేశారు. దీంతో వారి పేర్లు టీమ్​ఇండియా మాజీ ప్లేయర్​ యూవరాజ్​ సింగ్​ సరసన చేరాయి. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?

12:21 November 15

టాప్​న్యూస్​@ 12PM

  • రూ.2.08 కోట్లు విలువ చేసే గంజాయి సీజ్

హైదరాబాద్​లో గంజాయి అక్రమ రవాణా(illegal ganja transport) చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా(inter state gang arrested)ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 1,240 కిలోల గంజాయిని, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గాంజా విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో రాచకొండ పోలీసులు అంతర్రాష్ట్ర ముఠాను(inter state gang arrest) పట్టుకున్నారు. విశాఖ సీలేరు నుంచి భారీ ఎత్తున గంజాయిని తరలిస్తున్న(ganja smuggling) ముఠాను అరెస్టు చేశారు. 

  • దిల్లీలో పూర్తి స్థాయి లాక్​​డౌన్!

దిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకుగాను పూర్తి స్థాయి లాక్​డౌన్ విధించేందుకు తాము సిద్ధమేనని సుప్రీంకోర్టుకు దిల్లీ ప్రభుత్వం తెలిపింది. అయితే.. రాజధానిలోని అన్ని ప్రాంతాల్లో కూడా లాక్​డౌన్​ విధిస్తే.. మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెప్పింది.

  • జనజాతీయ గౌరవ్ దివస్​గా బిర్సా ముండా జయంతి

గిరిజన వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా (Jharkhand Birsa Munda) జయంతి అయిన నవంబర్ 15ను 'జనజాతీయ గౌరవ్ దివస్​'గా జరుపుకోనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. బిర్సా ముండా స్మారకార్థం నిర్మించిన మ్యూజియంను ఆవిష్కరించారు.

  • కార్తికస్నానాల్లో విషాదం

కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో కార్తికమాసం(tragedy in Kartika masam) వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్నానాలకు కృష్ణా నదిలో దిగిన ముగ్గురు యువకులు(three young men went missing in Krishna river) గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!

దసరా, దీపావళి సందర్భంగా కాస్త గుర్తింపు ఉన్న కథానాయకుల సినిమాలు వెండితెరపై సందడి చేశాయి. ఇక స్టార్‌ హీరోల సందడి అంతా డిసెంబరులోనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పలు చిన్న చిత్రాలు థియేటర్‌ల బాట పట్టనున్నాయి. అయితే, కొన్ని ఆసక్తికర సినిమాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్‌తో పాటు, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేవో చూద్దామా!

12:18 November 15

టాప్​న్యూస్​@ 11 AM

  • రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 7 డిగ్రీలు అదనంగా పెరగడంతో రాత్రిపూట చలి తీవ్రత తగ్గిందని వెల్లడించింది.

  • ఆ హైకోర్టులో బ్రెయిలీ లిపిలోనూ ఉత్తర్వులు

బ్రెయిలీ లిపిలో కోర్టు ఉత్తర్వుల కాపీలను అందించేందుకు వీలుగా ప్రత్యేక ప్రింటర్​ను(Braille printer) మద్రాస్​ హైకోర్టు ఏర్పాటు చేసింది. అంధులైన న్యాయవాదులకు ఉపయోగపడేలా.. సోమవారం నుంచి దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

  • నా గేదెకు చేతబడి చేశారు

తన గేదె పాలు ఇవ్వడం లేదని (Buffalo not giving milk) ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. చేతబడి చేయడం వల్లే గేదె పాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశాడు. చివరకు ఏమైందంటే..

  • తగ్గిన బంగారం ధర

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర (Gold Price today) భారీగా తగ్గింది. వెండి ధర కూడా అదే దారిలో పతనమైంది. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.200 తగ్గగా.. వెండి ధర (Silver price today) కిలోకు రూ.610 కిందికి దిగింది.

  • ఆసీస్​ గెలుపు సంబరాలు

కివీస్​పై ఆసీస్​ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆటగాళ్లు సంబరాల్లో (Australia Celebration T20) మునిగి తేలారు. అయితే వాళ్లు సెలబ్రేషన్స్​ చేసుకున్న తీరు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్లేయర్స్​.. షూస్​లో కూల్​డ్రింక్​ పోసుకొని తాగారు. దానికి సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్​ చేసింది.

12:15 November 15

టాప్​న్యూస్​@ 10 AM

  • భారత్ @ 10,229 కేసులు

దేశం​లో కొవిడ్ కేసులు (Corona cases in India) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 10,229 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్​ కారణంగా మరో 125 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • పంట మార్చితే బెటర్

యాసంగిలో వరికి(paddy cultivation requires) బదులు ప్రత్యామ్నాయ పంటలు(alternative crops for paddy in telangana) వేయాలని ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. ఇతర పంటలకు(alternative crops examples) రాష్ట్రంలోని భూములు అనుకూలంగా ఉన్నందున పంట మార్పిడి చేస్తే మంచిదని అని పేర్కొంది. పెసర, మినుము, సెనగ, వేరు సెనగ, ఆవాలు, కుసుమ, పొద్దుతిరుగుడు సాగు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • మార్కెట్లు డీలా

దూకుడుగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు.. డీలా పడ్డాయి. ఆరంభ లాభాలను కోల్పోయిన సెన్సెక్స్.. ప్రస్తుతం ఒడుదొడుకుల మధ్య ట్రేడింగ్ సాగిస్తోంది. 8 పాయింట్ల లాభంతో 60,695 పాయింట్ల వద్ద కదలాడుతోంది. 

  • అడిగిన వెంటనే ముంగిట ప్రత్యక్షం

కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలను (Qucik commerce market) అందజేసే బిగ్‌బాస్కెట్‌, సూపర్‌ వంటి వాటిలోనూ వస్తువులను అందించడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అప్పటికప్పుడు ఏదైనా కావాలంటే వినియోగదారుడు నేరుగా దుకాణానికి వెళ్లి కొనుక్కోవాల్సిందే. ఈ లోటునూ పూడ్చగలిగితే వ్యాపారంలో తిరుగు ఉండదని భావించిన ఈ-కామర్స్‌ కంపెనీలు (Q commerce india) కొత్తగా క్యూ-కామర్స్‌ను రంగంలోకి తెచ్చాయి. ఆర్డర్‌ ఇచ్చిన 45 నిమిషాల్లోనే వినియోగదారుడి చెంతకు వస్తువును చేర్చడమే క్యూ-కామర్స్‌ ప్రత్యేకత.

  • ఆసక్తిగా 'గని' టీజర్

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో వరుణ్​తేజ్​ 'గని' టీజర్​, విజయ్​ సేతుపతి 'కాతువక్కుల రెండు కాదల్' ఫస్ట్​లుక్​ ఉన్నాయి. "ఆట ఆడినా ఓడినా రికార్డ్స్‌లో ఉంటాం. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటాం" అని అంటున్నారు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. ఆయన వాయిస్‌ ఓవర్‌తో విడుదలైంది టీజర్‌ 'గని'. వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'గని' టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది. 

12:11 November 15

టాప్​న్యూస్​@ 9AM

  • రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

120 కిలోల డ్రగ్స్​ను గుజరాత్​ ఉగ్రవాద నిరోధక దళం (drugs seized) స్వాధీనం చేసుకుంది. వాటి విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని అంచనా.

  • అప్పుడే.. నదీ జలాలపై ముందుకు

నదుల అనుసంధానంపై రాష్ట్రాలు ఓ అంగీకారానికి వస్తే, వాటి అభిప్రాయాల్నీ పరిగణనలోకి తీసుకుని డీపీఆర్‌ సిద్ధం చేసి ముందుకెళతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. కాగా నదుల్లో నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో నదీపరీవాహక ప్రాంత రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ విధానాన్ని పునస్సమీక్షించాలని దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ కోరారు.

  • భారత సిపాయిలపై బ్రిటన్​ 'నాజీయిజం'

గ్యాస్‌ ఛాంబర్లనగానే ప్రపంచంలో అందరికీ హిట్లర్‌, నాజీయిజం, యూదులు గుర్తుకొస్తారు. కానీ హిట్లర్‌ కంటే దుర్మార్గంగా గ్యాస్‌ ఛాంబర్లను భారతీయులపై ప్రయోగించింది బ్రిటన్‌! హిట్లర్‌ జాత్యహంకారంతో యూదులను గ్యాస్‌ ఛాంబర్లలోకి నెడితే... తమను నమ్మి వచ్చిన భారతీయ సిపాయిలను విషవాయువుల బారిన పడేసింది విశ్వాసఘాతుక బ్రిటిష్‌ సర్కారు.
 
  • రోడ్డుపై మాట్లాడుతుండగా.

రోడ్డుపై నిలబడి మాట్లాడుకుంటున్న వారు అనుకోలేదు తమను మృత్యువు కబలిస్తోందని. రహదారి పక్కనే నిల్చొని మాట్లాడుకుంటున్నవారిని ఇసుక లారీ ఢీకొట్టిన ఘటన మంథనిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

  • T20worldcup హైలైట్స్​ చూసేయండి

టీ20 వరల్డ్​కప్​ ఫైనల్​లో(T20 World Cup 2021) న్యూజిలాండ్​ను ఓడించి తొలిసారి పొట్టి ప్రపంచకప్​ను ముద్దాడింది ఆస్ట్రేలియా. ఈ పోరులో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్​కు సంబంధించిన హైలైట్స్​ వీడియోను పోస్ట్​ చేసింది ఐసీసీ. దాన్ని చూసేయండి..

12:07 November 15

టాప్​న్యూస్​@ 8AM

  • ఉద్యోగాల ప్రకటనలతో ఆశలు

ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేస్తున్న ప్రకటనలు (government job notifications) నిరుద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. దాదాపు 70 వేల ఉద్యోగాలు భర్తీ (government job notifications) చేయబోతున్నట్టు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో గ్రూప్‌-1, 2, 3పై యువత భారీగా ఆశలు పెట్టుకుంది. సర్కారు కొలువు సాధించాలనే కలను (government job notifications) నెరవేర్చుకునేందుకు వేలమంది సిద్ధమవుతున్నారు.

  • వైద్యారోగ్య శాఖలో పైరవీల రాజ్యం

రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖలో(Telangana Health department) పైరవీలతో డిప్యుటేషన్లు(deputation), వర్క్ ఆర్డర్లు(work order) రాజ్యమేలుతున్నాయి. పదోన్నతులు పొందిన వారు నియామకం పొంది స్థానం నచ్చకపోతే.. పైరవీలతో తమకు నచ్చిన ప్రదేశాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు.. అవసరాలకు తగ్గట్లుగా నిబంధనల మేరకే సర్దుబాట్లు చేస్తున్నామని డీహెచ్​వో శ్రీనివాస రావు(Directors of Public Health Srinivasa Rao) అంటున్నారు. ఈ విషయంపై మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) దృష్టి సారించి.. నిబంధనల మేరకు డిప్యుటేషన్లు జరిగేలా చూడాలని మిగతా సిబ్బంది, అధికారులు కోరుతున్నారు.

  • ఉసురు తీస్తున్న వాయుకాలుష్యం

వాయు కాలుష్యంతో(Air Pollution) తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం ఉత్పన్నమయ్యే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ- వాయు నాణ్యత మార్గదర్శకాలను 2021లో సవరించింది. వాయు కాలుష్య(Air Pollution news) ప్రమాణాలను కఠినతరం చేసింది. గాలిలోని అతి సూక్ష్మ ధూళి కణాలు- ఘనపు మీటరు పరిధిలో అయిదు మైక్రోగ్రాముల కంటే ఎక్కువ స్థాయిలో ఉండకూడదన్నది తాజా ప్రమాణం.

  • విహారిని ఎంపిక చేయకపోవడానికి కారణం అదే

న్యూజిలాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​కు హనుమ విహారి ఎంపిక కాకపోవడానికి గల కారణాన్ని తెలిపారు మాజీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​ (Gavaskar on Vihari). అతడు గత కొన్ని నెలలుగా క్రికెట్​ ఎక్కువగా ఆడకపోవడం వల్ల జట్టు నుంచి తప్పించారని అభిప్రాయపడ్డారు.

  • చీటింగ్​ కేసుపై స్పందించిన నటి శిల్పాశెట్టి

తనపై నమోదైన చీటింగ్​ కేసుపై స్పందించిన బాలీవుడ్​ నటి శిల్పాశెట్టి(Shilpa shetty updates).. తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటే చాలా బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
11:57 November 15

టాప్​న్యూస్​@ 7AM

కేబీఆర్​ పార్కులో వాకింగ్​కు వెళ్లిన నటిపై దాడి

భాగ్యనగరంలోని కేబీఆర్‌ పార్క్​లో (KBR park in Hyderabad) నటి షాలూ చౌరాసియాపై (attack on actress chaurasia) దాడి జరిగింది. నడకకు వెళ్లిన ఆమెపై ఓ దుండగుడు దాడి (attack on heroine) చేసి చరవాణి లాక్కెళ్లాడు. 

నిప్పుల కొలిమివైపు మానవాళి పయనం

భవిష్యత్తు కాలమంతా జనాన్ని వేడిమి అల్లాడించనుందా? మానవాళి నిప్పుల కొలిమి వైపు పయనిస్తోందా? అవుననే అంటున్నాయి... ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు(climate changes). సరాసరి ఉష్ణోగ్రతలు(temperature increase) క్రమేపీ పెరుగుతుండడం ఆందోళనకరమని ఐరాస(UNO) నివేదిక హెచ్చరిస్తోంది. దీనివల్ల విద్యుత్తు వినియోగం అధికమై... ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతాయని, సాధారణ ప్రజలు ఉపాధి కోల్పోయి, పేదరికంలోకి జారిపోయే ప్రమాదముందని నివేదిక విశ్లేషించింది.

పిల్లలే ఎమ్మెల్యేలైన వేళ

అసెంబ్లీలో (assembly on childrens day) గంటపాటు ప్రత్యేక సమావేశం జరిగింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం, నిరసనలు, వాకౌట్​లు కనిపించాయి. అయితే.. నిజంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాదు. చిన్నారులే శాసనసభ్యులుగా (mock assembly) అవతారమెత్తారు. ఈ దృశ్యాలు రాజస్థాన్​ అసెంబ్లీలో కనిపించాయి.

కొవాగ్జిన్ టీకా వెనుక.. 20 కోతులు

కొవాగ్జిన్​ టీకా(Covaxin Vaccine) రూపకల్పనలో భారత శాస్త్రవేత్తలకు కోతులు ఉపయోగపడ్డాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ(Balram Bhargava News) అంటున్నారు. "గోయింగ్‌ వైరల్‌.. మేకింగ్‌ ఆఫ్‌ కొవాగ్జిన్‌ ఇన్‌సైడ్‌ స్టోరీ" అనే పుస్తకాన్ని రాసిన ఆయన.. రీసస్‌ జాతికి చెందిన 20 వానరాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

దాదా మార్క్​ దూకుడు

టీమ్​ఇండియా కొత్త శకంలోకి అడుగుపెట్టింది. ఒకప్పుడు జట్టును ముందుండి అద్భుత విజయాలనందించిన గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్.. ఇప్పుడు వెన్నుండి నడిపించనున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, ప్రధాన కోచ్​గా ద్రవిడ్, ఎన్​సీఏ అధ్యక్షుడిగా లక్ష్మణ్​.. భారత జట్టును ఎవ్వరూ చేరలేని తీరాలకు నడిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ద్రవిడ్, లక్ష్మణ్​ పదవులు చేపట్టడం వెనుక ప్రధాన కృషి గంగూలీదే!

05:40 November 15

టాప్​న్యూస్​@ 6AM

  • అభ్యర్థుల ఖరారు..!

శాసన మండలి ఎన్నికల అభ్యర్థుల (MLA Quota MLC ) ఖరారుకు తెలంగాణ రాష్ట్ర సమితి (trs) ఆచి తూచి వ్యవహరిస్తోంది. పోటీ తీవ్రంగా ఉన్నందున సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 

  • 'కట్టుబడి ఉంటాం..'

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (home minister Amit Shaw) అధ్యక్షతన తిరుపతి వేదికగా జరిగిన దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో (Southern Zonal Council Meeting) రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రతిపాదించిన ఎజెండాలో తెలంగాణకు సంబంధం ఉన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించింది.

  • స్థానికంగా ఐక్యతారాగం పనిచేస్తుందా..!

హుజూరాబాద్‌ ఉపఎన్నికల (huzurabad by election results) ఫలితాలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష... రాష్ట్రంలో కాంగ్రెస్‌ (state congress) బలోపేతానికి దోహదం చేస్తుందా....నాయకుల మధ్య విభేదాలు దూరం అవుతాయా...పార్టీకి నష్టం కలిగించేట్లు వ్యాఖ్యలు చేయకుండా నాయకులు ఉండగలరా.

  • జీఆర్​ఎంబీ పరిశీలన

గోదావరి నదీ యాజమాన్య బోర్డు (grmb board) క్షేత్ర స్థాయిలో పర్యటించింది. గెజిట్ అమల్లో భాగంగా బోర్డు ఛైర్మన్ చంద్ర శేఖర్ అయ్యర్ నేతృత్వంలోని బృందం సంగారెడ్డి, నిజామాబాద్‌లో ప్రాజెక్టులను సందర్శించింది.

  • త్రిపుర హింసపై ట్వీట్.. ఆ తర్వాత..

త్రిపుర హింసపై(tripura violence) ట్వీట్లు చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అసోం పోలీసులు నిర్బంధించారు. ఈ అరెస్టును ఎడిటర్స్‌ గిల్డ్‌ ఖండించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు.

  • నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

మండల మకరవిళక్కు పండగ సీజన్​ సందర్భంగా శబరిమల ఆలయం నేడు తెరుచుకోనుంది(sabarimala temple opening dates). 2 నెలల పాటు వర్చువల్​ క్యూ విధానంలో రోజుకు 30వేల మంది భక్తులకు అనుమతించనున్నారు(sabarimala temple timings).

  • సీఎంలతో నేడు నిర్మల కీలక భేటీ

నేడు(నవంబర్ 15) రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ సమావేశం కానున్నారు. ప్రైవేటు పెట్టుబడులు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం.

  • 'ఎవరితోను మాకు విరోధం వద్దు..!' 

అఫ్గానిస్థాన్​లో(Afghanistan News) తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడ్డాక వివిధ రంగాల నుంచి మహిళలను దూరం చేస్తున్నారన్న వార్తలను తోసిపుచ్చారు తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ. భారత్​ సహా ఏ ఇతర దేశంతోనూ తాము విరోధం కోరుకోవడంలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

  • ఆహా..ఆసీస్‌

టీ20 ప్రపంచకప్​ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో తొలిసారి పొట్టి ప్రపంచకప్​ను కైవసం చేసుకుంది.

  • ఓటీటీలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'

పెళ్లి నేపథ్య కథతో తీసిన రొమాంటిక్ ఎంటర్​టైనర్​ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'(most eligible bachelor ott release date).. ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైంది. దీనిని ఆహా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Last Updated : Nov 15, 2021, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.