ETV Bharat / city

Ertugliflozin drug : ఎర్టుగ్లిఫ్లోజిన్‌ ఔషధంతో కరోనాకు అడ్డుకట్ట - ertugliflozin drug prevents corona spreading

మధుమేహ నియంత్రణకు వాడే ఎర్టుగ్లిఫ్ళోజిన్ ఔషధం(ertugliflozin drug) కరోనాను అడ్డుకుంటుందని పరిశోధకులు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని అంకుర సంస్థ కీలక విషయాన్ని గుర్తించింది. ఈ ఔషధం కొవిడ్‌-19 స్పైక్‌ ప్రొటీన్‌ మానవ ఏసీఈ2 రిసెప్టర్‌తో బంధించకుండా సమర్థంగా అడ్డుకోవడం గుర్తించారు.

Ertugliflozin drug
Ertugliflozin drug
author img

By

Published : Jul 2, 2021, 9:32 AM IST

కొవిడ్‌ ఔషధ పరిశోధనలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని అంకుర సంస్థ కీలక విషయాన్ని గుర్తించింది. మధుమేహ నియంత్రణకు వాడే ఎర్టుగ్లిఫ్లోజిన్‌ ఔషధం(ertugliflozin drug) కరోనాను అడ్డుకుంటుందని వీరి అధ్యయనంలో తేలింది. కేంద్రీయ వర్సిటీలోని రీజీన్‌ ఇన్నోవేషన్స్‌ అంకుర సంస్థ, ఇంద్రాస్‌, టెక్‌మహేంద్ర తోడ్పాటుతో కొవిడ్‌ ఔషధ ప్రయోగాలను చేపట్టింది.

వీరి పరిశోధనలో ఎర్టుగ్లిఫ్లోజిన్‌ ఔషధం(ertugliflozin drug) కొవిడ్‌-19 స్పైక్‌ ప్రొటీన్‌ మానవ ఏసీఈ2 రిసెప్టర్‌తో బంధించకుండా సమర్థంగా అడ్డుకోవడం గుర్తించారు. కొవిడ్‌ బారిన పడితే ప్రాథమికంగా కన్పించే లక్షణాలైన శరీర కణజాలాల్లో వాపు, రక్తం గడ్డకట్టే సామర్థ్యం గణనీయంగా తగ్గడం తదితరాలను త్రీడీ మానవ వాస్కులర్‌ ఊపిరితిత్తుల నమూనాలో పరిశోధకులు గుర్తించారు. అయితే క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనందున చికిత్సకు ఉపయోగించవచ్చని చెప్పలేమని సంస్థ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.