ETV Bharat / city

AP PRC: పీఆర్​సీపై రాని స్పష్టత.. జేఎస్​సీ భేటీని బహిష్కరించిన ఉద్యోగ సంఘాలు - జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీని బహిష్కరించిన ఉద్యోగ సంఘాలు

ఏపీలో వేతన సవరణ నివేదిక సహా డిమాండ్లపై.. ఉద్యోగ సంఘాలకు మరోసారి నిరాశే ఎదురైంది. ఉద్యోగుల జీపీఎఫ్​ (GPF) ఖాతాల నుంచి.. సొమ్ము విత్ డ్రా చేయడంపై స్పష్టత రాకపోతే ఆర్థిక శాఖ అధికారులపై క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించాయి.

ap prc issue
ap prc issue
author img

By

Published : Nov 13, 2021, 3:10 AM IST

AP PRC: పీఆర్​సీపై రాని స్పష్టత.. జేఎస్​సీ భేటీని బహిష్కరించిన ఉద్యోగ సంఘాలు

ఏపీలో వేతన సవరణ నివేదిక సహా డిమాండ్లపై ఉద్యోగ సంఘాలకు మరోసారి నిరాశే ఎదురైంది. పీఆర్​సీ (PRC) నివేదికను ఏపీ ప్రభుత్వం కావాలనే బహిర్గతం చేయడం లేదని ఆరోపించాయి. తమను మానసిక క్షోభకు గురి చేస్తోందంటూ ఉద్యోగ సంఘాలు ఉన్నతాధికారుల సమావేశాన్ని అర్థాంతరంగా బహిష్కరించాయి. ఏపీ ప్రభుత్వం పదేపదే అవమానించడం సరికాదని ఆక్షేపించాయి. ఉద్యోగుల జీపీఎఫ్​ (GPF) ఖాతాల నుంచి.. సొమ్ము విత్​ డ్రా చేయడంపై స్పష్టత రాకపోతే ఆర్థిక శాఖ అధికారులపై క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించాయి.

సచివాలయంలో ఆర్థిక శాఖ అధికారులు ఏర్పాటు చేసిన జాయింట్​​ స్టాఫ్​ కౌన్సిల్‌ సమావేశానికి (joint staff council meeting) మొత్తం 13 ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. 9 సంఘాల ప్రతినిధులు సమావేశాన్ని అర్ధాంతరంగా బహిష్కరించాయి. తాము అడిగిన ప్రశ్నలకు అధికారులు బదులివ్వకపోగా.. మళ్లీ కమిటీలంటూ కాలయాపన చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'అక్టోబర్ 29 నాటి భేటీలో ఇస్తామన్న నివేదిక ఇంకా ఇవ్వలేదు. కనీసం ఇవాళ్టి (శుక్రవారం) సమావేశంలో అయినా ఇస్తారని ఆశించాం. అధికారులు మాత్రం పీఆర్‌సీ నివేదిక ఊసే ఎత్తడం లేదు. అధికారుల కమిటీ మళ్లీ అధ్యయనం చేయడం ఏమిటి ? మేం అడిగిన అంశాలకు స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకుంటే కార్యాచరణ ప్రకటిస్తాం'

- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఏసీ ఛైర్మన్

క్రిమినల్​ కేసులు పెడతాం..

ఉద్యోగ సంఘాలు సమావేశాన్ని బహిష్కరించటాన్ని.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ స్వాగతించారు. ఉద్యోగులకు తెలియకుండా.. జీపీఎఫ్​ ఖాతాల నుంచి నిధులు విత్ డ్రా చేయడంపై క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు.

జాప్యం చేస్తున్నారు..

ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని అధికారులు చెప్పినట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌, ఈహెచ్ఎస్ (EHS) అమలు చేయాలని కోరామన్నారు. పీఆర్‌సీపై (PRC) స్పష్టత వస్తుందని ఆశించాం కానీ.. నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. పీఆర్‌సీ నివేదిక కోసమే కౌన్సిల్ భేటీ జరపలేదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. జీతాలకు ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు హమీ ఇచ్చారని.. 13 లక్షల మంది ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు వస్తాయన్నారు.

'మెడికల్ రీయింబర్స్‌మెంట్‌, ఈహెచ్ఎస్ అమలుచేయాలని కోరాం. పీఆర్‌సీపై స్పష్టత వస్తుందని ఆశించాం. నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుంది. మార్చి 30లోగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులు చెల్లించాలని కోరాం. తదుపరి భేటీకి పీఆర్‌సీ నివేదికతో రావాలని కోరాం. గంట చర్చ జరిగాక మిగతా సంఘాలు బయటకు వచ్చాయి. పీఆర్‌సీ నివేదిక కోసమే కౌన్సిల్ భేటీ జరపలేదు. జిల్లా ఉద్యోగులతోనూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జరపాలని కోరాం. జీతాలకు ఇబ్బంది లేకుండా చూస్తామని అధికారులు చెప్పారు. 13 లక్షల మంది ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు వస్తాయి.'

- వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఇదీచూడండి: TRS Dharna over Paddy procurement :' రైతును కష్టపెట్టిన ఏ సర్కార్ నిలబడలే'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.