ETV Bharat / city

మత్స్యకారుల వలకు చిక్కిన 80కిలోల చేప

author img

By

Published : Mar 12, 2021, 2:23 PM IST

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో భారీ చేప చిక్కింది. దాన్ని చూసిన వారి ఆనందం అంతా ఇంతా కాదు. ఎనభై కిలోలు ఉన్న ఈ చేపను ఒడ్డుకు చేర్చేందుకు బాగానే కష్టపడాల్సి వచ్చింది. ఏడడుగుల చేప.. ఏడు వేల రూపాయలకు అమ్ముడుపోయి ఆ శ్రమకు తగ్గ ఫలితం దక్కింది.

eighty-kilograms-of-tuna-fish-in-the-uppada-fish-pond
ఉప్పాడ చేపల రేవులో మత్స్యకారులకు చిక్కిన భారీ చేప

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో గురువారం మత్స్యకారులకు భారీ ట్యూనా చేప దొరికింది. ఏడు అడుగుల పొడవు, ఎనభై కిలోల బరువున్న ఈ ట్యూనా చేపను ఒడ్డుకు చేర్చడానికి వారు తీవ్రంగా శ్రమించారు.

ఓ వ్యాపారి ఈ చేపను ఏడు వేల రూపాయలకు కొనుగోలు చేసి.. కేరళకు ఎగుమతి చేశాడు. ఇంత భారీ చేప ఉప్పాడ చేపలరేవులో దొరకడంతో సందర్శకులు ఫొటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.