ETV Bharat / city

‘‘వ్యాక్సిన్‌ వచ్చాకే మా పిల్లలను బడికి పంపిస్తాం’’ - medchal education department survey on schools reopening

‘‘అవును.. వ్యాక్సిన్‌ వచ్చాకే మా పిల్లలను బడికి పంపిస్తాం.’’ - ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల విద్యాశాఖాధికారులు చేపట్టిన సర్వేలో 60-70 శాతం మంది తల్లిదండ్రులు వ్యక్తంచేసిన అభిప్రాయమిది.

education department survey on schools reopening due to this corona pandemic
‘‘వ్యాక్సిన్‌ వచ్చాకే మా పిల్లలను బడికి పంపిస్తాం’’
author img

By

Published : Jul 31, 2020, 8:34 AM IST

పాఠశాలలను కొన్నాళ్ల తర్వాత ప్రారంభించినా రోజు విడిచి రోజు నడపాలని 45 శాతం మంది తల్లిదండ్రులు చెప్పగా, ప్రతిరోజు నడపాలని 24 శాతం మంది, షిప్టు పద్ధతిలో నిర్వహించాలని మిగిలినవారు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్​, మేడ్చల్ జిల్లాల విద్యాశాఖాధికారులు చేపట్టిన సర్వేలో వెల్లడైన విషయాలివి. మరోవైపు అన్‌లాక్‌ -3లో భాగంగా ఆగస్టు 31 వరకు పాఠశాలలు మూసి ఉంటాయని కేంద్రం సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎలా స్పందించారంటే..

హైదరాబాద్‌ జిల్లాలో 60 శాతం మంది తల్లిదండ్రులు వ్యాక్సిన్‌ వచ్చాక తమ పిల్లలను పాఠశాలలకు పంపుతామని చెప్పగా 30 శాతం మంది దసరా తర్వాత అని చెప్పారు. మరో 10 శాతం మంది ఆగస్టు, సెప్టెంబరు మధ్య ఎప్పుడైనా ఫర్వాలేదన్నారు. మేడ్చల్‌ జిల్లాలో 71 శాతం మంది వ్యాక్సిన్‌ వచ్చాకే అంటూ స్పష్టంచేశారు. 14 శాతం మంది సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మాసాల్లో పంపిస్తామన్నారు.

వివిధ అంశాలపై ఇంకా ఏం సూచించారంటే..

సిలబస్‌ను 50 శాతం తగ్గించాలని 39 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయగా ఎలాంటి మార్పులు అవసరం లేదని 26 శాతం మంది చెప్పారు. మిగిలినవారు కొంతమేర తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.

పాఠశాలలను ప్రారంభించే వరకు ఆన్‌లైన్‌ ద్వారా చదువు కొనసాగించాలన్నారు. ముఖ్యంగా చరవాణి ద్వారా బోధన చేయొచ్చని 41 శాతం మంది పేర్కొనగా 27 శాతం మంది టీవీ ఛానెళ్ల ప్రసారాలకు ఓటు వేశారు. మిగిలినవారు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా బోధించాలన్నారు.

ఒకవేళ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే 52 శాతం మంది చరవాణి ఇస్తామని చెప్పగా, 24 శాతం మంది ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. మిగిలినవారు ట్యాబ్‌ వంటి ఇతర ఐచ్ఛికాలు సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.