సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉపఎన్నిక ప్రచార గడువు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. స్థానికేతరులంతా నియోజకవర్గం వదిలి వెళ్లాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలు తనిఖీ చేయాలని పోలీసులను సీఈవో రజత్‌కుమార్ ఆదేశించారు. నియోజకవర్గ, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని, ఎలాంటి అనుమానం వచ్చినా సదరు వ్యక్తుల గుర్తింపు పత్రాలను పరిశీలించాలని సూచించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి ఏజెంట్ల దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
"స్థానికేతరులంతా హుజూర్‌నగర్ వదిలివెళ్లాలి" - హుజూర్‌నగర్ ఉపఎన్నిక
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ శాసనసభ ఉపఎన్నిక ప్రచార గడువు మరో రెండు గంటల్లో ముగియనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఈసీ స్పష్టం చేసింది.