FIR against MLA Raja Sing: భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం, మీడియాతో మాట్లాడే విషయంలో కూడా ఈసీ నిషేధం విధించింది. యూపీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యానాథ్‌కు మద్దతుగా రాజాసింగ్ విడుదల చేసిన వీడియోనే ఇందుకు కారణం. ఈ వీడియో విషయంలో ఇప్పటికే రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వీడియో సందేశంపై వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను ఈసీ బుధవారం ఆదేశించింది. విధించిన గడువు లోపల వివరణ ఇవ్వకపోవటం వల్లే ఎఫ్ఐఆర్కు ఈసీ ఆదేశించింది.
నోటీసులు ఎందుకు ఇచ్చిందంటే..
యూపీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వీడియోలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఓటర్లను బెదిరించినట్టుగా ఉన్నాయని ఈసీ పేర్కొంది. రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. పూర్తి కథనం కోసం.. EC notice to Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు.. 24 గంటల్లో..
నోటీసులపై రాజాసింగ్ ఎమన్నారంటే..
ఈసీ నోటీసులపై వెంటనే స్పందించిన రాజాసింగ్.. తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని సమర్థించుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ మరోసారి సీఎం కావాలని రాజస్థాన్ ఉజ్జయినిలో మూడు రోజుల పూజా కార్యక్రమం పెట్టుకున్నట్టు తెలిపారు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక ఈసీకీ వివరణ ఇస్తానని వెల్లడించారు. పూర్తి కథనం కోసం.. MLA Raja Singh Response: ఈసీ నోటీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఏమన్నారంటే..?
వీడియోలో ఏముందంటే..
అసలు ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన వీడియోలో ఏముంది..? ఆయన ఓటర్లను ఉద్దేశించి ఏమన్నారు..? బెదిరించే వ్యాఖ్యలు ఏంచేశారు..? పూర్తి కథనం కోసం..Raja Singh Controversy: 'యూపీలో భాజపాకు ఓటేయకపోతే.. ఇళ్లపైకి బుల్డోజర్లు'