ETV Bharat / city

అడుగడుగునా అక్రమాలు.. అలసత్వం - స్థానిక సంస్థల ఎన్నికలపై వార్తలు

కరోనా కారణంగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినా.. కలెక్టర్లు, ఎస్పీలు సహా అధికారులపై ఎలక్షన్ కమిషనర్ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఎన్నికల సంఘం వారిపై తీవ్ర చర్యలు తీసుకోవడానికి కారణమేంటీ..? ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వారి వ్యవహార శైలిపై ప్రత్యేక కథనం

ec-action-on-officers-behaviour-in-local-body-elections
అడుగడుగునా అక్రమాలు.. అలసత్వం
author img

By

Published : Mar 16, 2020, 10:13 AM IST

అడుగడుగునా అక్రమాలు.. అలసత్వం

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటి నుంచి నామినేషన్ల ఘట్టం ప్రక్రియ పూర్తయ్యే వరకు గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రత్యర్థులను బెదిరించి పోటీ నుంచి తప్పించడం దగ్గర నుంచి.. నామపత్రాల చించివేత, అభ్యర్థుల అపహరణ వరకు యుద్ధ వాతావరణం సృష్టించారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ అరాచకాలకు భయపడి విపక్షాలు పోటీ చేసేందుకే ముందుకు రాలేదు. మాచర్ల నియోజకవర్గం వ్యాప్తంగా కేవలం ఒకే ఒక ఎంపీటీసీ స్థానంలో ఎన్నికలు జరగనున్నాయంటేనే.. అక్కడి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు.

ప్రత్యర్థులపై దాడులు, బెదిరింపులతో భయోత్పాతం సృష్టించారు. దీన్ని అడ్డుకోవడంలో జిల్లా కలెక్టర్‌, ఎస్పీ సరైన రీతిలో వ్యవహరించకపోవడాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. నరసరావుపేట, మాచవరం, వెల్దుర్తి, మాచర్ల, దుర్గి ఎంపీడీవో కార్యాలయాల వద్ద వైకాపా ఆగడాలను అధికారులు, పోలీసులు చూస్తూ ఉండిపోయారనే విమర్శలు వెల్లువెత్తాయి. బాధితుల ఫిర్యాదుపై ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరించారంటూ ..…కలెక్టర్‌, ఎస్పీపై రాష్ట్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.

ఏపీ ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు తొలగించాలని ఆదేశించినా కలెక్టర్ పట్టించుకోకపోవడం, నామినేషన్ల సందర్భంగా గొడవలు జరిగినా పోలీసులు స్పందించకపోవడం, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరిస్తున్నా అధికారులు చూస్తూ ఉండిపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కలెక్టర్, ఎస్పీపై ఈసీ చర్యలు తీసుకుంది.

మాచర్లలో తెదేపా నేతలపై దాడికి పాల్పడిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిన సీఐ రాజేశ్వరరావును సస్పెండ్ చేయాలంటూ ఆదేశించింది. దాడికి పాల్పడిన నిందితులపై రౌడీషీట్ పెట్టాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఏపీ వ్యాప్తంగా రిజర్వేషన్లు ఖరారు చేసి రాజపత్రం విడుదల చేసిన తర్వాత కూడా చిత్తూరు జిల్లాలో రిజర్వేషన్లు ఇష్టానుసారం మార్చేశారు. ఏ స్థానం ఎవరికి కేటాయించారన్న విషయంలో గోప్యత పాటించారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకున్నారు. ఇలాంటి అనేక అక్రమాలు చోటుచేసుకోవడం వల్లే కలెక్టర్‌, అర్బన్ ఎస్పీ, శ్రీకాళహస్తి, పలమనేరు డీస్పీలపై వేటుపడింది.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరు సహా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లెలో విపక్షాల అభ్యర్థులకు నామినేషన్ దరఖాస్తులు ఇవ్వకపోవడం, ఇంటిపన్ను కట్టించుకోకపోవడం, ధ్రువపత్రాలు జారీచేయకపోవడం వంటివి జరిగాయి. పోలీసుల సాక్షిగా నామినేషన్లు చించివేయడం, అడ్డగోలుగా తిరస్కరించడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు తెదేపా నేతలపై దాడికి సంబంధించి అర్బన్ ఎస్పీపై వేటు పడినట్లు సమాచారం. ఎన్నికల సంఘం నిర్ణయాలను జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు స్వాగతించారు.

అధికార యంత్రాంగం ఎన్నిల నిర్వహణ సక్రమంగా నిర్వర్తించకపోవటంతో పాటు.. వైకాపాకు దాసోహమైందని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భావించినట్లు తెలుస్తోంది. పరిశీలకుల ద్వారా నివేదికలు తెప్పించుకుని చర్యలు చేపట్టినట్లు సమాచారం. పుంగనూరు, శ్రీకాళహస్తిలో ఎన్నికల రద్దు అంశాన్ని పరిశీలించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.