ETV Bharat / city

బోరబండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూ'ప్రకంపనలు'

author img

By

Published : Oct 4, 2020, 9:53 AM IST

శుక్రవారం రాత్రి 8.30-11.30 గంటల మధ్య భారీ శబ్దాలతో సుమారు 15 సార్లు భూమి కంపించడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన సంగతి తెలిసిందే. తీవ్రత 1.5గా ఎన్‌జీఆర్‌ఐలోని భూకంపాల ప్రయోగశాలలో నమోదైంది. బోరబండ చుట్టుపక్కల భూప్రకంపనలను గుర్తించేందుకు మూడు చోట్ల సిస్మోగ్రాం (భూకంప లేఖిని) పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొండ ప్రాంతం కాబట్టి భూమి పొరల్లో సర్దుబాటు కారణంగా ప్రకంపనలు వచ్చినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

adjustment in land layers at hill area said by scientist
బోరబండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూప్రకంపనలను గుర్తించేలా..

జూబ్లీహిల్స్‌ పరిధిలోని బోరబండ తదితర ప్రాంతాల్లో కిలోమీటరు మేర భూకంప పరిధి విస్తరించి ఉందని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు గుర్తించారు. భూ ప్రకంపనలు మాత్రం 2 కి.మీ. లోపు ఉన్నాయని తేల్చారు. శుక్రవారం రాత్రి 8.30-11.30 గంటల మధ్య భారీ శబ్దాలతో సుమారు 15 సార్లు భూమి కంపించడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన సంగతి తెలిసిందే. తీవ్రత 1.5గా ఎన్‌జీఆర్‌ఐలోని భూకంపాల ప్రయోగశాలలో నమోదైంది. బోరబండ చుట్టుపక్కల భూప్రకంపనలను గుర్తించేందుకు మూడు చోట్ల సిస్మోగ్రాం (భూకంప లేఖిని) పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

భయపడాల్సిన పనిలేదన్న శాస్త్రవేత్తలు

హైదరాబాద్‌ భూకంపాల ముంపు పెద్దగా లేని జోన్‌-2లో ఉంది. అప్పుడప్పుడు చిన్న చిన్న భూప్రకంపనలు వస్తున్నాయి. కొన్నిమార్లు వచ్చినట్లు కూడా తెలియదు. బోరబండ, జూబ్లీహిల్స్‌లో ఇప్పటి వరకు ఎక్కువసార్లు వచ్చాయి. గండిపేట, వనస్థలిపురం, సరూర్‌నగర్‌, మేడ్చల్‌ ప్రాంతాల్లోనూ స్వల్ప భూకంపాలు వచ్చాయి.

గతంలో భూకంపాలు (రిక్టర్‌ స్కేలుపై)

  • 1982 : గండిపేట 3.2 తీవ్రత
  • 1996: వనస్థలిపురం 3.5
  • 2017లో 2 నెలల వ్యవధిలో: బోరబండలో 135 సార్లు భూప్రకంపనలు (1.5)
  • 1984- 2017 నవంబరు వరకు జూబ్లీహిల్స్‌లో 979 సార్లు సూక్ష్మ భూప్రకంపనలు

ఆగని శబ్దాలు.. తొలగని భయాలు

బోరబండలో వింత శబ్దాలు ఆగలేదు. శుక్రవారం రాత్రి వచ్చినట్లుగానే శనివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు కూడా భూమిలో బాణసంచా పేల్చినట్లు, గట్టి పదార్థాన్ని దంచినట్లు వింత శబ్దాలు వస్తుండటంతో బోరబండ, ఎస్పీఆర్‌ హిల్స్‌ వాసులను భయం వీడలేదు. శనివారం శబ్దాల తీవ్రత తగ్గిందని స్థానికులు చెబుతున్నారు. ఎక్కువగా ఆరుబయటే మంచాలు వేసుకొని ఉంటున్నారు. కొందరు ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు.

జీహెచ్‌ఎంసీ ఉపమేయర్‌ బాబాఫసియుద్దీన్‌ శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇంటింటికీ తిరుగుతూ భయపడాల్సిన అవసరం లేదని, భూకరపం రాలేదని ప్రజలకు భరోసా కల్పించారు. జూబ్లీహిల్స్‌ సీఐ సత్తయ్య, ఎస్‌ఐలు శేఖర్‌, యాకన్నలు మైకు ప్రచారం చేస్తూ ఆ ప్రాంతంలో వాహనాల్లో తిరిగారు. స్థానికుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అయినా ఇక్కడ ఏ ఇద్దరు కలిసినా ఈ శబ్దాల గురించే చర్చించుకోవడమే కన్పించింది.

నగరంలో 3.5 తీవ్రత దాటలేదు..

హైదరాబాద్‌ జోన్‌-2లో సురక్షితంగా ఉంది. 55 ఏళ్ల తమ పరిశీలనలో ఇక్కడ భూకంపాల తీవ్రత 3.5 దాటలేదు. బోరబండలో 2017లోనూ భూకంపాలు వచ్చాయి. అప్పుడూ అధ్యయనం చేశాం. ప్రస్తుతం మాదిరే అప్పుడూ అక్టోబరు, నవంబరుల్లోనే 135 సార్లు భూమి కంపించింది. బోరబండలో ఎక్కువ రాతినేలలున్నాయి. - డాక్టర్‌ శ్రీ నగేశ్‌, ప్రధాన శాస్త్రవేత్త, ఎన్‌జీఆర్‌ఐ

ప్రమాదం లేదు..

బోరబండ అధిక భాగం కొండ ప్రాంతం. అక్కడ వచ్చిన భూ ప్రకంపనలతో ఎలాంటి ప్రమాదం లేదు. కొండ ప్రాంతం కాబట్టి భూమి పొరల్లో సర్దుబాటు కారణంగా ఇలా జరుగుతుంటాయి.- ప్రదీప్‌ రామన్‌చర్ల, భూకంప శాస్త్ర ఇంజినీరింగ్‌ ఆచార్యులు, ట్రిపుల్‌ఐటీ.

ఇవీ చూడండి:దుర్గం చెరువు తీగల వంతెనపై ఆంక్షలేమిటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.