ETV Bharat / city

KTR at E-Governance 2022: 'రాష్ట్రంలో ఈ-పాలనతో పాటు మొబైల్​-గవర్నెన్స్​కూ ప్రాధాన్యత' - E-Governance 2022 Conference

KTR at E-Governance 2022: ఈ-గవర్నెన్స్​తో పాటు తెలంగాణ రాష్ట్రం.. మొబైల్-గవర్నెన్స్​కు కూడా అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో ఆయన అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ-గవర్నెన్స్​ 2022 జాతీయ సదస్సులో మాట్లాడారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్న కేటీఆర్.. ఐటీఆర్​ ప్రాజెక్టు గురించి కేంద్రం పునరాలోచించాలని కోరారు.

KTR at E-Governance 2022
KTR at E-Governance 2022
author img

By

Published : Jan 7, 2022, 12:08 PM IST

Updated : Jan 8, 2022, 7:30 AM IST

రాష్ట్రంలో ఈ-పాలనతో పాటు మొబైల్​-గవర్నెన్స్​కూ ప్రాధాన్యత

KTR at E-Governance 2022: ఎలక్ట్రానిక్ సర్వీసుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ-పాలనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో కేటీఆర్ అధ్యక్షతన ఈ-గవర్నెన్స్ 2022 జాతీయ సదస్సు నిర్వహించారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఈ సెమినార్​ను ప్రారంభించారు.

24వ ఈ-గవర్నెన్స్ సదస్సు..

KTR at E-Governance 2022 Seminar: ఇవాళ, రేపు హెచ్​ఐసీసీలో 24వ జాతీయ ఈ-పాలన సదస్సు జరగనుంది. కరోనా అనంతర పరిస్థితుల్లో ఈ-పాలనపై ఇందులో చర్చించారు. ఆత్మనిర్భర్ భారత్, ప్రజా సేవల విస్తరణ, ఆవిష్కరణలు, నవీన సాంకేతికతలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై చర్చిస్తున్నారు. చర్చ అనంతరం ఈ-పాలన పురస్కారాలు-2021 ప్రదానం చేస్తారు.

ఆవిష్కరణలకు ప్రాధాన్యం..

E-Governance 2022 Seminar: తెలంగాణలో ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో శరవేగంగా ఐటీ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పలు రాష్ట్రాలతో కలిసి తమ పరిశోధన ఫలాలను పంచుకునేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని అన్నారు.

ఎం-గవర్నెన్స్​కు ప్రాముఖ్యత..

'సామాజిక స్పృహలేని సాంకేతికత వ్యర్థం. డిజిటల్ లావాదేవీల కోసం తెలంగాణ టీ-వ్యాలెట్ తీసుకొచ్చింది. ఈ-గవర్నెన్స్​తో పాటు ఎం-గవర్నెన్స్(మొబైల్-గవర్నెన్స్)కు మన రాష్ట్రం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఎమర్జింగ్ టెక్నాలజీలను పలు ప్రభుత్వ శాఖల పనితీరులో భాగం చేసి సమస్యలు, సవాళ్లకు చెక్​ పెట్టాం. స్మార్ట్ ఫోన్ ద్వారా సిటిజెన్ సర్వీసులను అందజేస్తున్నాం. ఫెస్ట్ యాప్​ ద్వారా 17 సేవలను రవాణా శాఖ ద్వారా అందిస్తున్నాం.'

- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

దేశంలో డిజిటల్‌ విప్లవం ప్రజల జీవనశైలిలో అంతర్భాగం అయిందని కేంద్ర శాస్త్ర, సాంకేతికాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అన్నారు. ప్రజలు సులభతరంగా జీవించేలా చేయడమే ఈ-పరిపాలన ముఖ్య ఉద్దేశమన్నారు. అంతర్జాతీయ సూచికల స్థాయిలో తెలంగాణలో ఈ-పరిపాలన ప్రాజెక్టుల అమలుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

‘కరోనా అనంతరం ప్రపంచంలో డిజిటల్‌ పాలన- భారతదేశం పాత్ర’ పేరిట హైదరాబాద్‌లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న 24వ జాతీయ ఈ-పరిపాలన సదస్సును తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి శుక్రవారం కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం జితేంద్రసింగ్‌ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారితో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను అవకాశంగా మలుచుకుని ఈ-పరిపాలనతో ప్రజలకు మెరుగైన సేవలందించామన్నారు. తెలంగాణలో అమలవుతున్న జనహిత ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమన్నారు. అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్‌ సంస్థలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అంతరిక్ష పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఈ జాబితాలో హైదరాబాద్‌ కూడా ఉందని పేర్కొన్నారు.

స్పేస్ సెంటర్..

E-Governance 2022 Conference in Hyderabad : హైదరాబాద్‌లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, గతంలో ఇక్కడ కేటాయించి రద్దు చేసిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును పునఃపరిశీలించాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏడేళ్లలో ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్ల నుంచి రూ.1.45 లక్షల కోట్లకు చేరాయన్నారు. రాష్ట్రానికి మంజూరైన రెండు ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్లలో తయారీ మొదలైందని, ‘భారత్‌లో తయారీ’లో భాగంగా మరో రెండు క్లస్టర్లు మంజూరు చేయాలన్నారు. భారత అంతరిక్ష పరిశోధనలో హైదరాబాద్‌కు భాగస్వామ్యం ఉందని, చంద్రయాన్‌ ప్రాజెక్టులో 30 శాతం పరికరాలు ఇక్కడి పరిశ్రమల్లోనే ఉత్పత్తయ్యాయని చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ-పరిపాలనలో తెలంగాణ దేశంలోనే నం.1గా కొనసాగుతోందని, రెండేళ్ల క్రితమే పింఛనుదారుల కోసం సెల్ఫీ ఆధారిత డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌తో కలిసి ఈ-పరిపాలనలో మెరుగైన పౌరసేవలందిస్తున్న పలు రాష్ట్రాల ప్రాజెక్టులకు పురస్కారాలు అందజేశారు. సదస్సులో కేంద్ర ఐటీశాఖ కార్యదర్శి అజయ్‌ప్రకాష్‌ సాహ్నీ, కేంద్ర పరిపాలన సంస్కరణలు, ప్రజాఫిర్యాదుల కార్యదర్శి వి.శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శి ఎన్‌బీఎస్‌ రాజ్‌పుత్‌, తెలంగాణ ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌, జాతీయ ప్రజాపరిపాలన కేంద్ర డీజీ సురేంద్రనాథ్‌ త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు.

Last Updated : Jan 8, 2022, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.