సాంకేతికత, ఆటోలు, ద్విచక్ర వాహనాలు లేని రోజుల్లో సరైన రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడేవారు. ఆ కాలంలో గుర్రం బండ్లే రవాణా సాధనాలు. అందుకే వాటికి మంచి డిమాండ్ ఉండేది.
ఇప్పుడా బండ్లేవీ..
కాలక్రమంలో ఆ బండ్లు కనుమరుగైపోయాయి. అయినా దాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లికి చెందిన చిన సత్యం. పూర్వ నుంచి ఈయనకు గుర్రపు బండే జీవనాధారం. ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు లేక బండి బోసిబోయింది. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా తన గుర్రపు బండిని సరుకు రవాణా చేసే బండిగా మార్పులు చేసి జీవిస్తున్నాడు.