ETV Bharat / city

TDP Leaders arrest in Amaravathi: తారస్థాయికి తెదేపా, వైకాపా నేతల ఆరోపణలు - వైసీపీ వర్సెస్ టీడీపీ

TDP Leaders arrest in Amaravathi: ఏపీ గుంటూరు జిల్లా అమరావతిలో తెదేపా, వైకాపా నేతల సవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి. తెదేపా, వైకాపా నేతల పరస్పర ఆరోపణలు తారస్థాయికి చేరాయి.

Amaravathi
Amaravathi
author img

By

Published : Jan 23, 2022, 4:49 PM IST

తారస్థాయికి తెదేపా, వైకాపా నేతల ఆరోపణలు

TDP Leaders arrest in Amaravathi: గుంటూరు జిల్లా అమరావతిలో తెదేపా, వైకాపా నేతల సవాళ్లతో రాజకీయాలు వేడెక్కాయి. తెదేపా, వైకాపా నేతల పరస్పర ఆరోపణలు తారస్థాయికి చేరాయి. వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రభుత్వం ప్రజలకి సుపరిపాలన అందించడంలో విఫలమైందని ఇటీవల జరిగిన ఒక సభలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి తెదేపా నేత మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు.

మాజీ శాసన సభ్యుడు శ్రీధర్ వ్యాఖ్యలను వైకాపా నేతలు ఖండించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మండలం లేమల్లే గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జరిగాయని ఆరోపించారు. వాటిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైకాపా సవాల్‌ను స్వీకరించి, లేమల్లె గ్రామానికి బయల్దేరిన తెదేపా శ్రేణులను అమరావతిలో పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పరస్పర సవాళ్లతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:

E-Nomination‌: ఈ-నామినేషన్ చేయకపోతే.. ఈపీఎఫ్‌ సేవలు బంద్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.