ఈశాన్య, తూర్పు భారతం నుంచి శీతలగాలులు తెలంగాణ వైపు వీస్తున్నందున రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణంకన్నా 5 డిగ్రీలకు పైగా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 4.3 డిగ్రీలు, కుమురం భీం జిల్లాలో గిన్నెధరిలో 4.4 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాల పరిధిలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. రాత్రిపూట, తెల్లవారుజామున పొగమంచు అధికంగా కురుస్తోంది. ఈ సమయంలో ప్రయాణాలు ప్రమాదకరమని, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ఇవీచూడండి: చలి పంజా: నెహ్రూ జూపార్కులో మూగజీవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు