ETV Bharat / city

'వైఎస్​ను నేను తిట్టలేదు.. కించపరచలేదు' - వైఎస్​పై రఘునందన్​రావు వ్యాఖ్యలు

వైఎస్​ఆర్​ అభిమానులకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు క్షమాపణలు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని కించపరిచేలా తాను ఎప్పుడు మాట్లాడలేదని అన్నారు. వైఎస్​ కుటుంబంపై తనకి గౌరవం ఉందన్నారు.

'వైఎస్​ను నేను తిట్టలేదు.. కించపరచలేదు'
'వైఎస్​ను నేను తిట్టలేదు.. కించపరచలేదు'
author img

By

Published : Nov 23, 2020, 4:01 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై గురించి చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు వివరణ ఇచ్చారు. ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ధర్మం, కేసీఆర్ చెప్పే మాటల గురించి మాట్లాడుతున్న సందర్భంలో.. గతంలో కేసీఆర్ వైఎస్ గురించి మాట్లాడిన ఒక మాటను ఊటంకిచానని అన్నారు. దానిని గుర్తుచేస్తూ కేసీఆర్​ కుటుంబాన్ని హెచ్చరించానని వివరించారు.

ఆ మాట వల్ల వైఎస్​ అభిమానులు నొచ్చుకున్నట్టు తెలిసింది. నేను ఎప్పుడు రాజశేఖరరెడ్డిని తిట్టలేదు..కించపర్చలేదు. నాకు ఆ కుటుంబం పై గౌరవం ఉంది. ఒకవేళ పొరపాటున అర్ధం చేసుకుంటే నేను విచారం వ్యక్తం చేస్తున్నా. - రఘునందన్​రావు, దుబ్బాక ఎమ్మెల్యే.

ఇవీ చూడండి: తెరాసది మాటల రాజకీయం... భాజపాది చేతల రాజకీయం: కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.