ETV Bharat / city

ఉత్కంఠ భరితంగా సాగిన దుబ్బాక ఉపపోరు లెక్కింపు.. - దుబ్బాక ఉప ఎన్నికల లెక్కింపు పూర్తి

ఉత్కంఠగా సాగిన దుబ్బాక ఉపపోరులో భాజపా అభ్యర్థి మాధవనేని రఘునందన్​ రావు విజయం సాధించారు. మొదటి నుంచి రఘునందన్​ రావు ఆధిక్యత కనబరిచారు. మధ్యమధ్యలో తెరాస అభ్యర్థి రౌండ్ల వారీగా ఆధిక్యత కనబరిచినప్పటికీ... రఘునందన్​ రావును దాటలేకపోయారు. చివరికి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి... కేవలం 12వ రౌండ్​లో మాత్రమే ఆధిక్యత కనబరిచారు.

dubbaka by election counting complete with heavy suspence
ఉత్కంఠభరితంగా సాగిన దుబ్బాక ఉపపోరు లెక్కింపు..
author img

By

Published : Nov 10, 2020, 5:27 PM IST

Updated : Nov 10, 2020, 8:13 PM IST

వదుబ్బాకలో ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి రఘునందన్​ రావు విజయం సాధించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నియోజకవర్గవ్యాప్తంగా పోలైన మొత్తం లక్షా 64వేల192 ఓట్లను అధికారులు లెక్కించారు. మొదటి రౌండ్​లో 7వేల 446 ఓట్లు లెక్కించగా... 341 ఓట్లతో రఘునందన్ రావు ఆధిక్యత సాధించారు. భాజపా అభ్యర్థికి 3వేల 208 ఓట్లు, తెరాస అభ్యర్థి సుజాతకు 2వేల 867, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి 648 పోల్ అయ్యాయి. రెండో రౌండ్‌లోనూ భాజపాదే పైచేయిగా నిలిచింది. ఈ రౌండ్​లో 7వేల 127 ఓట్లకు గానూ... భాజపా అభ్యర్థికి 3వేల 284 ఓట్లు, సుజాతకు 2వేల 490, శ్రీనివాస్ రెడ్డికి 667 ఓట్లు వచ్చాయి.

మూడో రౌండ్​లో 6వేల 601 ఓట్లు లెక్కించగా... రఘునందన్ రావుకు 2వేల 731 ఓట్లు, సుజాతకు 2వేల 607, శ్రీనివాస్ రెడ్డికి 616 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండ్​లో 6వేల 900 ఓట్లు లెక్కించగా... 3వేల 832 ఓట్లు సాధించి 14వందల 25 ఓట్లతో రఘునందన్ రావు ఆధిక్యత సాధించారు. సుజాత 2వేల 407, కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి 227 ఓట్లు సాధించారు. వరసగా 5 రౌండ్లలోనూ భాజపా ఆధిక్యం కనబర్చింది. ఐదో రౌండ్​లో రఘునందన్ రావు 3వేల 462 ఓట్లు రాగా... 336 ఓట్లు ఆధిక్యం వచ్చాయి. ఈ రౌండ్​లో 7వేల 922 ఓట్లు లెక్కించగా... భాజపా అభ్యర్థికి 3వేల 462 ఓట్లు రాగా... తెరాస అభ్యర్థి 3వేల 126 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి 566 ఓట్లు వచ్చాయి.

తెరాస ఆధిక్యం

అనంతరం వెలువడిన 6,7 రౌండ్లలో తెరాసకు ఆధిక్యం లభించింది. ఆరో రౌండ్​లో 9వేల 179 ఓట్లు లెక్కించగా... తెరాసకు 4వేల 62, భాజపాకు 3వేల709, కాంగ్రెస్​కు 530 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్​లో తెరాసకు 353 ఓట్ల ఆధిక్యం రాగా... మొత్తం 6 రౌండ్లు ముగిసేసరికి భాజపా 2 వేల 667 ఓట్ల ఆధిక్యం ప్రదర్శించింది. ఏడో రౌండ్​లో 6వేల 880 ఓట్లు లెక్కించగా... తెరాసకు 2 వేల 718 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్​లో 2 వేల 536 ఓట్లతో భాజపా అభ్యర్థి రెండో స్థానంలో నిలవగా... 749 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు.

8,9 రౌండ్లలో భాజపా పుంజుకుంది. ఎనిమిదో రౌండ్​లో మొత్తం 7వేల 6వందల ఓట్లు లెక్కించారు. ఇందులో భాజపా అభ్యర్థికి 3 వేల 116 ఓట్లు రాగా... 621 ఆధిక్యత సాధించారు. తెరాస అభ్యర్థి 2 వేల 495 ఓట్లతో రెండో స్థానంలో... కాంగ్రెస్ అభ్యర్థి11వందల 22 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. తొమ్మిదో రౌండ్లలోనూ కమలం అభ్యర్థిదే పైచేయిగా నిలిచింది. ఇందులో భాజపా 3 వేల 413 ఓట్లు సాధించి వెయ్యి 84 ఓట్ల ఆధిక్యత కనబర్చారు. తెరాసకు 2వేల 329 ఓట్లు, కాంగ్రెస్​కు 675 ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్ ఆధిక్యం

పదో రౌండ్​లో ఆధిక్యత కనబర్చిన తెరాస... 11వ రౌండ్​లో వెనకబడ్డారు. 10వ రౌండ్​లో 7 వేల 233 ఓట్లకు గానూ... తెరాసకు 2వేల 948 ఓట్లు రాగా... 456 ఆధిక్యత సాధించారు. భాజపా అభ్యర్థికి 2 వేల 492, కాంగ్రెస్ అభ్యర్థికి 899 ఓట్లు పోలయ్యాయి. 11వ రౌండ్​లో 8వేల 463 ఓట్లు ఉండగా.... భాజపా అభ్యర్థికి 2వేల 965 ఓట్లు సాధించి... కమలం పార్టీ 199 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. తెరాస అభ్యర్థికి ఈ రౌండ్​లో 2 వేల 766 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థికి వెయ్యి 883 ఓట్లు పోలయ్యాయి. 12వ రౌండ్​లో 2 వేల 80 ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి... 83 ఓట్లతో ఆధిక్యత కనబర్చారు. ఈ రౌండ్​లో 19 వందల 97 ఓట్లతో రఘునందన్ రావు రెండో స్థానంలో నిలవగా... 19 వందల ఓట్లతో తెరాస మూడోస్థానంలో నిలిచింది.

13వ రౌండ్ నుంచి తెరాస ఆధిక్యత

13వ రౌండ్ నుంచి వరసగా తెరాస ఆధిక్యత సాధించింది. 13వ రౌండ్​లో తెరాస అభ్యర్థి 2 వేల 824 ఓట్లు రాగా... 304 ఓట్లతో ఆధిక్యత కనబర్చారు. భాజపా అభ్యర్థికి 2 వేల 520, కాంగ్రెస్​కు 12 వందల 12 ఓట్లు పోలయ్యాయి. 14వ రౌండ్​లో తెరాసకు 2 వేల 537 ఓట్లు లభించాయి. ఈ రౌండ్​లో ఆ పార్టీ 288 ఆధిక్యం కనబర్చింది. భాజపా అభ్యర్థికి 2 వేల 249 ఓట్లు, కాంగ్రెస్‌కు 784 ఓట్లు వచ్చాయి. 15 వ రౌండ్‌లో తెరాసకు 3 వేల 27 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్​లో ఆ పార్టీ 955 ఆధిక్యం కనబరిచింది. భాజపా అభ్యర్థికి 2 వేల 72 ఓట్లు... కాంగ్రెస్​కు 15వందల ఓట్లు వచ్చాయి.

16వ రౌండ్​లో తెరాసకు 749 ఓట్ల ఆధిక్యం లభించింది. 3 వేల 157 ఓట్లు రాగా... భాజపాకు 2 వేల 408 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్​కు 674 ఓట్లు పోలయ్యాయి. 17వ రౌండ్​లో తెరాస 872 ఓట్ల ఆధిక్యత కనబర్చింది. అధికార పార్టీకి 2వేల 818 ఓట్లు రాగా... భాజపాకు 19వందల 46 ఓట్లు, కాంగ్రెస్​కు 17వందల 5 ఓట్లు పోలయ్యాయి. 18వ రౌండ్​లో తెరాస 688 ఓట్ల ఆధిక్యత కనబర్చింది. ఈ రౌండ్​లో గులాబీ పార్టీ 3 వేల 215 ఓట్లు సాధించగా... భాజపాకు 2వేల 527 ఓట్లు, కాంగ్రెస్​కు 852 ఓట్లు వచ్చాయి. 19వ రౌండ్​లో తెరాసకు 2వేల 760 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్​లో 425 ఓట్లతో ఆ పార్టీ ఆధిక్యతను కనబర్చింది. భాజపాకు 2 వేల 335 ఓట్లు, కాంగ్రెస్​కు 976 ఓట్లు పోలయ్యాయి.

భాజపాకే పట్టం..

20వ రౌండ్​లో మళ్లీ భాజపా ఆధిక్యంలోకి వచ్చింది. ఈ రౌండ్​లో 2వేల 931 ఓట్లతో ఆ పార్టీ అభ్యర్థి... 491 ఓట్లతో మళ్లీ ముందుకొచ్చారు. తెరాస అభ్యర్థి 2 వేల 440, కాంగ్రెస్ అభ్యర్థి వెయ్యి 58 ఓట్లు సాధించారు. 21వ రౌండ్​లో 380 ఓట్లతో భాజపా ఆధిక్యత కనబర్చింది. ఈ రౌండ్​లో భాజపాకు 2వేల 428 ఓట్లు రాగా... తెరాసకు 2వేల 48 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్​కు 845 ఓట్లు పోలయ్యాయి. 22వ రౌండ్​లో కమలం పార్టీ 438 ఆధిక్యం కనబర్చింది. ఈ రౌండ్​లో భాజపాకు 2వేల 958 ఓట్లు రాగా... తెరాసకు 2వేల 520 ఓట్లు, కాంగ్రెస్​కు 971 ఓట్లు పోలయ్యాయి. 23వ రౌండ్​లో 3 వేల 895 ఓట్లకు గానూ... 1653 ఓట్లతో భాజపా అధిక్యత కనబరిచింది. తెరాస 1241, కాంగ్రెస్ 580 ఓట్లు పొందాయి. ఉత్కంఠగా సాగిన ఉపపోరులో 62,772 ఓట్లు సాధించి 1,079 ఓట్ల మెజారిటీతో భాజపా అభ్యర్థి రఘునందన్​ రావు విజయం సాధించారు. 61,302ఓట్లతో తెరాస అభ్యర్థి సుజాత రెండో స్థానం, 21,819 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.

ఇదీ చూడండి: దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా విజయం

Last Updated : Nov 10, 2020, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.