ETV Bharat / city

డ్రగ్స్​: వ్యసనం.. వ్యాపారం.. అరెస్ట్​ - hyderabad police arrested drug dealer

ఉపాధి కోసం వచ్చి.. డ్రగ్స్​ విక్రయిస్తున్న రాజస్థాన్​కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. కరోనాతో ఉపాధి కోల్పోయి.. అప్పటికే ఓపీఎం డ్రగ్‌కు అలవాటు పడడంతో దాన్నే విక్రయించి డబ్బు సంపాదించాలని పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు.

drugs cases
డ్రగ్స్​: వ్యవసం.. వ్యాపారం.. అరెస్ట్​
author img

By

Published : Sep 24, 2020, 12:20 PM IST

Updated : Sep 24, 2020, 12:46 PM IST

రాజస్థాన్‌లోని భీన్‌మల్‌ జిల్లాకు చెందిన దినేశ్‌కుమార్‌.. ఉపాధి కోసం నగరానికి వచ్చి కాప్రాలోని ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్నాడు. నాగోల్‌లో ఓ స్టీల్స్‌లో కార్మికుడిగా పనిచేసేవాడు. కరోనా మూలంగా ఉపాధి కోల్పోయాడు. అప్పటికే ఓపీఎం డ్రగ్‌కు అలవాటు పడడంతో దాన్నే విక్రయించి డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. రాజస్థాన్‌లో లభించే ఓపీఎం డ్రగ్‌ను నగరానికి తీసుకొచ్చి ఒక్కో గ్రాముకు రూ.1,400 నుంచి రూ.1,600 వరకు విక్రయిస్తున్నాడు.

నల్లకుంట పరిధిలో సరఫరా చేస్తున్నాడని సమాచారం అందగానే బుధవారం దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఎస్సైలు వి.నరేందర్‌, ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ తకీవుద్దీన్‌ బృందంతోపాటు నల్లకుంట పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారని టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ గుమ్మీ చక్రవర్తి తెలిపారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం నల్లకుంట పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి 150 గ్రాములు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు

ఇవీచూడండి: గుప్తనిధుల కోసం తవ్వకాలు.. పోలీసులకు అప్పగించిన గ్రామస్థులు

Last Updated : Sep 24, 2020, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.