ETV Bharat / city

Traffic Rules: 'ట్రాఫిక్​ రూల్స్​పై కనీస అవగాహన లేకుండానే లైసెన్స్ వస్తోంది. అందుకే...'

author img

By

Published : Dec 19, 2021, 3:55 PM IST

Traffic Rules: ట్రాఫిక్ రూల్స్​పై కనీస అవగాహన లేకుండానే చాలా మంది బండ్లను రోడ్లపైకి తీసుకొస్తున్నారు. దీంతో ప్రమాదాలకు కారకులవుతున్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? రోడ్డు ప్రమాదాల నివారణలో రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీసుల ఏవిధంగా వ్యవహరించాలి, పౌరుల పాత్ర ఏంటి? అనే అంశంపై అనేక సదస్సులలో మాట్లాడమే కాకుండా... ట్రాఫిక్ రూల్స్​పై "కార్ డ్రైవింగ్ స్కూల్ మాన్యువల్ ఫర్ ఇండియా'' పేరుతో రవాణా రంగ నిపుణులు నరేశ్​ రాఘవన్ ఓ పుస్తకమే రాశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై నరేశ్​ రాఘవన్​తో ఈటీవి భారత్ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్​ ముఖాముఖి...

Traffic Rules
Traffic Rules
రవాణా రంగ నిపుణులు నరేశ్​ రాఘవన్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

Traffic Rules: ప్రశ్న : మన రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఏ కారణాల వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి...? డ్రైవింగ్ లైసెన్స్ జారీ ఎలా ఉంది..?

జవాబు : ఏమాత్రం రూల్స్ తెలియని వారికి కూడా రవాణాశాఖ డ్రైవింగ్ లైసెన్స్​ను అందజేస్తోంది. యూరఫ్‌, అమెరికా వంటి దేశాల్లో లైసెన్స్ పొందాలంటే అనేక పుస్తకాలు చదవాలి. శిక్షణ తీసుకోవాలి. అప్పుడు పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూల్స్ సమగ్రంగా తెలిసిన వారికే అక్కడ లైసెన్స్ వస్తుంది. ఇక్కడ మాత్రం అలా కాదు.. ఎటువంటి రూల్స్ తెలియకుండానే బండ్లు బయటకు తీస్తున్నారు. ఆధార్ కార్డు మన హక్కు కానీ.. డ్రైవింగ్ లైసెన్స్ మన హక్కు కాదు. మనం రూల్స్ నేర్చుకోవాలి అనే అవగాహన ప్రజల్లో కూడా రావాలి.

ప్రశ్న : ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో ఏమైనా మార్పులు చేయాలని మీరు భావిస్తున్నారా?

జవాబు : ఎవరు లైసెన్స్​కు దరఖాస్తు చేసుకున్నా.. సరే వారికి ఇవ్వాలనే ఆలోచనలో రవాణాశాఖ అధికారులు ఉన్నారు. లైసెన్స్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి ఇవ్వకూడదు. అక్కడ కొంచెం ఫిల్టర్ చేసి కంట్రోల్ చేస్తే ప్రజల్లో కూడా అవగాహన వస్తుంది.

ప్రశ్న : ఇప్పటికే లైసెన్స్ తీసుకునే విధానంలో పరీక్షలు పెడుతున్నారు. వాహనాలకు డ్రైవింగ్ టెస్ట్ పెడుతున్నారు. అయినప్పటీకీ వాహనదారుల్లో మార్పు రావడంలేదంటే... అందులో లోపాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా...?

జవాబు : చాలా మంది పరీక్షలు రాసేప్పుడు ఏజెంట్లను మధ్యవర్తులను సంప్రదిస్తున్నారు. వాళ్ల సహాయంతో పాస్ అవుతున్నారు. వాహన డ్రైవింగ్ కూడా ఒక చిన్న గ్రౌండ్​లో ఉంటుంది. కానీ.. బయట దేశాల్లో ఆ విధంగా ఉండదు. రోడ్డుమీదనే డ్రైవింగ్ టెస్ట్ పెడతారు. డ్రైవింగ్ రావడం సగం... ట్రాఫిక్ రూల్స్ తెలియడం మరో సగం మొత్తం కలిపితేనే సంపూర్ణం అవుతుంది.

ప్రశ్న : పాదాచారులు, ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరు ప్రమాదాల బారిన పడకుండా ఏవిధంగా అవగాహన కల్పించాలి...?

జవాబు : చాలా మంది పాదాచారులు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లనే ప్రమాదాల బారినపడుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పడకుండానే పాదాచారులు దాటి వెళుతున్నారు. అందువల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు సైతం ట్రాఫిక్ రూల్స్ పాటించడంలేదు.

ప్రశ్న : సిగ్నల్ జంపింగ్​లు చేసేవారి వల్ల, రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి..వీటిని ఏవిధంగా నిరోధించవచ్చు..?

జవాబు : ఓపిక, సహనం లేకపోవడం వల్లనే చాలా మంది సిగ్నల్ జంపింగ్​లు, రాంగ్ రూట్ డ్రైవింగ్​లు చేస్తుంటారు. అందువల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ప్రమాదాల నుంచి తప్పించుకున్నా... ఎప్పటికైనా ప్రమాదాల బారిన మాత్రం పడాల్సి వస్తుంది. ఒక్క ప్రమాదం వల్ల మంచానికే పరిమితం కావాల్సి వస్తుంది.

ప్రశ్న : ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే.. రవాణాశాఖ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ట్రాఫిక్ పోలీసుల పాత్ర ఏవిధంగా ఉండాలి? పౌరులు ఏవిధంగా సహకరించాలి..?

జవాబు : రోడ్ సేఫ్టీ అంటే...అందరి సహకారం ఉండాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ నేర్చుకోవాలి. మంచి శిక్షణ సంస్థ వద్ద డ్రైవింగ్​లో శిక్షణ తీసుకోవాలి. ప్రభుత్వం రోడ్లపై మార్కింగ్​లను ఏర్పాటు చేయాలి. లైసెన్స్​లు ఇచ్చేప్పుడు రవాణాశాఖ అధికారులు కఠినంగా వ్యవరించాలి. అందరు సమష్టిగా సహకరిస్తేనే రోడ్డు ప్రమాదాలు నివారించగలం. డ్రైవింగ్ సేఫ్టీని పాఠ్యాంశంలో చేర్చాలి. అప్పుడే అందరూ రూల్స్​ను పాటిస్తారు.

ఇవీ చదవండి : రెండు ముక్కలైన కారు.. ముగ్గురు ప్రాణాలను బలిగొన్న మత్తు, అతివేగం

దర్గా నుంచి తిరిగొస్తుండగా ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.