ETV Bharat / city

డా. దువ్వూరు ద్వారకనాథరెడ్డికి అరుదైన గౌరవం.. వారం వ్యవధిలో 2 అవార్డులు - వారం వ్యవధిలో 2 అవార్డులు

Lifetime Achievement Award: హైదరాబాద్​కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ దువ్వూరు ద్వారకనాథరెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఒక వారం వ్యవధిలోనే రెండు ప్రతిష్టాత్మకమైన సంస్థలు.. లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఇలా రెండు అవార్డులు అందుకున్న తొలి వ్యక్తి దువ్వూరు ద్వారకనాథరెడ్డి కావటం విశేషం.

Dr Duvvuru Dwarakanathareddy got Two Life Time Achievement Awards

author img

By

Published : Jan 10, 2022, 4:34 AM IST

డా. దువ్వూరు ద్వారకనాథరెడ్డికి అరుదైన గౌరవం.. వారం వ్యవధిలో 2 అవార్డులు

Lifetime Achievement Award: హైదరాబాద్​కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ దువ్వూరు ద్వారకనాథరెడ్డికి రెండు ప్రతిష్టాత్మకమైన సంస్థలు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును అందజేశాయి. ది అసోసియేషన్‌ ఆఫ్‌ ఓటోలెరంగాలజిస్ట్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అనే రెండు సంస్థలు ఒక వారం వ్యవధిలోనే లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇలా రెండు ప్రతిష్టాత్మకమైన సంస్థల నుంచి అవార్డులు అందుకున్న తొలి వ్యక్తి డాక్టర్‌ దువ్వురు ద్వారాకనాథరెడ్డి.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు సంస్థలకు చెందిన ప్రతినిధులు ఒకే వేదికపై డాక్టర్‌ దువ్వూరును ఘనంగా సత్కారించాయి. ఈ కార్యక్రమంలో ఆపి (అమెరికన్‌ అసోసియయేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజన్‌) ఎలక్టెడ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కొల్లి రవి, ఐఎంఏ తెలంగాణ ప్రతినిధులు డాక్టర్‌ సురేంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

రెండు ప్రతిష్టాత్మకమైన సంస్థలు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు అందుకోవటం చాలా ఆనందంగా ఉందని డాక్టర్‌ దువ్వూరు ద్వారాకనాథరెడ్డి అన్నారు. 40 ఏళ్ల వైద్య జీవితంలో అటు వైద్యులతో, ఇటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేశానన్నారు. తెలంగాణ నుంచి ఈ అవార్డులు అందుకుంటున్న తొలి వ్యక్తి తానే కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా నేపథ్యంలో ఏవోఐ సంస్థ ఈ అవార్డును వర్చువల్‌గా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.