కొవిడ్‌పై పోరుకు ముఖ్యమంత్రి సహాయనిధికి దాతలు ఇవాళ విరాళాలు అందించారు. మొత్తం రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలను 15 మంది దాతలు మంత్రి కేటీఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. నార్నే ఎస్టేట్స్ సీఈవో గోకుల్ యాభై లక్షల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ 25 లక్షలు, రానే గ్రూపు 30 లక్షలు, నెక్టర్ థెరపెటిక్స్ ఇండియా 15 లక్షలు, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున కందాల పాపిరెడ్డి 11 లక్షలు, తెలంగాణ స్టేట్ బీడీ లీవ్స్ ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఎనిమిది లక్షలు, ఫతే మైదాన్ క్లబ్ ఆరు లక్షల రూపాయలను సీఎం సహాయనిధికి అందించారు.
సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సైనర్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్వామి వివేకానంద సేవా సమితి 5 లక్షల చొప్పున విరాళాలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.
ఇవీ చూడండి: తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్‌జోన్ జిల్లాలివే...