ETV Bharat / city

DISPUTE BETWEEN FISHERMEN : రింగు వలల వివాదం.. పోలీసు వలయంలో ఆ గ్రామాలు - తెలంగాణ వార్తలు

DISPUTE BETWEEN FISHERMEN: విశాఖలోని పెద్దజాలరిపేట, వాసవానిపాలెం మత్స్యకారుల మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. రింగు వలల విషయంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో 6 బోట్లు తగులబెట్టి.. తమవాళ్లను ఐదుగురిని తీసుకెళ్లారని వాసవానిపాలెం గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తమ వారిని కొట్టడంతోనే బోట్లకు నిప్పంటించామని పెద్దజాలరిపేట వాసుల వాదన. ఈ క్రమంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

DISPUTE BETWEEN FISHERMEN, vishaka fishermen issues
రింగు వలల వివాదం
author img

By

Published : Jan 5, 2022, 9:43 AM IST

DISPUTE BETWEEN FISHERMEN : రింగు వలల వివాదం.. చినికి చినికి గాలివానైంది. మంగళవారం మత్స్యకార వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఊహించని పరిణామానికి అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. గత 8నెలలుగా వివాదం కొనసాగుతున్నా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించకపోవడంలో తీర ప్రాంతంలో తరచూ అలజడులు చెలరేగుతున్నాయి. గతంలో ఒకసారి గొడవలు జరిగాయి. ఆ సమయంలో యంత్రాంగం సమస్యను కొలిక్కి తీసుకురావడంలో సఫలం కాలేదు. ఏం జరగదులే అనే ధోరణిలో ఉండిపోవడంతో మరోసారి మత్స్యకారుల మధ్య స్పర్థలు బుసలు కొట్టి కొట్లాటకు దారి తీసిందనే విమర్శలు వస్తున్నాయి.

* అసలు ఏమిటీ వివాదం:

సాధారణంగా మూడు రకాల బోట్లపై చేపల వేట సాగిస్తారు. సంప్రదాయ మత్స్యకారులు తెప్పలు, మరికొందరు ఇంజిను బోట్లు, ఇంకొందరు మరపడవలను ఉపయోగిస్తారు. మరపడవలు తీరం నుంచి 15కిలోమీటర్లు పైబడి, తెప్పలు, ఇంజిను బోట్లు 5 కిలోమీటర్ల పరిధిలో వేట సాగిస్తాయి. జిల్లాలో ఒకప్పుడు 132 రింగు వలలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో 52 వలలు విశాఖ చేపల రేవు నుంచి పాయకరావుపేట తీరం వరకు ఉన్నాయి. వారికి లైసెన్సులు ఉన్నప్పటికీ రింగు వలలు వాడడం లేదు. మిగిలిన 80 వలలు ఎండాడ, మంగమారిపేట, భీమిలి మత్స్యకారుల వద్ద ఉన్నాయి. వీటిలో 19 వలలకు మాత్రమే అధికారిక అనుమతులు ఉన్నాయి. లైసెన్సులు ఉన్నవాటి కంటే ఎక్కువగా రింగు వలలను వినియోగిస్తూ ఎండాడ, మంగమారిపేట, భీమిలి మత్స్యకారులు వేట సాగిస్తున్నారనేది ఆరోపణ. వీరిని చినజాలరిపేట, పెద జాలారిపేట మత్స్యకారులు అడ్డుకుంటున్నారు. గత ఏడాది జూన్‌లో తొలిసారి వివాదం చెలరేగింది. అప్పటిలో పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు జోక్యం చేసుకొని వివాదాన్ని చల్లబర్చారు. కొన్నాళ్ల పాటు వేటను నిషేధించారు. ఆర్డీఓ కోర్టులో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి బైండోవరు చేశారు.

* ఫలించని ప్రజాప్రతినిధుల చర్చలు:

గతేడాది జులై నెలలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గవర్నర్‌ బంగ్లాలో రెండు వర్గాలతో సమావేశమై చర్చలు జరిపినా అవి అంతగా ఫలించలేదు. మళ్లీ ఆగస్టు 28న కలెక్టరేట్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌, మత్స్యశాఖ కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని ఇరువర్గాలను శాంతిపర్చే ప్రయత్నాలు చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని మంత్రి మత్స్యకార వర్గాలకు సూచించి మిన్నకుండిపోయారు. బీ మళ్లీ సెప్టెంబరు నుంచి రింగు వలలతో వేట ప్రారంభమవడంతో పలుమార్లు ఘర్షణలు జరిగాయి. దీంతో వాటిని వేటను నిషేధించాలని కోరుతూ మత్స్యకారులు ధర్నాలు చేశారు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బీ నవంబరు 2న జీవీఎంసీ నుంచి కలెక్టరేట్‌ వరకు 28 మత్స్యకార గ్రామాలకు చెందిన వారు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బీ డిసెంబరు నెలలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కార్యాలయం వద్ద కొంతమంది మత్స్యకారులు ఆందోళనకు దిగారు. మత్స్యశాఖ అధికారులను దాదాపు 12సార్లు కలిసి వినతులు అందజేశారు.

* హైకోర్టు ఆదేశాలు ఏం చెబుతున్నాయంటే: రింగు వలల వివాదం ఏపీ హైకోర్టు వరకు వెళ్లింది. దీనిపై గత ఏడాది మే నెలలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వలలు వినియోగించే ఇంజిను బోట్లు తీరం నుంచి 8 కిలోమీటర్లు దాటి వేట సాగించాలని ఆదేశించింది. కొత్తగా అనుమతులు, పునరుద్ధరణ చేయవద్దని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పాటించకుండా కొందరు తీరం నుంచి 3కిలోమీటర్ల లోపు రింగు వలలను వినియోగిస్తూ వేట సాగిస్తుండడం వివాదానికి కారణమవుతోంది.

* అనుమతులు తప్పనిసరి: బోట్ల నిర్వాహకులు ఎటువంటి వలలు వాడినా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ఎఫ్‌డీవో) నుంచి అనుమతులు తీసుకోవాలి. ఆయా వలలను చూపించి నిర్ణీత రుసుమును చెల్లించి లైసెన్సు పొందాలి. ఆరేడేళ్ల క్రితం అనుమతులు ఇచ్చిన రింగు వలలనే ఇప్పుడు వాడుతున్నారు. గత రెండేళ్ల నుంచి కొత్త వాటికి మత్స్యశాఖ అనుమతులు ఇవ్వడం లేదు.

రింగు వలల వివాదం

ఇదీ చదవండి: బూస్టర్‌ డోసుగా భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.