సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని తొండుపల్లి జంక్షన్ సమీపంలో నలుగురు వ్యక్తులు... వైద్యురాలిని నవంబర్ 27న అత్యాచారం చేసి హతమార్చిన ఘటన సంచలనం సృష్టించింది. దిశను ఓఆర్‌ఆర్ టోల్‌గేట్‌కు 50మీటర్ల దూరంలో అత్యాచారం చేసిన నిందితులు అనంతరం హత్య చేశారు. మృతదేహాన్ని వారి లారీలో షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి జాతీయ రహదారిపై ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి డీజిల్ పోసి నిప్పంటించారు.
భయంగా ఉందంటూ చెల్లికి ఫోన్...
శంషాబాద్‌కు చెందిన యువతి... మహబూబ్‌నగర్ జిల్లా కొల్లూరులో పశువైద్యురాలిగా పనిచేస్తోంది. చర్మ సంబంధిత వైద్యం కోసం స్కూటీపై.... గచ్చిబౌలికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. స్కూటీలో గాలి లేకపోవడం వల్ల రాత్రి 9గంటల సమయంలో... ఓ వ్యక్తి గాలి నింపుకొస్తానంటూ ద్విచక్రవాహనం తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని అక్కడి నుంచే తన సోదరికి ఫోన్‌లో వివరించింది. ఇద్దరు లారీ డ్రైవర్లు తనను వెంబడిస్తున్నారని, భయంగా ఉందని చెప్పి ఫోన్ పెట్టేసింది. రాత్రి పది దాటినా ఇంటికి రాకపోవడం వల్ల అనుమానించిన సోదరి. .. తొండుపల్లి టోల్‌గేట్ సమీపంలో గాలించింది. అయినా ఆచూకీ లభించలేదు. రాత్రి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
10 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు..
షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి జాతీయ రహదారి వంతెన కింద కాలుతున్న మృతదేహాన్ని గుర్తించిన గొర్రెల కాపరి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో శంషాబాద్ పోలీసులు మృతురాలి కుటుంబసభ్యులను తీసుకొని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం ఆనవాళ్లు వైద్యురాలివేనని గుర్తించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. 10 బృందాలుగా ఏర్పడి జాతీయ రహదారితో పాటు.. బాహ్యవలయ రహదారి చుట్టూ గాలించారు. సీసీ ఫుటేజీని విశ్లేషించారు. నిందితులను అదుపులోకి తీసుకుని ఘటనా స్థలంలో క్లూస్ టీంతో తనిఖీలు నిర్వహించారు.
దిశ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను కాల్చిన చోటే ఎన్‌కౌంటర్ చేసినట్లు సమాచారం. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులు వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు యత్నించిన నిందితులపై కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధరించారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. తెల్లవారుజామున నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు.
ఇవీ చూడండి: రాజధాని శివారులో యువ వైద్యురాలి దారుణహత్య