ETV Bharat / city

"దిశ కేసు నిందితుల మృతదేహాలకు మళ్లీ పోస్టుమార్టం..!" - justice for disha breaking news

దిశ కేసు నిందితుల మృతదేహాలకు మళ్లీ పోస్టుమార్టం చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. దిల్లీకి చెందిన వైద్యనిపుణులతో బోర్డు ఏర్పాటు చేసి శవపరీక్ష జరిపిస్తామని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు, న్యాయవ్యవస్థ తీరును ప్రపంచమంతా చూస్తోందని.. నిజాయతీని, పారదర్శకతను చూపాల్సిన అవసరం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

"దిశ కేసు నిందితుల మృతదేహాలకు మళ్లీ పోస్టుమార్టం..!"
"దిశ కేసు నిందితుల మృతదేహాలకు మళ్లీ పోస్టుమార్టం..!"
author img

By

Published : Dec 21, 2019, 12:06 AM IST

దిశ కేసు నిందితుల మృతదేహాలకు దిల్లీకి చెందిన నిపుణులతో మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని హైకోర్టు అభిప్రాయపడింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు హైకోర్టును కోరారు. ఆధారాల సేకరణ కోసం ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంటూ సుప్రీం ఇచ్చిన ఆదేశాలను సమర్పించారు.

సుప్రీం ఏం చెప్పిందంటే..?

  1. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిల ధర్మాసనం.. దిల్లీకి చెందిన నిపుణులతో వైద్య బోర్డు ఏర్పాటు చేసి మళ్లీ శవపరీక్ష జరిపిస్తామని పేర్కొంది.
  2. ఇతర రాష్ట్రాల నిపుణులతో రీ - పోస్టుమార్టం చేయించాలని పిటిషనర్లు అడగలేదని.. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
  3. ఆధారాల సేకరణ కోసం తగిన ఉత్తర్వులు ఇవ్వొచ్చునని సుప్రీంకోర్టు తమకు స్వేచ్ఛనిచ్చిందని హైకోర్టు తెలిపింది.
  4. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని.. రీపోస్టుమార్టం కోసం ఆదేశించే విచక్షణాధికారం హైకోర్టుకు ఉందని పేర్కొంది.
  5. ఒకవేళ మళ్లీ శవపరీక్ష అవసరమనుకుంటే.. తెలంగాణలో చాలా మంది ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారని అడ్వొకేట్ జనరల్ వాదించారు.

ప్రపంచం గమనిస్తోంది..!
ఎన్​కౌంటర్ పట్ల తెలంగాణ న్యాయ, పోలీసు వ్యవస్థ తీరును ప్రపంచమంతా గమనిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశమని పేర్కొంది. ఎన్​కౌంటర్ పై తాము అనుమానాలు వ్యక్తం చేయడం లేదని.. అయితే విచారణలో నిజాయితీ, పారదర్శకత ప్రదర్శించాలని అభిప్రాయపడింది.

సుప్రీం ఉత్తర్వులు అమలు చేస్తాం
పిటిషన్, సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను కొద్దిసేపటికే తమకు సమర్పించినందున.. కౌంటరు దాఖలు చేసేందుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ కోరారు. వాయిదా ఎందుకు వేయాలని.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తాము అమలు చేస్తామని.. తమ అధికారాలను ఎవరూ నియంత్రించలేరని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మృతదేహాలను అప్పగించాలా..? వద్దా..?
మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించే హక్కు కుటుంబసభ్యులకు ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వాన్ని అడిగి వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వం అభిప్రాయం అడిగి రేపు ఉదయం పదిన్నర గంటలకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెట్ రేపు వ్యక్తిగతంగా హాజరై.. మృతదేహాలు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

"రీ-పోస్టు మార్టంపై​ ఇవాళ ఉదయం పదిన్నరకు ప్రభుత్వ అభిప్రాయం తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రస్తుతం మృతదేహాలు ఏస్థితిలో ఉన్నాయో చెప్పాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​ను హైకోర్టు ఆదేశించింది"

ఇవీ చూడండి: దిశ' నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం..!

TG_HYD_04_19_DISHA_CASE_UPDATE_PKG_3066407 REPORTER:K.SRINIVAS NOTE:ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు. ( )దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తులో భాగంగా కాల్పులకు వాడిన తుపాకులను ఫోరెన్సిక్ పరీక్షలు పంపనున్నారు. నలుగురు నిందితులు ఎదురు కాల్పుల్లో మరణించడం వివాదాస్పదం కావడంతో... దీనిపై న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్ ) ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు ఇప్పటికే కాల్పుల్లో పాల్గొన్న సిబ్బంది వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు....LOOOOK V.O:దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణలో కాల్పులకు వాడిన ఆయుధాలకు ఫోరోన్సిక్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. నలుగురు నిందితులైన మహ్మద్ ఆరిప్ , జొల్లు శివ , బొల్లు నవీన్ . చింతకుంట చెన్న కేశవులు చటానపల్లి గ్రామం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. ఈ కాల్పుల ఉదంతంపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 6వ తేదీన కేసు నమోదైంది. అనంతరం విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది . కాల్పులకు దారితీసిన పరిస్థితులు ఏమిటి, నిందితులు తమ ఆయుధాలు లాక్కొని కాల్పులు జరిపారని పోలీసులు చెబుతున్న వాదన నిజమేనా, నిందితులకు బందోబస్తుగా వెళ్లిన పది మంది పోలీసులలో ఎవరు కాల్పులు జరిపారు, వారి వద్ద ఉన్న తుపాకులు ఎలాంటివి తదితర వివరాలను ఆరా తీసే ఉద్దేశంతోనే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు జ్యూడీషియల్ విచారణకు ఆదేశించడంతో త్వరలోనే కమిషన్ సభ్యులు హైదరాబాద్ రానున్నారు . V.O:ఎదురు కాల్పుల పై వీరు విచారణ జరపనున్నారు . వీరి విచారణ అంతా నిందితుల కాల్పులు , పోలీసుల ఎదురు కాల్పుల అంశం చుట్టూనే కేంద్రీకృతం కానుంది. దీనిలో భాగంగా కమిషన్ సభ్యులు పోలీసులు వాడిన ఆయుధాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. నిందితుల దేహాల్లో బుల్లెట్లు లేవు... అవన్నీ బయటకు వెళ్లిపోయాయి... దేహాలపై పడిన బుల్లెట్ గాయాలను బట్టి అవి ఏ ఆయుధానికి చెందినవో ఫోరెన్సిక్ విభాగంలోని బాలిస్టిక్ నిపుణులు చెబుతారు. ఈ కాల్పుల ఉదంతంలో పాల్గొన్న పది మంది పోలీసు సిబ్బంది వాడిన ఆయుధాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు . వీటిలో నిందితులు లాక్కున్నారని చెబుతున్న రెండు ఆయుధాలు కూడా ఉన్నాయి . పరీక్షల నిమిత్తం వీటన్నింటినీ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు . ప్రతి ఆయుధాన్ని నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఏ ఆయుధం నుంచి వచ్చిన తూటా ఎవరి శరీరంలోకి వెళ్లింది, వంటి వివరాలతో కూడిన నివేదికను నిపుణులు సిద్ధం చేయనున్నారు . జ్యుడీషియల్ కమిషన్ జరిపే విచారణలో ఈ నివేదిక కీలకం కానుంది. OVER...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.