ETV Bharat / city

శంషాబాద్ ఎయిర్​పోర్టులో డిజియాత్ర సేవలు ప్రారంభం

Digi yatra services at Hyderabad Airport ప్రయాణికులు ఎదురూచూడాల్సిన అవసరం లేకుండా శంషాబాద్​ విమానాశ్రయంలో సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టారు. దేశంలో ఈ తరహా సేవలు అందుబాటులోకి ఉన్న ఐదు విమానాశ్రయాల్లో హైదరాబాద్​ ఎయిర్​పోర్టు ఒకటిగా నిలిచింది. ప్రయాణికులు క్యూలైన్లలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా కేంద్రం తీసుకొచ్చిన ఈ సరికొత్త టెక్నాలజీ డిజి యాత్ర. శంషాబాద్ ఎయిర్​పోర్టులో డిజియాత్ర సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Shamshabad airport
శంషాబాద్​ విమానాశ్రయం
author img

By

Published : Aug 19, 2022, 10:45 AM IST

Digi yatra services at Hyderabad Airport : హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిజియాత్ర సేవలు అందుబాటులోకి వచ్చాయి. తనిఖీలు, ధ్రువీకరణ పత్రాల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు చూస్తున్నారు. అలాగే ప్రయాణికులు వేచి ఉండే అవసరం లేకుండా ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాంకేతికత సాయంతో విమానాశ్రయంలో ప్రయాణికులు టెర్మినల్స్‌కు చేరుకునే సదుపాయంలో భాగంగా కేంద్రం దీనికి శ్రీకారం చుట్టింది.

ఈ సాంకేతికతను ఎయిర్‌పోర్టు ముఖ్య కార్యనిర్వాహణాధికారి ప్రదీప్‌ఫణీకర్‌ అధికారికంగా ప్రారంభించారు. డిజియాత్ర యాప్‌ సాయంతో ప్రవేశించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇ-గేట్‌ను కేటాయించారు. అనంతరం ఓ ప్రయాణికుడు యాప్‌ సేవలతో ముఖ గుర్తింపు సాంకేతికతతో విమానాశ్రయంలోకి వెళ్లాడు. దేశంలో ఈ తరహా సేవలు అందుబాటులోకి వచ్చిన ఐదు విమానాశ్రయాల్లో హైదరాబాద్‌ ఒకటి కావడం విశేషం.

ఎలా ఉపయోగించాలి.. ఈ సౌలభ్యాన్ని వినియోగించుకునేందుకు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్‌లో డిజియాత్ర యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఆధార్‌/డ్రైవింగ్‌ లైసెన్స్‌ నెంబరును నమోదు చేయాలి. దీని ఆధారంగా డేటాబేస్‌ నుంచి ఆ యాప్‌ ఇ-కేవైసీ వివరాలు తీసుకుంటుంది. దీని ఆధారంగా ముఖ గుర్తింపు తీసుకునేందుకు ప్రయాణికులు సెల్ఫీ తీసుకోవాలి.

అనంతరం తమ డిజియాత్ర ఐడీలను విమాన బుకింగ్‌లు లేదా బోర్డింగ్‌ పాస్‌తో అనుసంధానించుకోవాలి. దీని సాయంతో ప్రయాణికులు నిర్దేశిత చెక్‌పాయింట్ల వద్ద ముఖ గుర్తింపు వ్యవస్థ ఆధారంగా నేరుగా వెళ్లవచ్చు. టికెట్లు/బోర్డింగ్‌ పాస్‌ల కోసం భౌతిక గుర్తింపు కార్డులను చూపించనక్కర్లేదు. క్యూలో నిలబడే సమయం తగ్గుతుంది. ఈ యాప్‌ వినియోగం ఐచ్ఛికమేనని, నాన్‌ బయోమెట్రిక్‌ వ్యవస్థ సైతం అందుబాటులో ఉంటుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.