ETV Bharat / city

వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సర్వం సిద్ధం - ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర ఆస్తుల నమోదు

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆన్‌లైన్‌లోనే... మ్యుటేషన్‌ ఫీజు, రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లింపునకు అవకాశం కల్పించిన ప్రభుత్వం క్రయ, విక్రయదారులు, సాక్షుల హాజరు తప్పనిసరని స్పష్టం చేసింది. నమూనా రిజిస్ట్రేషన్లు సైతం ప్రారంభించిన సర్కారు... ఇకపై అరగంటలోనే మ్యూటేషన్లు పూర్తి చేయనున్నట్టు వెల్లడించింది.

dharani portal ready for non agriculture assets registrations
వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సర్వం సిద్ధం
author img

By

Published : Nov 21, 2020, 9:17 AM IST

రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధమైంది. సెప్టెంబరు 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్‌ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నెల 23వ తేదీ నుంచి ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియతోపాటు మ్యూటేషన్లు పూర్తి చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఇప్పటికే ధరణి పోర్టల్‌లో నమోదు చేసి.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సరళతరం చేసింది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కేవలం అరగంటలో పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది.

మ్యుటేషన్లు ఇక అక్కడే

ధరణి పోర్టల్‌లోని ఎరుపు రంగు విండో ద్వారా రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్‌ వేగంగా పూర్తయ్యేలా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించనుంది. రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ నెల 23 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది. గ్రామపంచాయతీలు, మున్సిపల్‌ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా... సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే మ్యుటేషన్లు పూర్తి అవుతాయని ప్రభుత్వం వెల్లడించింది.

ఎలా అంటే..?
వ్యవసాయేతర భూములు, ఆస్తుల హక్కుల మార్పిడి, క్రయవిక్రయ రిజిస్ట్రేషన్‌ లావాదేవీల కోసం ధరణి పోర్టల్‌లోని ఎరుపు రంగు విండోను క్లిక్‌ చేసిన తర్వాత వచ్చే పేజీలో ‘సిటిజన్‌ స్లాట్‌ బుకింగ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ సిటిజన్‌ లాగిన్‌ పేజీలో మొబైల్‌ నంబర్‌ నమోదు చేయగానే వచ్చే వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్‌ నంబర్, క్రయ, విక్రయదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. స్లాట్‌ బుక్‌ కాగానే క్రయవిక్రయదారుల మొబైల్‌ నంబర్‌కు వచ్చే వివరాల ప్రకారం....అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్షులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అప్పుడు స్లాట్‌ బుకింగ్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ దస్తావేజుకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తారని, నిర్దేశిత స్టాంపు డ్యూటీ, ఇతర చార్జీలను ఆన్‌లైన్‌లో ఈ–చలాన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత సాక్షులు, క్రయ, విక్రయదారుల వివరాలు, బయోమెట్రిక్‌ ఆధారాలను డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తీసుకుంటారని, ఇది పూర్తికాగానే సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తారని వివరించింది. ఆ వెంటనే మ్యుటేషన్‌ కూడా పూర్తవుతుందని తెలిపింది.

ఇదీ చూడండి: ఎట్టకేలకు నేటి నుంచి గాంధీలో సాధారణ సేవలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.