ETV Bharat / city

మృతదేహాన్ని మోసుకెళ్లిన పోలీసులు.. అభినందించిన ఏపీ డీజీపీ

గుర్తు తెలియని మృతదేహన్ని భుజాలపై మోసుకుంటూ మార్చురీకి తరలించిన విశాఖ పోలీసులను ఏపీ డీజీపీ గౌతమ్​ సవాంగ్​ అభినందించారు. కరోనా సమయంలో వారు చూపిన మానవత్వాన్ని ఆయన కొనియాడారు.

ap dgp
పోలీసులపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్​
author img

By

Published : Mar 28, 2021, 4:24 PM IST

ఏపీలోని విశాఖ జిల్లా రాంబిల్లి మండల పరిధిలోని సీతపాలెం సముద్ర తీరాన ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చుట్టుపక్కల గ్రామాలకు సమాచారం అందించినా.. ఎవరూ ముందుకు రాలేదు.

కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆ మృతదేహాన్ని రాంబిల్లి ఎస్సై, ఏఎస్సై దొర, హెడ్​కానిస్టేబుల్ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు, హోంగార్డ్ కొండబాబులు ఎలమంచిలి మార్చురీకి తరలించారు. మూడు కిలోమీటర్లు తమ భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లి మానవత్వం చాటారంటూ ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు.

ఇవీచూడండి: గజరాజు వీరంగం- వ్యక్తి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.