ETV Bharat / city

జగన్‌ను విమర్శిస్తే చాలు.. కేసులతో ఇబ్బంది పెడుతున్నారు: దేవినేని

author img

By

Published : May 1, 2021, 10:27 PM IST

వైకాపా ప్రభుత్వంపై ఏపీ మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే... కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్యకేసుపైనా సమగ్ర దర్యాప్తు జరపాలని... ఈ కేసులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.

devineni uma spoke ycp
జగన్‌ను విమర్శిస్తే చాలు.. కేసులతో ఇబ్బంది పెడుతున్నారు: దేవినేని

జగన్‌ను విమర్శిస్తే చాలు.. కేసులతో ఇబ్బంది పెడుతున్నారు: దేవినేని

సీఎం జగన్‌ను విమర్శిస్తే చాలు.. కేసులతో ఇబ్బంది పెడుతున్నారని ఏపీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు. ఏపీలోని మంగళగిరిలో రెండోరోజు దేవినేని ఉమను అధికారులు విచారించారు. 9 గంటల విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండో రోజు తనను 9 గంటలు కూర్చోబెట్టి... మళ్లీ 4న రమ్మన్నారని దేవినేని వివరించారు.

ఎన్ని రోజులు పిలిస్తే అన్ని రోజులు విచారణకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి ట్వీట్‌లను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. వైఎస్‌ వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: జూపార్కులు, టైగర్​ రిజర్వులు మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.