ETV Bharat / city

ఉప సభాపతి ప్రజాదర్బార్​

author img

By

Published : Oct 23, 2019, 9:50 PM IST

సికింద్రాబాద్​ నియోజకవర్గం పరిధిలో ప్రతివారం ప్రజాదర్బార్​ కార్యక్రమం నిర్వహిస్తామని శాసనసభ ఉపసభాపతి పద్మారావు గౌడ్​ తెలిపారు. వారానికో బస్తీలో అధికారులు, స్థానికులతో సమావేశం ఏర్పాటుచేసి.. సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

ప్రజాదర్బార్​కు శ్రీకారం చుట్టిన ఉప సభాపతి

శాసనసభ ఉపసభాపతి పద్మారావు గౌడ్ తన నియోజకవర్గం పరిధిలో సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్​ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో వారం ఒక్కో బస్తీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. గత యాభై ఏళ్లలో పరిష్కారానికో నోచుకోని ఎన్నో సమస్యలను తాము కేవలం ఐదేళ్లలోనే పూర్తి చేస్తామని పద్మారావు గౌడ్​ తెలిపారు. సమస్యల పరిష్కారాన్ని నిరంతర ప్రక్రియగా చేపడుతున్నామని.. అన్ని శాఖల అధికారులతో బస్తీల్లో ముఖాముఖి నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సీతాఫల్​ మండిలోని ప్రభుత్వ జూనియర్​ కళాశాల ఏర్పాటు, మంచి నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం, రహదారుల విస్తరణ వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందిరానగర్​, చిలకలగూడ, మధురానగర్​, మేదిబవి, మనికేశ్వర్​ నగర్​, బీదల బస్తీల వాసులు పలు సమస్యలను ఉపసభాపతి దృష్టికి తీసుకువచ్చారు. సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ముషీరాబాద్​లో 91 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు.

ప్రజాదర్బార్​కు శ్రీకారం చుట్టిన ఉప సభాపతి

ఇవీచూడండి: షీటీమ్స్​కు ఐదేళ్లు: చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమం

శాసనసభ ఉపసభాపతి పద్మారావు గౌడ్ తన నియోజకవర్గం పరిధిలో సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్​ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో వారం ఒక్కో బస్తీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. గత యాభై ఏళ్లలో పరిష్కారానికో నోచుకోని ఎన్నో సమస్యలను తాము కేవలం ఐదేళ్లలోనే పూర్తి చేస్తామని పద్మారావు గౌడ్​ తెలిపారు. సమస్యల పరిష్కారాన్ని నిరంతర ప్రక్రియగా చేపడుతున్నామని.. అన్ని శాఖల అధికారులతో బస్తీల్లో ముఖాముఖి నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సీతాఫల్​ మండిలోని ప్రభుత్వ జూనియర్​ కళాశాల ఏర్పాటు, మంచి నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం, రహదారుల విస్తరణ వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందిరానగర్​, చిలకలగూడ, మధురానగర్​, మేదిబవి, మనికేశ్వర్​ నగర్​, బీదల బస్తీల వాసులు పలు సమస్యలను ఉపసభాపతి దృష్టికి తీసుకువచ్చారు. సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ముషీరాబాద్​లో 91 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు.

ప్రజాదర్బార్​కు శ్రీకారం చుట్టిన ఉప సభాపతి

ఇవీచూడండి: షీటీమ్స్​కు ఐదేళ్లు: చార్మినార్ వద్ద ప్రత్యేక కార్యక్రమం

Intro:For scrolling/ప్రచురణార్ధం...
‘పజ్జన్న’ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన
+ వందల దరఖాస్తుల పరిష్కారం + 90 లక్షల విలువ జేసే చెక్కుల పంపిణి
సికింద్రాబాద్, అక్టోబర్ 23 : నిత్యం ప్రజల ముంగిటే నిలుస్తు ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాముఖ్యతను కల్పించే ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తాజాగా మరో విభిన్న ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వారనికోరోజు ఒక్కో బస్తీ లో నిర్వహించే ‘ప్రజా దర్బార్’ కార్యక్రమనికి బుధవారం శ్రీకారం చుట్టారు. సీతాఫల మండి మేడిబాయి ఆర్య సమాజ్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం కోలాహలంగా సాగింది. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంఘాల నేతలు, పెద్ద సంఖ్యలో సామాన్య పౌరులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా పరిష్కరించని ఎన్నో సమస్యలు కేవలం ఐదేళ్ళ కాలంలో చేపట్టామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం నిరంతర ప్రక్రియ గా చేపదుతున్నామని, అందుకే అన్ని విభాగాల అధికారులతో కలిసి ఆయా బస్తిల్లో ముఖాముఖీ లు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. అభివృధి కార్యక్రమాలు ఓ వైపు, సంక్షేమ కార్యకలాపాలు మరో వైపు సమానంగా సాగేలా ఏర్పాట్లు జరిపామని తెలిపారు. అందుకే 50 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచని ఎన్నో సమస్యలు కేవలం 5 సంవత్సరాల్లో పరిష్కరించి అభివృద్ధికి బాటలు పరిచామని, ఉదాహరణకు సితఫలమండి లో ప్రభుత్వ జూనియర్/డిగ్రీ కాలేజీల ఏర్పాటు, తుకారం గేట్ వద్ద RUB నిర్మాణం, ముల్తిపర్పాస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం, మంచి నీటి ఎద్దడి శాశ్వత నివారణ, వరదల వల్ల ఇబ్బందుల నివారణకు 7 కల్వర్టుల విస్తరణ, రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం, Telangana రాష్ట్రంలోనే మోడల్ గా నిలిచేలా చిలకలగూడ ఈద్గా అభివృద్ధి, multipurpose function hall వంటి ఎన్నో పనులు ఉన్నాయి. ఇక 2009 నుంచి 2014 వరకు 6500 మందికి నెలకు కేవలం 200 రూపాయల పెన్షన్లు అందించేవారని, మూడు నెలలకు ఒక్క సారి ఇచ్చే ఆ పెన్షన్ డబ్బులకు దళారిలను ఆశ్రయించాల్సి వచ్చేదని, చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేదని వివరించారు. 2014 జూన్ లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని 5 డివిజన్లలో 16 వేలమందికి పైగా లబ్దిదారులకు ఆసరా పెన్షన్లు లభిస్తున్నాయి. లబ్దిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు చెల్లిస్తున్నారు. సవరించిన పెన్షన్లు కూడా చెల్లించేలా ఏర్పాట్లు జరిపాము. MRO లకు సైతం పెన్షన్ దారుల సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించాలనే ఆదేశాలను జారి చేశామని, నామలగుండు క్యాంపు కార్యాలయంలో కూడా సిబ్బంది అందుబాటులో వుంటారని తెలిపారు. పెన్షన్ పొందేందుకు, కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ వంటి పధకాలకు ఎవ్వరు దళారిలను ఆశ్రయించవద్దని పద్మారావు గౌడ్ సూచించారు. అదే విధంగా తమ చొరవతో CMRF చెక్కుల మంజూరులో తెలంగాణా రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో వుందని, ప్రస్తుతం వరకు CMRF లో భాగంగా 3300 చెక్కులు రూ. 32 కోట్లు, కళ్యాణ లక్ష్మి/ శాదిముబరాక్ పధకంలో భాగంగా సుమారు 2100 మందికి రూ.16 కోట్లు అందించమని తెలిపారు. ప్రజా దర్బార్ లో భాగంగా పెద్ద సంఖ్యలో పెన్షన్ దరఖాస్తుదారుల వివరాలను RDO, MRO ల ద్వారా నమోదు చేసుకొని ఆయా దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా పద్మారావు గౌడ్ ఏర్పాట్లు జరిపారు. వివిధ ప్రాంతాల్లోని పౌరులు జనావాసాల మీదుగా సాగే విద్యుత్ తీగలు, మురుగునీటి ప్రవాహం, పరిసరాల పరిశుబ్రత,మనికేశ్వరి నగర్ లో RUB నిర్మాణం, ఇందిరానగర్, చిలకలగూడ, మధురానగర్, మేదిబవి, మనికేశ్వరి నగర్, బీదల బస్తి ప్రాంతాలకు చెందిన పలు సమస్యలను ప్రస్తావించగా అప్పటికప్పుడే వాటి పరిష్కార భాద్యతలను సంభందిత అధికారులకు అప్పగించారు. ghmc ఉత్తర మండలం జోనల్ కమీషనర్ శంకరయ్య, ఉప కమీషనర్ రవి కుమార్, RDO రాజా గౌడ్, సిటీ ప్లానర్ ప్రసాద్, ట్రాఫిక్ acp వెంకట రమణ, జల మండలి జీ ఎం రాజశేఖర్, జిల్లా పౌర సరఫరాల అధికారిణి పద్మ, MRO షర్మిల, Transco ADE Balu Naik, ghmc అధికారులు ప్రమోద్ కుమార్, అనురాధ, గంగాధర్,డాక్టర్ రవీంద్ర గౌడ్, వైద్యాధికారి డాక్టర్ సక్కు బాయిలతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, corporatorlu సామల హేమ, అలకుంట సరస్వతి హరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ముషీరాబాద్ మండలానికి సంభందించిన 91 మంది లబ్దిదారులకు సుమారుగా రూ. 91 లక్షల మేరకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు.
PRESS NOTE:
Mr Theegulla Padmarao Goud, Deputy Speaker, who always prefer to be amidst public and redress their greviencnes has launched another programme by name ‘praja darbar’ at sitafalamandi today. Officials of all departments including Zonal Commissioner Mr Shankarayya, Deputy Commissioner Mr Ravi Kumar and Corporators Ms Samala Hema, Mrs Alakunta Saraswathi pariticpated in this programme. Speaking on this occasion Mr Padmarao Goud, Deputy Speaker stated that the issues which remained unresolved since decades are being taken up since last 5 years. He explained that many prestigious projects were started during his regime. He stated that he is stating various steps to ensure that touts and middlemen are prevented in benefitting poor people of Government Schemes. Mr Padmarao Goud emphasished that all Government Officials should give top prority for redressal of public greviences on time bound manner. He said that hence forth every Wednesday will be the day for all officials of GHMC, Water Works, Transco etc to reach to public to know their complaints. Later he disbursed cheques of worth more than Rs.90 lakhs to the beneficieries of Kalyana Laxmi and Shadi Mubarak schemes.Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.