ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అమెరికా, కెనడా దేశాల్లో మద్యం దుకాణాల నుంచి రష్యన్ వోడ్కాను తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రష్యాలో తయారైన అన్ని మద్యం బ్రాండ్లను తొలగించాలని ఆ దేశాల్లోని కొన్ని రాష్టాలు అధికారికంగా ఆదేశాలు జారీ చేసినట్టు ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది.
పశ్చిమ దేశాలు హెచ్చరించినా వినకుండా రష్యా ఉక్రెయిన్‌పై యుద్దానికి దిగింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఫిబ్రవరి 24న ప్రకటించారు. యుద్ధం మొదలైన నాలుగు రోజుల్లోనే రష్యా భారీ నష్టం చవిచూసిందని బ్రిటన్ రక్షణ శాఖ అంచనావేసింది. ఇప్పటివరకు 5,000లకు పైగా రష్యన్ సైనికులను చనిపోయి ఉంటారని తెలిపింది.
ఇదీ చూడండి: