ETV Bharat / city

'పది లక్షల ఎకరాల్లో సన్నాలు పండాలి' - సమగ్ర సాగుకు తెలంగాణ సన్నద్ధం

ఈ దఫా సన్నాలను కనీసం పది లక్షల ఎకరాల్లో పండించాలనేది వ్యూహం. అందుకు అనుగుణంగా తెలంగాణ సోనా(ఆర్‌ఎన్‌ఆర్‌), హెచ్‌ఎంటీ, బీపీటీ 5201, జైశ్రీరాం, గంగా-కావేరి, చింటూ రకాలను పండించాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించింది.

demanded crop will be cultivated in telangana state in kharif season
గిరాకీకే ప్రాధాన్యం
author img

By

Published : May 24, 2020, 5:52 AM IST

Updated : May 24, 2020, 9:18 AM IST

తెలంగాణ రైతులు గంపగుత్తగా లావు రకం ధాన్యాన్ని సాగు చేస్తుండటంతో గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఈ పరిస్థితి నుంచి రైతాంగాన్ని గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. దేశీయంగా ఎక్కువ మంది వినియోగించే బియ్యం రకాలేమిటి? అంతర్జాతీయంగా గిరాకీ ఉన్న ధాన్యం రకాలేవి? వాటిని ఏయే దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంది? తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఐఏఎస్‌ అధికారి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలని నిర్ణయించింది.

విపణిలో గిరాకీ ఉన్న పంటలనే పండించేలా, సాగు విధానంలో సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఈ వానాకాలం నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. లావు రకం ధాన్యంలో 1010, 1064, 2636, ఎంటీయూ 1061 రకాలను గుర్తించింది.

2636, 1064 రకం బియ్యానికి ఆఫ్రికా దేశాల్లో మంచి గిరాకీ ఉన్నట్లు గుర్తించారు. ఇలా ఏఏ కాలాల్లో ఎలాంటి వరి రకాలను రైతులు పండించాలి? ఎంత విస్తీర్ణంలో సాగుచేయాలి? వాటికి వివిధ దేశాల్లో ఉన్న గిరాకీ ఎంత? అనే విషయమై సమగ్ర కాల పట్టిక ఖరారు చేసే పనిని ప్రభుత్వం కమిటీకి అప్పగించనుంది. కమిటీలో జాయింట్‌ కలెక్టర్‌ స్థాయి అధికారులు నలుగురు ఉంటారు. వారి ఎంపిక పూర్తయినట్టు తెలిసింది. త్వరలో వారి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.

రూపుమారనున్న పౌర సరఫరాల శాఖ

ప్రస్తుతం రేషన్‌కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయటమే ప్రధాన విధిగా పౌర సరఫరాల శాఖ వ్యవహరిస్తోంది. రైతుల నుంచి ధాన్యం సేకరించి, బియ్యంగా మార్చి చౌకదుకాణాలకు పంపిణీ చేయటానికే పరిమితమైంది. ఇకపై బియ్యం పంపిణీతోపాటు, మార్కెటింగ్‌ ఏజెన్సీగానూ ఈ శాఖ వ్యవహరించనుంది. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, అంతర్జాతీయ విపణిలో బియ్యాన్ని ఎగుమతి చేసే దిశగానూ ఈ సంస్థ కార్యకలాపాలను కొనసాగించనుంది.

‘మేడిన్‌ తెలంగాణ’ దిశగా

రాష్ట్రంలో పండే ధాన్యంతోపాటు కందిపప్పు, పసుపు, అల్లం, వంట నూనెలు తదితర పంటలను ‘‘మేడిన్‌ తెలంగాణ’’ బ్రాండ్‌ పేరుతో మార్కెటింగ్‌ చేయాలన్నది సీఎం కేసీఆర్‌ వ్యూహం. అందులో భాగమే సంస్కరణలు. ఆఫ్రికా దేశాలు, మలేసియా, థాయిలాండ్‌, అమెరికా వంటి దేశాల్లో గిరాకీ ఉన్న రకాలను సాగు చేయించి, ఎగుమతి చేస్తే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ధరలు పడిపోవడానికి, అన్నదాతలు నష్టపోయేందుకు అవకాశం ఉండదు. ఇలాంటివన్నీ అధ్యయనం చేసేందుకే కమిటీని నియమించాలని నిర్ణయించాం.

- గంగుల కమలాకర్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి

Last Updated : May 24, 2020, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.