ETV Bharat / city

జాతీయ మార్కెట్‌లో వేరుసెనగకు పెరిగిన డిమాండ్

సాగు తగ్గడం, వంటనూనె ధర పెరగడం.. ఈ యాసంగిలో వేరుసెనగ రైతులకు కలిసొచ్చింది. దిగుబడులు తగ్గిపోతాయని.. అధిక ధర చెల్లించి మరి వ్యాపారులు పల్లిని కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలో మేలైన వేరుసెనగ పంట పండే ప్రాంతంగా పేరుగాంచిన వనపర్తి జిల్లాలో ఈ సీజన్​లో గరిష్ఠ ధర వస్తోంది.

demand-for-groundnut-has-increased-in-national-market
జాతీయ మార్కెట్‌లో వేరుసెనగకు పెరిగిన డిమాండ్
author img

By

Published : Feb 7, 2021, 6:50 AM IST

ప్రస్తుత యాసంగిలో దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం పడిపోవడం, వంటనూనె ధర మండుతున్నందున వేరుసెనగ పంటకు వ్యాపారులు అధిక ధర చెల్లిస్తున్నారు. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణ విస్తీర్ణం 17.90 లక్షల ఎకరాలకు 11.70 లక్షల ఎకరాల్లోనే సాగయింది. తెలంగాణలో సైతం ఈ సీజన్‌ సాధారణ విస్తీర్ణం 3.05 లక్షల ఎకరాలకు గాను లక్షా 90 వేల ఎకరాల్లోనే వేశారు. ఈ పంట అధికంగా సాగుచేసే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రైతులు సాగునీటి లభ్యత కారణంగా వరి వైపు మొగ్గుచూపారని వ్యవసాయశాఖ తెలిపింది. దిగుబడులు తగ్గిపోతాయనే అంచనాలతో వ్యాపారులు అధిక ధరలు చెల్లించి పంటను కొంటున్నారు.

గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ పంట క్వింటా ధర ప్రస్తుతం రూ.7 వేల నుంచి 8 వేల వరకు పలుకుతోంది. దేశంలోనే నాణ్యమైన వేరుసెనగ విత్తనాలను పండించే ప్రాంతంగా తెలంగాణకు పేరున్నందున ఇక్కడి పంటను వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. రాష్ట్రంలో మేలైన వేరుసెనగ పంట పండే ప్రాంతంగా పేరున్న వనపర్తి జిల్లాలో ఈ సీజన్‌లో గరిష్ఠ ధర వస్తోంది. గత నెల 28న అత్యధికంగా క్వింటాకు రూ.8420 చొప్పున చెల్లించి వ్యాపారులు కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం అని మార్కెటింగ్‌ శాఖ తెలిపింది. ఈ ఏడాది (2020-21)లో వానాకాలం (ఖరీఫ్‌), యాసంగి (రబీ)లో దేశవ్యాప్తంగా రైతులు పండించే ఈ పంటకు మద్దతు ధర క్వింటాకు రూ.5275 చొప్పున చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. కానీ గత రెండు నెలలుగా రూ.6 వేలకు తగ్గకుండా వ్యాపారులు చెల్లిస్తున్నారు.

ఎందుకింత డిమాండు?

వేరుసెనగకు డిమాండు పెరగడానికి అనేక కారణాలున్నాయి. వంటనూనెలకు నూనెగింజల పంటల కొరత, విదేశీ మార్కెట్లలో వంటనూనెల ధరల పెరుగుదలతో ఇక్కడి పంటకు డిమాండు పెంచింది. కరోనా తరవాత చైనా వంటనూనెలు, వేరుసెనగల దిగుమతులు బాగా పెంచింది. భారతదేశం నుంచి నాణ్యమైన వేరుసెనగలను, ఈ నూనెలను దిగుమతి చేసుకుంటోంది. మనదేశంలో నాణ్యమైన వేరుసెనగ నూనె ఉత్పత్తి గుజరాత్‌లో జరుగుతోంది. అక్కడి నూనె మిల్లులు గతేడాది ఇదేరోజుల్లో టన్ను వేరుసెనగ నూనెను రూ.లక్షా 10 వేలకు అమ్మగా ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌ డిమాండు కారణంగా రూ.1,42,500కు పెంచాయి. ఏడాది వ్యవధిలో 30 శాతం ధర పెరగడం గత దశాబ్దంలో ఎన్నడూ లేదని తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం లీటరు వేరుసెనగ వంటనూనెను రూ.150 దాకా అమ్మడానికి గుజరాత్‌ మార్కెట్‌లో ఏర్పడిన డిమాండే కారణం. గత వానాకాలం (జూన్‌-సెప్టెంబరు) సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణ విస్తీర్ణం కోటీ 4 లక్షల ఎకరాలకు గాను రికార్డుస్థాయిలో కోటీ 25 లక్షల ఎకరాల్లో సాగైంది. గత నాలుగేళ్ల వానాకాలం సీజన్‌లో ఇంత ఎక్కువ విస్తీర్ణంలో వేయడం ఇదే ప్రథమం. పంట దిగుబడి కూడా వానాకాలంలో 95.35 లక్షల టన్నులు వచ్చిందని కేంద్ర అర్థగణాంక శాఖ విడుదల చేసిన ముందస్తు అంచనాల్లో వెల్లడించింది. గత 20 ఏళ్ల వానాకాలం సీజన్‌లో ఇంత భారీ దిగుబడి ఎన్నడూ రాలేదు. ఈ దిగుబడి కారణంగా పంట ధర పడిపోవచ్చని యాసంగి ఆరంభంలో అంచనా వేశారు. కానీ యాసంగి సీజన్‌లో సాగు విస్తీర్ణం పడిపోవడం, అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లలో వంటనూనెల ధరల పెరుగుదల వేరుసెనగలకు రెక్కలొచ్చాయి.

3 ఎకరాలకే రూ.లక్షా 20 వేలు వచ్చాయి

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు రామచంద్రయ్య. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం శాగాపూర్‌లో 3 ఎకరాల్లో వేరుసెనగ పంటను సాగుచేశారు. ఎకరానికి రూ.25 వేల దాకా పెట్టుబడి పెట్టారు. మొత్తం 20 క్వింటాళ్ల దిగుబడి రాగా వనపర్తి మార్కెట్‌కు అమ్మకానికి తెచ్చారు. క్వింటాకు రూ.6,030 చొప్పున చెల్లించి వ్యాపారులు కొనడంలో మొత్తం రూ.లక్షా 20 వేలకు పైగా వచ్చాయని చెప్పారు. తాను 20 ఏళ్లుగా ఈ పంట సాగుచేస్తున్నా ఇంత డిమాండు ఎప్పుడూ చూడలేదన్నారు. పెట్టుబడి ఖర్చులు పోను రూ.45 వేలు మిగిలాయన్నారు. ధర తగ్గకుండా చూడాలని ఆయన కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.