ETV Bharat / city

TSRTC: ప్రజారవాణాలో తగ్గిపోతున్న ఆర్టీసీ ప్రాభవం.. కోట్లలో నష్టం

ఆర్టీసీ(TSRTC) ప్రాభవం రోజురోజుకూ తగ్గిపోతుంది. కోలుకునే దశలోనే రోజూ కోటిన్నర నష్టం వాటిల్లుతోంది. విస్తరణకు నోచుకోక ఏడాదికి సుమారు 250 బస్సులు తుక్కుగా మారుతున్నాయి. ప్రభుత్వం దృష్టి పెడితే సంస్థను గాడిన పెట్టవచ్చని ఆర్టీసీ అధికారులు అంటున్నారు.

TSRTC losses, decreasing TSRTC influence
ప్రజారవాణాలో తగ్గిపోతున్న ఆర్టీసీ ప్రాభవం, నష్టాల్లోనే ఆర్టీసీ
author img

By

Published : Jul 27, 2021, 9:57 AM IST

ఆర్టీసీ(TSRTC) గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఒడ్డున పడే సూచనలు కనిపించడంలేదు. 33 లక్షల మంది ప్రయాణికులు.. 3750 బస్సులు.. 80 మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు ఇలా నగర ప్రజారవాణాలో అగ్రగామిగా ఉన్న ఆర్టీసీ ఇప్పుడు రోజురోజుకూ ఆ ప్రాభవాన్ని కోల్పోతోంది. కేవలం 2750 బస్సులకు ఆర్టీసీ పరిమితమైపోయింది. ఏసీ బస్సుల ఊసే లేకుండా అయ్యింది. ఉన్న బస్సులు కూడా పూర్తిగా రోడ్డెక్కే పరిస్థితి లేదు. ఏటా 250 బస్సులు తుక్కుకు వెళ్తున్నాయి. 2009 నుంచి మధ్యలో మెట్రో లగ్జరీలు 80, వజ్ర బస్సులు 25 మినహా ఒక్క కొత్త బస్సు కొనలేదు. ఆర్టీసీ విస్తరణకు నోచుకోక.. రోజు రూ. కోటిన్నర నష్టాన్ని చవిచూస్తోంది.

టిక్కెటేతర ఆదాయం పట్టదు..?

టిక్కెటేతర ఆదాయం సమకూర్చుకున్నప్పుడే అప్పుల ఊబి నుంచి ఆర్టీసీ బయటపడుతుందనేది స్పష్టమైన సంకేతం. ఆ దిశగా అడుగులు పడడంలేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌లో మొత్తం 8 కమ్యూనిటీ సెంటర్లున్నాయి. మిథాని, ఫరూక్‌నగర్‌, హయత్‌నగర్‌ కమ్యూనిటీ ఎమినిటీ సెంటర్లు ఇటీవల నిర్మించినవి కాగా.. పటాన్‌చెరు, కూకట్‌పల్లి, ఈసీఐఎల్‌, కోఠి, కాచిగూడ ఇప్పటికే నిర్మించారు. ఆయా సెంటర్లలో ఉన్న మల్గీలను అద్దెలకు ఇచ్చుకొని ఆదాయాన్ని సమకూర్చుకోవచ్ఛు కాని మూడొంతులు ఖాళీగా ఉన్నాయి. నగరంలో 29 డిపోలున్నాయి. ఇందులో పది వరకూ రోడ్డు పక్కన ఉన్నాయి. పెట్రోలు బంకులు ప్రారంభించి అద్దె పొందొచ్ఛు

డీజిల్‌ అదనపు భారం:

కరోనా తొలి దశలో ఆర్నెల్లు బస్సులు రోడ్డెక్కలేదు. నవంబరులో సాధారణ స్థితి నెలకొనడంతో ఫర్వాలేదనుకున్నాం. మార్చిలో రెండోదశలో అంతా తలకిందులైంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలతో బస్సులు నిండుతున్నాయి. సిబ్బంది పొదుపు చర్యలు చేపట్టి.. రికార్డు స్థాయిలో ఇంధన ఖర్చులు తగ్గించినా.. డీజిల్‌ ధరలు ఏడాదిలో లీటరుకు రూ.25 పెరగడంతో ఆర్టీసీపై భారం పడుతోంది. కార్గో సర్వీసులతో కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం. మిగతా ప్రణాళికలూ అమలైతే నష్టాలను అధిగమించగలమనే నమ్మకం ఉంది.

-వెంకటేశ్వర్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ

నష్టాలు అధిగమించే ప్రయత్నాలేవి:

ఆర్టీసీని క్రమేపి నష్టాల్లోకి నెట్టేస్తున్నారు. మెట్రో స్టేషన్లకు అనుసంధానం చేయాల్సిన వజ్ర బస్సులను తుక్కుగా మార్చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలకు నడిపిస్తే బాగుంటుంది. మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను జిల్లాలకు, దూర ప్రాంతాలకు తిప్పితే ఆదాయం వస్తుంది. జీహెచ్‌ఎంసీ నుంచి నిధులు అందజేసి ప్రజా రవాణాను గాడిన పడేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అధికారులు వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలేదు. సీఎం కేసీఆర్‌ దృష్టి పెడితే సంస్థ ఒడ్డున పడుతుంది.

-రాజిరెడ్డి, ఈయూ ప్రధాన కార్యదర్శి

  • గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌కు ఏటా నష్టం: రూ. 540 కోట్లు
  • గ్రేటర్‌ జోన్‌లో ఆర్టీసీ కమ్యూనిటీ ఎమినిటీ సెంటర్లు: 8
  • వ్యాపారానికి అందుబాటులో ఉన్న విస్తీర్ణం: 16 లక్షల చదరపు అడుగులు
  • ప్రస్తుతం వ్యాపారం సాగుతున్న విస్తీర్ణం: 4.5 లక్షల చదరపు అడుగులు

ఇదీ చదవండి: CORONA: కొవిడ్ తర్వాత గుండె వేగం పెరుగుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.